అసెంబ్లీలో సంభాషణల వీడియో లీక్‌పై విచారణ జరపాలి | Assembly lines Video leak inquiry | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సంభాషణల వీడియో లీక్‌పై విచారణ జరపాలి

Mar 19 2015 2:51 AM | Updated on May 25 2018 9:20 PM

అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు

 సాలూరు : అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే నోరు జారుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం విచారకరమని సాలూరు ఎ మ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీడిక రాజన్నదొర అన్నా రు. బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘట  నలపై తీవ్ర వేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఫోన్‌లో ఇక్కడి విలేకరులతో మాట్లాడా రు. నిండు సభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బూతుపురాణం అందుకుని, సభ్యసమాజం తలదించుకునేలా దూషణలకు దిగడం, మొన్న సీఎం చంద్రబాబు నీ అం తు చూస్తానని బెదిరించడం వంటి ఘటనలు చూస్తుంటే చట్ట సభలు ఎటు పయనిస్తున్నా యో, రాజ్యాంగం ఏమౌతుందోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. ఇంత చేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా దుర్బాషలాడుతున్నట్టు వీడి యో క్లిప్పింగ్‌ను విడుదల చేసి అధికార పార్టీ నే తలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా బయటకు వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు సభలో ఏ సభ్యుడు ఏమి మాట్లాడారో వీడియో క్లిప్పింగ్‌లను క్షుణ్ణం గా పరిశీలించి విచారణ జరపాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement