20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..! | Child Commission Member Blackmails Women Using Pvt Videos | Sakshi
Sakshi News home page

20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!

May 2 2026 9:57 AM | Updated on May 2 2026 10:33 AM

Child Commission Member Blackmails Women Using Pvt Videos

కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు చంద్రేగౌడ అరెస్టైన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చంద్రేగౌడ రామనగర చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు.

 అయితే ఇతడు తాను లాయర్, రిపోర్టర్, పోలీస్‌ అంటూ పరిచయం చేసుకుని మహిళలకు వల వేసేవాడు. కొన్నాళ్లు మంచివాడిగా నటించి చనువు పెంచుకుని, తాను డివోర్స్‌ తీసుకున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి చివరకు శారీరకంగా లోబర్చుకునేవాడు. ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తెలివిగా ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత సదరు మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకుని బ్లాక్‌మెయిల్‌ చేశాడని గుర్తించారు. 

వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించి ఒక మహిళ వద్ద రూ.5 లక్షలు వసూలు చేశాడు. అదే మహిళ ఒకసారి నిందితుడి మొబైల్‌ను పరిశీలించగా పదుల సంఖ్యలో మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దీంతో సదరు బాధిత మహిళ ఆర్‌ఆర్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement