హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం | Woman Drugged and Raped by Karnataka Homestay Owner | Sakshi
Sakshi News home page

హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం

Apr 22 2026 11:32 AM | Updated on Apr 22 2026 12:03 PM

Woman Drugged and Raped by Karnataka Homestay Owner

బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్‌ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్‌ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్‌లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్‌ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.

దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్‌కు చెందిన వృజేశ్‌ కుమార్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement