మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ | Nhrc Serious On Attack On Women Farmers In Mamillapalli | Sakshi
Sakshi News home page

మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

Jun 13 2026 3:46 PM | Updated on Jun 13 2026 3:58 PM

Nhrc Serious On Attack On Women Farmers In Mamillapalli

సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ అయ్యింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్  ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్‌పై చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు నేతలు ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో  మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement