
కేర్‌గివర్
ఇజ్రాయెల్ అనే మాట వినిపించగానే యుద్ధబీభత్సాలు, దాడులు గుర్తుకు వస్తాయి. కొద్దిమంది నెటిజనులకు మాత్రం ఇజ్రాయెల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాణి గోర్సెర. ‘ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్‌గా పనిచేస్తున్నాను’ అని చెప్పే రాణి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఆసక్తికరమైన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.
‘కేర్‌గివర్’గా వృద్ధులను కన్నబిడ్డలా చూసుకుంటుంది. ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వృద్ధులతో కబుర్లు చెప్పడం... ఇలా ఎన్నో చేస్తూ ఉంటుంది. ‘కేర్‌గివర్‌గా నా జీవితంలో ఒకరోజు’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియోలో కబుర్లు చెబుతూ, నవ్విస్తూ, ఒక వృద్ధురాలి కాళ్లని శుభ్రం చేయడం, నెయిల్ పెయింట్ వేయడం.. .మొదలైన దృశ్యాలు కనిపిస్తాయి.
నవరాత్రి ఉత్సవాలలో ఉత్సాహంగా నృత్యం చేయడం మరో వీడియోలో కనిపిస్తుంది. ‘చాలామంది వృద్ధులు ఒంటరితనం అనే దీవిలో దిగులుగా జీవిస్తున్నారు. అలాంటి వారికి రాణిలాంటి వారు సరికొత్త జీవనోత్సాహాన్ని ఇస్తున్నారు. వృత్తిపరంగా ఆమె కేర్‌గివర్ కావచ్చు గానీ వృద్ధులకు ఆమె ఆత్మీయతను పంచే కన్నకూతురు’ అని ఒక నెటిజన్ కామెంట్ రాశారు.
ఇదీ చదవండి : హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!