కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తుల శివనామ స్మరణతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగి పోనున్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ శుభ ఘడియల్లో కేదార్‌నాథ్ ఆలయం తెరచుకుంటోంది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్నారు.
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్‌ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.


