breaking news
Hormonal balance
-
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్‌లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
ప్రేమ పుస్తకంలో ఇంకా చాలా పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్!
కోపం చేతల్లో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లోనూ, మనస్సులోనూ ఉండాలి. ప్రేమ విషయంలో తనకు పోటీని, తనను మించిన వ్యక్తిని భరించలేకపోవడం మనిషి స్వభావం. తను ఆరాధిస్తున్న అమ్మాయి అలసత్వం, లేదా ఆ అమ్మాయి దూరమవడం అబ్బాయిని ఉద్రేకపరుస్తుంది. చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ప్రేమ విఫలమై, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కొందరు ప్రియురాలి మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కూకట్పల్లి ఘటన, జర్మన్ పెలైట్ ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణలు. లోపం అబ్బాయిలదా? అమ్మాయిలదా? అనడం కంటే ప్రేమించిన తరువాత విడిపోయాక ఒకరు మరిచిపోవడం, ఇంకొకరు మరిచిపోలేక సతమతమైపోవడమే కారణం అని చెప్పాలి. ప్రేమ సహజం. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడితే అన్నీ సవ్యంగా ఉంటేనే పెళ్లి దాకా వెళ్తుంది. లేకుంటే చాలా కేసులలో విడిపోవడమే జరుగుతుంది. కాని అప్పుడు అమ్మాయిలు చాలా మానసికంగా కుంగిపోయినా తట్టుకోగలుగుతున్నారు. కారణం వారిలో ఉండే హార్మోన్ల సమతుల్యత వల్ల వాళ్లు ఎలాగోలా కొద్దికాలంలోనే జీవితంలో రాజీపడగలుగుతున్నారు. కాని అబ్బాయిలు కసి, ఆవేశం తట్టుకోలేక తెగబడుతున్నారు. కారణం వారికి ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువగా ఉండి, తన నుండి ఆమె విడివడిపోయాక అంతకంటే అందమైన లేక ఎక్కువ క్వాలిటీస్ ఉండే అమ్మాయి తనకు దొరకదనే భయం ఆవేశానికి ఉసిగొల్పుతోంది. దాంతో ఆమె తన సొంతం కావాలనే ఆత్రుత, ఉక్రోషం పట్టలేక క్షణిక ఆవేశంలో తెగబడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు తమ ఆలోచనా సరళి సరిగ్గానే ఉందో లేదో అనలైజ్ చేసుకోవాలి. అస్సలు తమ మనస్సుకు ఏమనిపిస్తుందో ఫ్రెండ్స్‌తో వెలిబుచ్చి, వారి సలహా తీసుకోవాలి. ఒకవేళ అలా తమ భావాలు వ్యక్తీకరించడానికి స్నేహితులే దొరకకపోతే తప్పక కౌన్సెలింగ్‌కు వెళ్లి తీరాలి. డాక్టర్‌ను కలవడం నామోషిగా ఫీలై తమలో తాము కుమిలిపోయి నాలుగు గోడలమధ్య కొంత కాలం చీకటిలో గడిపి కసి, ఆవేశం, పంతం పెంచుకుని తమ ఆలోచనలే కరెక్టు అని అమ్మాయిల మీద పడి నరకడం ఉన్మాదమే. ఇలాంటి ఉన్మాదకర ఆలోచనలు ఎందరి జీవితాలనో విషాదంలో ముంచుతాయి. నేను చూసిన మా తోటి న్యూస్ రీడర్ లక్ష్మీ సుజాత జీవితం ఇప్పటికీ మేం మరిచిపోలేం. తనతో ఏమాత్రం పోటీకి రాలేని; అందం, ఉద్యోగం ఏమీ ఉన్నతంగా లేని మేకప్బాయ్కి గౌరవం ఇవ్వడమే ఆమె చేసిన తప్పు. