సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అద్దె బస్సులు.. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో పోలీసు ఎస్కార్ట్ వాహనాల నడుమ రోడ్డెక్కాయి. అయితే..
ఆ బస్సులు ఎక్కిన మహిళలకు పెద్ద షాకే తగులుతోంది. సమ్మె నేపథ్యంలో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కుదరదని.. టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఆధార్ కార్డు చేతబట్టిన మహిళలకు నోట మాట రావడం లేదు. కొన్ని రూట్లలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీపై భారం పడకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది.


