కార్ల తయారీలో మహారాణులు | Maruti Suzuki Manesar Plant Launches India First All Women Assembly Line, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కార్ల తయారీలో మహారాణులు

Mar 28 2026 8:41 AM | Updated on Mar 28 2026 11:07 AM

Maruti Suzuki Manesar Plant Launches India First All Women Assembly Line

మారుతీ సుజుకీ ప్లాంట్‌లో మహిళలకు ప్రత్యేక అసెంబ్లీ లైన్‌

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్‌లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది.

మహిళల చేతుల్లోనే కార్ల తయారీ

సాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్‌లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్‌లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్‌లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

Advertisement
 
Advertisement
Advertisement