breaking news
interacted
-
సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో
పిల్లలతో ఇంటరాక్షన్ ఎపుడూ హృద్యంగానే ఉంటుంది. అది రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి వారైనా సరే ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాల్సిందే. ఎపుడూ గంభీరంగా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మోముపై నవ్వులు పూయించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. స్టోరీ ఏంటీ అంటేయూపీలోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం సంప్రదాయం ప్రకారం గోరఖ్‌నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడొక చిన్నారితో ముద్దుగా పలకరించారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడో ఏమో గానీ ఆ బుడ్డోడు తన మనసులోని కోరికను ముఖ్యమంత్రి చెవిన పడేశాడు. దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి అడిగింది ఏమిటో చిన్న పిల్లలంతా ఇష్టపడే చిప్స్ ప్యాకెట్. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా పిల్లవాడికి చిప్స్ ప్యాకెట్లను అందజేయడంతో వాడి మొహం మతాబులా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిషన్ ఎకాంప్ల్ష్డ్ కొంతమంది వ్యాఖ్యానించారు. సీఎం చూపిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ योगी जी ने पूछा और क्या चाहिए? बच्चा बोला चिप्स 😁 pic.twitter.com/Rqta2anzhU— Jayant Singh Shivach (@JayantSinghBJP) January 15, 2026Chips story update 😂 https://t.co/KBUvVsqlYM pic.twitter.com/aWOI9UzHiN— Lala (@FabulasGuy) January 16, 2026 -
'నేను నోరు విప్పితే.. ఉద్యోగం పోతుంది'
ముంబై: ఆయన ప్రసంగమంటే ఆర్థికశాస్త్ర విద్యార్థులు చెవికోసుకుంటారు. తమ సందేహాల నివృత్తి కోసం, ఆయన చెప్పే సమాధానాల కోసం పరిశోధక విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ . కానీ దేశవ్యాప్తంగా ఉద్రిక్తతను రాజేసిన బీఫ్ వివాదంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ అంశంపై స్పందించి తన ఉద్యోగం పోవాలని కోరుకోవడం లేదని ఆయన సమాధానాన్ని దాటవేశారు. 'సామాజిక ఉద్రిక్తతలు - అభివృధ్దిపై వాటి ప్రభావం' అనే అంశంపై ప్రసంగించిన ఆయన.. బీఫ్ నిషేధం.. రైతుల ఆదాయం, గ్రామీణ అభివృద్దిపై దాని ప్రభావం గురించి విద్యార్థులు ప్రశ్నించినపుడు ఈ మాటలన్నారు. మంగళవారం ముంబై యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన 'విద్యార్థులుగా మీకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. కానీ నేను అలాకాదు. నేను మాట్లాడితే నా ఉద్యోగం పోతుంది. అలా కావాలని నేను కోరుకోవడంలేదు' అని చెప్పారు. ఆయన సమాధానంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఉద్యోగం పోతుందనే బీఫ్ వివాదంపై తాను నోరు మెదపలేదని చెప్పారు. బీఫ్ నిషేధం, దాని ప్రభావంపై స్పందించడానికి నిరాకరించిన ఆయన ఇంతవరకు తనను ఆ ప్రశ్న అడగనందుకు ధన్యవాదాలు తెలిపారు. వాషింగ్టన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ కు పనిచేస్తున్న ఆయన 2014 అక్టోబర్ నుండి నుంచి సెలవులో ఉన్నారు.


