నిర్మల వాణి
సంప్రదాయ కళలు, సంప్రదాయ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు – ఇవి మన దేశంలో వేల కొద్దీ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించాలి. కానీ మనం పాశ్చాత్య దేశాలచే ఎంతగా ప్రభావితులమయ్యామంటే, మన సంస్కృతిని మర్చిపోయి, బయటి విషయాలను అనుసరిస్తున్నాము. దీని కారణంగా మనలో మనం ఆత్మ’ అని పిలిచే అతి ముఖ్యమైన విషయం అజ్ఞానంతో కప్పబడుతుంది. మన దేశంలో ఆత్మను అలంకరించే వేలకొద్దీ విషయాలు ఉన్నాయి, అవి ఆత్మను అణచివేయవు.
మన కళ్ళు చాలా త్వరగా బాహ్యమైన విషయాలపై పడతాయి. కారణం మనం మనుషులం కాబట్టి, మన ధ్యాస బయట ఉంటుంది. కానీ మనల్ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు, మనం నవ్వుతూ మన లోపల ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆలోచిస్తాము! దానిని వదిలి మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆ స్థితిని సాధించలేదు, మనకు అది ఇంకా తెలియదు, అందుకే మనం అలా చేస్తున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమించుకోలేక పోతున్నాము, మన ఆత్మను పాడుచేసే వాటిని మనం ఇష్టపడతాము, ఆ విషయం మనం గ్రహించలేము. మన జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి.
సహజ యోగ ధ్యాన సాధన ద్వారా మానవుల లోపల కుండలినీ శక్తి జాగృతి చెందినప్పుడు, వారు భగవంతుని ఆశీస్సుల వలన ఆత్మ స్వరూపులుగా మారుతారు. ఆత్మికమైన శుభ లక్షణాలను పొందుతారు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆత్మకు ఉండే సహజ శుభ లక్షణాలైన అమాయకత్వం, పవిత్రత, మాతృ ప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలిసిపోయే స్వభావం, క్షమా గుణం వంటివి మన నిత్య జీవితంలో ఆచరించడం వలన మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం.
మీ లోపల ఉన్న ’ఆత్మ’ అనే వజ్రాన్ని బయటకు తీయండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. ఆ వజ్రం మెరుపు మీరే. మీ లోపల ఉన్న ఆ వజ్రం పైకి వచ్చినప్పుడు, ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఆ ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. స్త్రీలకు శాశ్వతమైన విలువను కలిగి ఉండే ఏదో ఒకటి ఉంది, దానిని వారు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప విషయం ఏమిటంటే స్త్రీ అందరినీ ప్రేమించగలదు, కానీ ఆమె స్వార్థపూరితంగా మారినప్పుడు, ఆమె ప్రేమలో అందం ఉండదు.
పురుషులలో ఆజ్ఞాపించే స్ఫూర్తి వారి మాటల ద్వారా, వారి చైతన్యం ద్వారా, వారి వ్యక్తిగత విజయాల ద్వారా వస్తుంది; అయితే స్త్రీలకు ఈ లక్షణాలు వారి ప్రేమపూర్వక శక్తి ద్వారా, వారి సహనం ద్వారా, వారి దయగల ప్రవర్తన, క్షమ, కరుణ ద్వారా వస్తాయని గ్రహించి, వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి.
విత్తనాలు స్వయంగా దేనినీ సృష్టించలేవు. పువ్వులు, పండ్లు, ఇతర వరాలను అందించేది భూమాత. అదేవిధంగా, బిడ్డను సృష్టించేది స్త్రీ, శిశువును పోషించేది, చివరికి రేపటి ΄ûరుడిని పెంచుతుంది. కాబట్టి మహిళలు మొత్తం మానవాళి నివసించే భవనంగా భూమి తల్లిని పరిగణించాలి. – డా.ప్రతాని రాకేశ్, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా)