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి అప్పుడే కొత్తగా స్టూడియోలో చేరి టీవీ తెరపై తనను తాను ఇంకా ఎలా షైన్ చేసుకోవాలా అని మా అందరి దగ్గర కూర్చుని మెళకువలు నేర్చుకుంటూ ఎంతో వినయంగా ఉండే ఆ అమ్మాయి... పైపైకి ఎదుగుతూ పోవడం చూసి మేము చాలా చాలా ఆశ్చర్యపోయేవాళ్లం. అలాంటి అమ్మాయి తనను నెగ్లెక్ట్ చేస్తూ మిగతా అందరితో చనువుగా ఉంటోందని, ఏమాత్రం తనను పట్టించుకోవడం లేదనే కసితో ఎంతో నెమ్మదిగా, నింపాదిగా ఉండే మేకప్బాయ్, విజయవాడ హోటల్లో విచక్షణారహితంగా చంపేశాడు. ఇది మేం చాలా సంవత్సరాలు మరిచిపోలేకపోయాం. ఇద్దరిలో ఎవరిది తప్పు? మొదట్లో పరిచయం అయిన వ్యక్తితోనే జీవితాంతం సర్దుకుపోవాలని ఎవరు శాసించారు? ఎదుగుతున్న దశలో టీవీ ఫీల్డ్ లేదా సినిమా రంగం లేదా ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఎవరైనా సరే, ఇక్కడ అమ్మాయిలను అబ్బాయిలు త్వరగా పరిచయం చేసుకుంటారు. అదే అబ్బాయిలను పనికట్టుకుని పరిచయం చేసుకునే అమ్మాయిలు తక్కువే. ఆ తర్వాత అంతటితో పరిచయం ఆగిపోతే ఫర్లేదు. అంతకంటే ఉన్నతమైన భావాలు, ఆశయాలు, విద్య, ఉద్యోగం ఉండే అబ్బాయిలు పరిచయం అయితే, సహజంగానే ప్రశాంతత కోరుకోవడం ‘అలజడి లేని జీవితం కోరుకోవడం’ అమ్మాయిల తప్పు అని ఏ సమాజమూ నిర్ణయించకూడదు. అలా అని నేను అబ్బాయిలను తప్పుబట్టడం లేదు ఇక్కడ. మీకు ఏ అమ్మాయి అయినా గుడ్‌బై చెబితే, కొంచెం రోజులు బాధపడినా త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నించండి అంటాను. ఎందుకు మిమ్మల్ని మీరు మార్చుకోలేరు? స్థలం, ఉద్యోగం, ప్రదేశం మార్చివేయండి. మీ ప్రస్తుత జీవన గతి కంటే ఉన్నతంగా చేరుకోవాలని కసి పెంచుకోండి. ఆ అమ్మాయి మీద కసి మీ జీవితాన్ని బాగుచేసుకోవడానికి ఉపయోగించుకోండి. అంతకంటే అందమైన మంచి అమ్మాయి మిమ్మల్ని మీ జీవితాన్ని ఇష్టపడుతుందనే ఊహతో, ఆశతో మీ గమ్యం మార్చుకోండి. తప్పొప్పుల్ని ఆలోచించకండి. మీ ఆవేశం, ఆక్రోశం, ఆవేదన మీ జీవనగమనాన్ని మార్చాలి. మీ జీవితం చూసి ఆ అమ్మాయే గర్వించేలా, ఇంకా చెప్పాలంటే (నవ్వుతూ చెప్తున్నా) ఈర్ష్యపడేలా మిమ్మల్ని మీరు మలచుకోండి. ప్రేమలు, ప్రేమ విఫలమవడం ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక వయస్సులో జరుగుతాయి. ఇవన్నీ కొన్ని పేజీలు మాత్రమే. మీకు ఇంకా పుస్తకంలో చాలా పేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్! ఆ పుస్తకం ఇంట్రస్టింగ్‌గా, కలర్ఫుల్గా మార్చుకోండి. ప్రేమించి విడిపోవాల్సి వస్తే పరస్పరం, గౌరవం, అవగాహనతో విడిపోండి, స్నేహితులుగా మిగిలిపోండి. అంతేగాని మీకు దక్కనిది మరెవరికీ దక్కకూడదు అని తెగనరక్కండి. అది దుర్మార్గం... ఆలోచించండి. కోట విజయలక్ష్మి (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సీనియర్ న్యూస్ రీడర్, జెమినీ