
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించారు.
ఎర్ర సముద్రంలో గ్రీకు యాజమాన్యం ఆధీనంలోని కార్గో షిప్ మ్యాజిక్ సీస్‌పై ఆదివారం దాడి జరిగిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపిన తర్వాత బాంబులతో కూడిన డ్రోన్లు.. పడవలు, ఓడలను ఢీకొట్టాయని యెమెన్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన గురించి హౌతీ మీడియా వెల్లడించినప్పటికీ, అధికారికంగా తమ బాధ్యతను ప్రకటించలేదు.
ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు ఇరాన్ నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ ఆయుధాలను వారు ఇజ్రాయెల్‌తో పాటు దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తిరుగుబాటుదారులు అంతర్జాతీయ సముద్ర ట్రాఫిక్‌ను ట్రాక్ చేయడానికి, మరిన్ని దాడులను ప్లాన్ చేయడానికి ఓడలో రాడార్ పరికరాలను అమర్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది.
🚨 Israel Launches Over 60 Airstrikes on Houthi-Controlled Yemen Ports in Retaliatory Operation
In the early hours of July 7, Israel initiated a large-scale military campaign named Operation Black Flag, targeting Houthi-controlled infrastructure across Yemen. The Israeli Defense… pic.twitter.com/jRXzxmPLeL— The Tradesman (@The_Tradesman1) July 7, 2025
ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులను హౌతీలు అంగీకరించినా, నష్టం ఏ మేరకు జరిగిందో వెల్లడించలేదు. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఇంకా అనిశ్చితంగా ఉంది. అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్ అణు చర్చలపై తన వైఖరి ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు.