Assembly line
-
కార్ల తయారీలో మహారాణులు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్‌లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది.మహిళల చేతుల్లోనే కార్ల తయారీసాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్‌లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.VIDEO | Manesar: Maruti Suzuki deploys first batch of 200 women employees on car manufacturing assembly line at Manesar plant.India’s largest carmaker has introduced a fully women-run assembly line for producing multiple models, marking a significant step towards inclusion in… pic.twitter.com/OGOzZRs4Wh— Press Trust of India (@PTI_News) March 27, 2026తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
అసెంబ్లీలో సంభాషణల వీడియో లీక్‌పై విచారణ జరపాలి
సాలూరు : అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే నోరు జారుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం విచారకరమని సాలూరు ఎ మ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీడిక రాజన్నదొర అన్నా రు. బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘట నలపై తీవ్ర వేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఫోన్లో ఇక్కడి విలేకరులతో మాట్లాడా రు. నిండు సభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బూతుపురాణం అందుకుని, సభ్యసమాజం తలదించుకునేలా దూషణలకు దిగడం, మొన్న సీఎం చంద్రబాబు నీ అం తు చూస్తానని బెదిరించడం వంటి ఘటనలు చూస్తుంటే చట్ట సభలు ఎటు పయనిస్తున్నా యో, రాజ్యాంగం ఏమౌతుందోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. ఇంత చేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా దుర్బాషలాడుతున్నట్టు వీడి యో క్లిప్పింగ్‌ను విడుదల చేసి అధికార పార్టీ నే తలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా బయటకు వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు సభలో ఏ సభ్యుడు ఏమి మాట్లాడారో వీడియో క్లిప్పింగ్‌లను క్షుణ్ణం గా పరిశీలించి విచారణ జరపాలన్నారు.


