ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. కొన‌సాగుతున్న యుద్ధం? | Iran breaks ceasefire with missile attack on Israel | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. కొన‌సాగుతున్న యుద్ధం?

Jun 24 2025 2:24 PM | Updated on Jun 24 2025 3:33 PM

Iran breaks ceasefire with missile attack on Israel

జెరూసలేం: ప‌శ్చిమాశియాలో యుద్ధం పున‌:ప్రారంభమైన‌ట్లు తెలుస్తోంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్‌పై దాడుల‌కు తెగ‌బ‌డింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్‌పై ప్ర‌తిదాడుల‌కు దిగింది. దీంతో గంట‌ల వ్య‌వ‌ధిలో ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం పున‌:ప్రారంభమైనట్లు తెలుస్తోంది.  

ఈ క్ర‌మంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్‌ దాడుల‌కు దిగింద‌ని హెచ్చ‌రించింది. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని  స్పష్టం చేసింది.  అయితే, ఇజ్రాయెల్‌ వార్నింగ్‌ ఇరాన్‌ స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తరువాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదని . అయిన‌ప్ప‌టికీ ఇరుదేశాల మ‌ధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది.  
 

 

12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముగింపు పలికారు. ఇరు దేశాలు తన మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది.ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పశ్చిమాశియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై భీకరదాడి చేసింది. ఇజ్రాయెల్‌ సైతం అదే తరహాలో ఇరాన్‌ దాడుల్ని ప్రతిఘటించింది. 

ఇరాన్‌ దాడుల్ని జ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌)మంగళవారం ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య  పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement