టెహ్రాన్: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ ఖమేనీకి కొత్త టెన్షన్ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్‌ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తమీర్ హేమాన్ ధృవీకరించారు. దీంతో, ఇజ్రాయెల్ దాడుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా తమీర్ హేమాన్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఇటీవలి పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసింది. గడిచిన రెండు వారాల్లో రెండు సార్లు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసే వరకు వెళ్లింది. కానీ, ఇరాన్‌పై అమెరికా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని దాడులు చేయలేదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికాతో చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు లేవు. ఇరాన్‌లో ఇప్పటికే ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి.
ఇక, ఇరాన్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో, ఇరాన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలిసింది.
🔥 BREAKING: Israel came this close to striking Iran, twice, in the last few weeks. Former IDF intelligence chief Tamir Hayman just confirmed what many feared: we’re on the edge of something massive.👇
— Fouled Anchor 🇺🇸🍊 (@anchor_fouled) January 13, 2026
మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. చైనాను సాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కూడా ఇరాన్‌కు చైనా సాయం అందించింది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్‌కు పంపినట్లు తెలిసింది. మూడు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ మూడు విమానాలూ కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వైపు నుంచి ఇరాన్ సమీపంలోని వెళ్లాయి.


