మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్‌ బీ.సుమతి.. కొత్త రికార్డు | Sumati appointed as Malkajgiri Police Commissioner | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్‌ బీ.సుమతి.. కొత్త రికార్డు

May 1 2026 5:48 PM | Updated on May 1 2026 6:05 PM

Sumati appointed as Malkajgiri Police Commissioner

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ బీ.సుమతి ఈ రోజు ( శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ లోని సిటిజన్స్ యొక్క ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే తమ ప్రధాన ప్రయారిటీ అని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ తో నేరాలకు చెక్.. క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్  పై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మల్కాజ్‌గిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని సీపీ సుమతి పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.

సాంకేతికతతో నేరాలకు చెక్
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ తెలిపారు. AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

మాదకద్రవ్యాల కట్టడి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
సమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

"మహిళా పోలీస్ కమిషనర్‌గా నన్ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement