కీలక పదవులన్నీ మహిళలకే.. ముంబైలో కొత్త చరిత్ర | Women Take Charge Of Key Posts In Mumbai Municipal Corporation | Sakshi
Sakshi News home page

కీలక పదవులన్నీ మహిళలకే.. ముంబైలో కొత్త చరిత్ర

Apr 2 2026 9:17 AM | Updated on Apr 2 2026 9:22 AM

Women Take Charge Of Key Posts In Mumbai Municipal Corporation

కార్పొరేషన్‌ కీలక పదవుల్లో ఏకంగా 11 మంది మహిళలు 

కమిషనర్, మేయర్, ప్రతిపక్ష నేత సహా 8 కమిటీల చైర్‌పర్సన్లుగా నియామకం  

బాధ్యతలను స్వీకరించిన మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులు   

సాక్షి ముంబై: ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక పదవుల పగ్గాలు  మహిళల చేతుల్లోకి వచ్చాయి.  ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, మేయర్, ప్రతిపక్ష నేతతో పాటు మరో 8 కమిటీలు  మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులకు ద క్కాయి. ప్రస్తుతం ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్లో మొత్తం  11 మంది మహిళలు అధికార బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో మహిళా రాజ్‌  ప్రారంభమైందని అందరూ అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటివరకూ ముంబై మేయర్లుగా ఎంతో మంది మహిళలు ఎన్నికయ్యారు. కానీ ముంబై మున్సిపల్‌ కమిషనర్‌ పదవి మాత్రం వారికి దక్కలేదు. ఈ పదవి కోసం పలువురు మహిళా అధికారుల పేర్లు ప్రస్తావనకు వచి్చనప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా  ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ 161 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా, సీనియర్‌ మహిళా ఐఏఎస్‌  అధికారిణి  అశ్విని భిడేకు కమిషనర్‌ అయ్యే అవకాశం లభించింది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం బీఎంసీ తొలి మహిళా కమిషనర్‌గా అశ్విని భిడే  బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తొలిసారిగా మహిళా కార్పొరేటర్‌ కిషోరి పెడ్నేకర్‌   ప్రతిపక్ష నాయకురాలిగా నియమితులయ్యారు. అలాగే బెస్ట్‌ కమిటీకి  ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా  తృష్ణ విశ్వస్‌ రావ్‌  కూడా  నియమితులయ్యారు. వీటితోపాటు మున్సిపాలిటీలోని వివిధ కమిటీల ఛైర్‌పర్సన్‌షిప్‌లు కూడా మహిళలకే దక్కాయి. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉందని   రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement