అర్ధరాత్రి ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌ | Woman Attacks Hospital Staff After Midnight Visit In Hyderabad’s LB Nagar, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌

Jun 29 2026 8:25 AM | Updated on Jun 29 2026 10:37 AM

 Women Hulchul In Hospital At LB Nagar

హైదరాబాద్‌:  అర్ధరాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎల్‌బీనగర్‌లోని శ్రేష్ఠ ఆరెంజ్‌ హాస్పిటల్‌కు శనివారం అర్ధరాత్రి వనస్థలిపురం ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ  కడపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచి్చంది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించారు.

 అయితే మహిళ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై  వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడింది. వెంటనే డయల్‌–100కు సమాచారం అందించగా పోలీసులు వచ్చారు. పోలీసులు అక్కడే ఉన్న సమయంలో కూడా సిబ్బందిపై దాడి చేసింది.అనంతరం తన కారును నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement