
ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అరుదైన తీర్పు
ఎక్కడి నుంచి వచ్చారంటూ జడ్జీలపై రక్షణ మంత్రి మండిపాటు
టెల్‌అవీవ్: ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని పాలస్తీనియన్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలకు సరిపోను ఆహారం సైతం అందివ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వారికిచ్చే ఆహార పరిమాణాన్ని, ఆహార నాణ్యతను కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వ విధానాలపై సుప్రీంకోర్టు జోక్యం కేవలం సలహాలకు మాత్రమే పరిమితం. అయినప్పటికీ, ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగే యుద్ధంపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించడం విశేషం. పాలస్తీనా ఖైదీలకు కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడాన్ని ఒక విధానంగా అధికారులు అమలు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్‌కు చెందిన మానవ హక్కుల సంస్థలు ఇచి్చన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.
ఖైదీల ప్రాథమిక మనుగడకు రోజులో మూడు భోజనాలు అందించడం ప్రభుత్వ చట్టపరమైన విధి అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అధికారులు అమలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇజ్రాయెల్(అక్రి), ఇజ్రాయెలీ రైట్స్ గ్రూప్ గిషాలు గతేడాది వేసిన పిటిషన్‌పై విచారణకు సైతం తాజాగా అంగీకరించింది. దీనిని అనూహ్య పరిణామంగా పేర్కొంటున్నారు.
ఇజ్రాయెల్ జైళ్లలోని ఖైదీలకు అందించే ఆహారంపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు పెడుతోందని, వారిని ఆకలి చావులకు గురిచేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు...‘మేం సుఖవంతమైన లేదా విలాసవంతమైన జీవనం గురించి మాట్లాడటం లేదు. చట్ట ప్రకారం మనిషి మనుగడకు అవసరమైన ప్రాథమిక పరిస్థితుల కల్పనపైనే మాట్లాడుతున్నాం’అని పేర్కొంది.
అత్యంత దుర్మార్గులైన మన శత్రువుల మాదిరిగా మనం వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాలోని హమాస్ శ్రేణులు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాక.. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో కనీసం 61 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో 17 ఏళ్ల పాలస్తీనా వాసి చనిపోయాడు. ఆకలి బాధతోనే ఇతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు రూలింగ్‌పై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇటమర్ బెన్ గ్విర్ తీవ్రంగా స్పందించారు. జడ్జీలు అసలు ఇజ్రాయెలీయులేనా? అని ప్రశ్నించారు.
ఒక వైపు గాజాలోని ఇజ్రాయెల్ బందీలకు సాయం చేసే వారే లేకపోగా, హమాస్‌కు సుప్రీంకోర్టు మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. చట్ట ప్రకారమే జైళ్లలో కనీస పరిస్థితులను కలి్పస్తున్నామని, ఇందులో ఎటు వంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధికా రులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్రి డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ జైళ్లు టార్చర్ క్యాంపుల్లాగా మారరాదని పేర్కొంది. ‘ప్ర భుత్వం ప్రజలను ఆకలిబాధకు గురి చేయరాదు. ప్రజలు ప్రజలనే చంపుకుంటారా? వాళ్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారనేది తర్వాతి విషయం’అని స్పష్టం చేసింది.