15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో బతికింది | How an Instagram reel helped save Ludhiana woman life after Mathura capsize | Sakshi
Sakshi News home page

15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో బతికింది

Apr 16 2026 8:23 PM | Updated on Apr 16 2026 9:05 PM

How an Instagram reel helped save Ludhiana woman life after Mathura capsize

చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్‌లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.

ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.

‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement