ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు! | Daily Practicing Yoga Improves Hormonal Balance | Sakshi
Sakshi News home page

ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!

Jun 20 2026 8:55 AM | Updated on Jun 20 2026 8:55 AM

Daily Practicing Yoga Improves Hormonal Balance

ఇది నిజం

క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అందరికీ తెలిసిందే.

అయితే స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్‌) సమయంలో యోగా చేయకూడదనే అపోహతో ఆ రోజుల్లో యోగాకు దూరంగా ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన మార్గదర్శకత్వంతో యోగా చేయడం పీరియడ్స్‌ సమయంలో కూడా సురక్షితమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా...

చాలామంది మహిళలు పీరియడ్స్‌ సమయంలో యోగాకు దూరంగా ఉంటారు. అయితే పిరియడ్స్‌లో ఉన్నా, యోడసాధనను ఆపాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్‌ టైంలో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచే ఇన్‌వర్షన్‌ ఆసనాల విషయంలో మాత్రం ఎలాంటి అసౌకర్యం అనిపించినా వాటిని చేయకుండా ఉండటం ఉత్తమం.

పీరియడ్స్‌ సమయంలో యోగా చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడంతో పాటు ఎండార్ఫిన్స్‌ అనే హ్యాపీ హార్మోన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు నిపుణులు.. పీరియడ్స్‌ సమయంలో యోగా చేస్తే రుతుచక్రం మారిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కూడా అపోహేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి రుతుచక్రం క్రమబద్ధంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement