కేరళ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం | Kerala to launch free bus travel for women on june 15 | Sakshi
Sakshi News home page

కేరళ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

Jun 14 2026 12:48 AM | Updated on Jun 14 2026 12:48 AM

Kerala to launch free bus travel for women on june 15

తిరువనంతపురం: ఎన్నికల వాగ్దానం ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు కేరళలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రియదర్శిని పథకం అమలవుతుందని తెలిపింది. ఈ పథకం కింద కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ)కు చెందిన ఆర్డీనరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వివరించింది.

ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఆర్డినరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రియదర్శిని పథకం కింద ఉచిత ప్రయాణానికి ఎంపిక చేసిన బస్సులపై ప్రత్యేకంగా స్టిక్కర్లను అంటిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలుతో అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement