breaking news
Medak District News
-
కాళోజీ సేవలు చిరస్మరణీయం
మెదక్ కలెక్టరేట్: సామాజిక ఉద్యమకారుడు కా ళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఎస్సీ సంక్షేమ అధికారి సింధు, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో.. మెదక్‌జోన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ కాళోజీ తన కవిత్వం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించారని అన్నారు. ప్రజల సమస్యలను నిర్భయంగా తన రచనల్లో ప్రతిబింబిస్తూ ప్రజాకవిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సీఐలు జార్జ్, సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
మూగ జీవాలకు సత్వర వైద్యం
జిల్లా పశువైద్యాధికారి ఆదిత్యవర్మ పాపన్నపేట(మెదక్): మూగ జీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా పశువైద్యాధికారి ఆదిత్యవర్మ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలానుగుణంగా పశువులకు టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. పశువైద్య శిబిరాల నిర్వహణ, కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపట్టి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పశువులకు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డాక్టర్ సౌమ్యరెడ్డి, ప్రవీణ్ కుమార్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సతీశ్ కుమార్, శివాజీ, ఎల్ఎస్ఏ సురేష్, రాకేష్, సిబ్బంది గోపాల మిత్రలు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్‌ఫాం రూ. 40 కోట్లతో నిర్మాణం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. మల్బరీ సాగుతో సిరులు రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారి సామల ఐలయ్య, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పాములు కలకలం రేపాయి. వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారిపైకి కొండచిలువ, ఇతర పాములు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు. మెదక్‌జోన్: ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ అక్షయ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర అధ్యక్షుడు యా దవల్లి వెంకటస్వామి, ఎన్ఎస్యూఐ జాతీ య అధ్యక్షుడు వినోద్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయటం ఎన్ఎస్యూఐ ప్రధాన కర్తవ్యమని అక్షయ్ గౌడ్ అన్నారు. ఫీజులు, స్కాలర్ిషిప్లు, హాస్టళ్లు, పరీక్షలు, తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని తెలిపారు. -
ఇదేం పోకడ!
● అమాయకులపై అటవీ అధికారుల జులుం ● వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నా కానరాని చర్యలు ● ఉడుమును పట్టాడని ఓ రైతును నిర్బంధించి చితకబాదారు.. ● అవమానంతో ప్రాణంతీసుకున్న బడుగు జీవి ● అటవీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు జిల్లాలో అటవీ అధికారుల చర్యలు రోజురోజుకు శ్రుతిమీరుతున్నాయి. వారి పోకడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్లెదుటే వేలాది ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంత మవుతున్నా పట్టనట్లు వ్యవహరించే అధికారులు.. ఓ బడుగు జీవి ఉడుము పట్టాడని నిర్బంధించి చితకబాదడం.. అవమానంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. – మెదక్‌జోన్ మెదక్ జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్ల పరిధిలో అడవి విస్తరించగా కొంత కాలంగా 6 వేల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఇందులో కొంత రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు భూముల్లో, మరికొంత రెవెన్యూ అధికారులు ఫారెస్టు భూమిని పట్టాలు చేసి ఇవ్వటం, ఇంకా అడవులను ఆనుకుని ఉన్నా గ్రామస్తులు.. ఇలా పలురకాలుగా ఇప్పటి వరకు 6 వేల ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. అంతే కాకుండా ప్రతి వానాకాలం సీజన్లో ఎక్కడో ఒకచోటా కబ్జా అవుతూనే ఉంది. ఈ ఏడు సైతం ఇప్పటి వరకు 17 ఎకరాలకు పైగా కబ్జాకాగా నామ్కేవాస్తేగా 26 మందిపై కేసులు బుక్ చేసి చేతులుదులుపుకొన్నారు. రెండెకరాలు కబ్జా చేసినా.. ఇటీవల గాజిరెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి రెండు ఎకరాల భూమి కబ్జాచేస్తే అతనిపై ఎలాంటి కేసు పెట్టకుండానే వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే భూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తి సైతం కబ్జాకు పాల్పడ్డారు. ఇలా ఎంతో మంది కబ్జాకు పాల్పడినా వారిలో కొంత మందిపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి మరికొంత మందిని వదిలేస్తున్నారు. కానీ కొందరు క్షేత్రస్థాయి అధికారులు అమాయకులపై జులం ప్రదర్శిస్తుండటం గమనార్హం. అటవీ జంతువుల వేటలో.. జంతువులను వేటగాళ్లు అనేక రకాలుగా వేటాడుతున్నారు. కొందరు తుపాకులతో వేటాడుతుండగా, మరి కొందరు ఉర్లు(ఉరి)బిగించి చంపుతున్నారు.. గతంలో పోచమ్మరాళ్ తండా ప్రాంతాలోని అడవిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు తుపాకులతో జంతువుల వేటకు రాగా వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. రాయిన్‌పల్లి అడవిలోనూ కొందరు వేటగాళ్లు ఉర్లు బిగించి జింకలను చంపారు. ఇటీవల నర్సాపూర్ అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు నెమలిని చంపారు. వారిపై సైతం చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. కానీ వారిపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు. బీట్ ఆఫీసర్ ఓవర్ యాక్షన్.. పాతూరు గ్రామానికి చెందిన రైతు బుస్స పోచయ్య ఈ నెల 4న అడవిలో ఉడుమును చంపాడనే నెపంతో పాతూర్ బీట్ అధికారి అతన్ని మెదక్ రేంజ్ కార్యాలయానికి తీసుకొచ్చి ఇంటరాగేషన్ పేరుతో చితకబాదారు. ‘మా తండ్రిని కొట్టవద్దంటూ’ అడ్డుపడిన తనను సైతం కొట్టాడని మృతుడి కొడుకు రఘు బోరున విలపిస్తూ తెలిపారు. ఈ అవమానం భరించలేకే పోచయ్య బలవన్మరణం చెందాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గతంలో సస్పెన్షన్ రైతు బుస్స పోచయ్య చావుకు కారణమైన బీట్ అధికారి గతంలో రామాయంపేట ఫారెస్టు పరిధిలోని దంతేపల్లి బీట్‌లో విధులు నిర్వహిస్తుండగా సస్పెండ్ అయ్యారు. అయినా అతనిలో ఎలాంటి మార్పు రావటంలేదని స్వయంగా ఆశాఖ అధికారులే చెప్పడం కొసమెరుపు. పోచయ్య ఆత్మహత్య ఘటన అనంతరం ఆ అధికారిని పాపన్నపేట మండలానికి బదిలీ చేసినట్లు తెలిసింది. -
ఏసీబీ వలలో విద్యాశాఖ అధికారి
రూ. 20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఐఈఓ గోవిందరాంసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఏసీబీ వలకు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరాం చిక్కారు. ఓ ప్రైవేట్ కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు సదరు యాజమాన్యం నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. జిల్లా విద్యాధికారి గోవిందరాం గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు చిన్ని చిన్న లోటుపాట్లను గుర్తించారు. దీంతో కళాశాలకు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర విద్యాశాఖకు కళాశాలపై నెగిటివ్ రిపోర్టు ఇస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వాహకులు ఒప్పందం ప్రకారం ముందుగా రూ. 30 వేలు ఇచ్చారు. మిగితా రూ. 20 వేల కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు ఈనెల 7న ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం కలెక్టరేట్లోని ఇంటర్మీడియెట్ కార్యాలయంలో కళాశాల యాజమాన్యం నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, జిల్లా గోవిందరాంపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీరంగూడతో పాటు సంగారెడ్డి పట్టణంలోని రెండు కళాశాలలు అనుమతి లేకున్నా, కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
సహకారం.. రాజకీయం
ఎటూ తేలని భవితవ్యం● నామినేటెడ్ కోసం అధికార పార్టీ యత్నం● ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టుకెళ్లిన ప్రతిపక్షం ● పాలకవర్గాల గడువు ముగిసి 20 నెలలు ● జిల్లాలో 37 పీఏసీఎస్‌లు రైతుల అభివృద్ధికి తోడ్పాటునందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. పాలకవర్గాల గడువు ముగిసి 20 నెలలు గడిచిపోయినా, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటెడ్‌గా మార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, ఎన్నికలే నిర్వహించాలంటూ ప్రతిపక్షం హైకోర్టు తలుపుతట్టింది. దీంతో సహకార సంఘాల భవితవ్యం కొలిక్కి రావడం లేదు. – మెదక్జోన్జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కాల పరిమితి 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది. దీంతో వెంటనే పీఏసీఎస్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జిలుగా ఒక్కొక్కరికి 3–4 సొసైటీల బాధ్యతలు అప్పగించింది. ఈక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. కాలపరిమితి ముగియటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు ఆ బాధ్యతలు తమకే అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిర్వహించే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని స్యాయస్థానం తీర్పునిచ్చింది. పీసీసీ చీఫ్ నోట అదే మాట! గతనెల ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఏసీఎస్, మార్కెట్, ఆలయ కమిటీలకు సంబంధించి నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేస్తామని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. అలాగే సహకార సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరగవని, ఇక నుంచి నామినేటెడ్ కానున్నాయని చెప్పకనే చెప్పారు. ఇదిలాఉండగా కోర్టు తీర్పు ప్రకారం నడవాల్సిందేనని ప్రతిపక్షం నేతలు చెబుతున్నారు. దీంతో సహకార సంఘాల భవితవ్యం కోర్టు పరిధిలోకి చేరింది. రైతు సభ్యుల అయోమయం ఎప్పుడూ లేని విధంగా సహకార సంఘాలను నామినేటెడ్‌గా కేటాయిస్తారని తెలిసి ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 37 సంఘాలు ఉండగా, వాటిలో 55 వేల పైచిలుకు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 మంది ఉంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వారిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. మిగితా 11 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. జిల్లావ్యాప్తంగా 481 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా, అందులో 37 మంది చైర్మన్లు, 37 మంది వైస్ చైర్మన్లు. మిగితా 407 మంది సభ్యులుగా ఉంటారు. అయితే ఎన్నికలను రద్దు చేసి పాలకవర్గాలను పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టేందుకు అధికార పార్టీ సిద్ధం అయిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్లపై నేతల ఆరా జిల్లాలోని 37 సహకార సంఘాలు ఉండగా, వాటిలో మొత్తం 481 మంది పాలకవర్గం ఉంటుంది. ఇందులో 222 మంది ఓసీలు, 74 మంది ఎస్సీలు, 74 ఎస్టీలు, 74 బీసీలు ఉండగా, 37 మంది జనరల్ మహిళలున్నారు. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల గురించి సంబంధింత అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. పీఏసీఎస్ పాలకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం పాత పాలకవర్గాలతోనే సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరుగుతాయా..? నామినేటెడ్ చేస్తారా..? అనేది స్పష్టత లేదు. – పద్మ, డీసీఓ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● ఎల్సీ రిటర్న్ ఇవ్వకముందే ఆన్ ● ప్రాణాలతో బయటపడిన రైతు పాపన్నపేట(మెదక్): విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్వాకంతో మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ రైతు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి త్రుటిలో ప్రాణపాయం నుంచి బయపడిన సంఘటన మండలంలోని రుగ్యా తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యాతండా పరిధిలోని రుగ్యా తండాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద బోర్ మోటార్‌కు వెళ్లే వైరు తెగిపోయింది. దీంతో సంబంధిత గిరిజన రైతు రవి నార్సింగి లైన్మెన్ బాబుకు ఫోన్ చేసి ఎల్సీ అడిగాడు. వెంటనే ఎల్సీ ఇచ్చిన బాబు, పని చేసుకోమని పురమాయించాడు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన రవి, రెండు నట్లు విప్పి, మూడో నట్టు విప్పుతుండగా కరెంట్ వచ్చింది. అయితే ఆ సమయంలో నట్టు పూర్తిగా ముట్టుకోకపోవడంతో కొంచెం హమ్మింగ్ వచ్చింది. కాళ్లకు చెప్పులు ఉండటంతో పాటు కరెంట్ పనులపై కొంచెం అవగాహన ఉండటంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. వెంటనే రైతులు లైన్మెన్కు విషయం తెలపడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయించాడు. దీంతో తృటిలో రవి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే విషయమై డీఈ రామేశ్వర్స్వామి వివరణ కోరగా.. సాధారణంగా ఒకేసారి రెండు ఫీడర్లకు ఎల్సీ ఇవ్వొద్దు, కానీ విద్యుత్ సిబ్బంది పొరపాటున ఇచ్చారని తెలిపారు. అవగాహన లోపంతో బాచారం ఫీడర్ రిటర్న్ ఇవ్వాల్సి ఉండగా, నార్సింగి ఫీడర్ ఇచ్చాడన్నారు. అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రూ.21కోట్లతో అండర్‌బ్రిడ్జి
ఎంపీ రఘునందన్రావురామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్‌ను కలిసి రైల్వే సమస్యలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెల్లాపూర్ – విద్యుత్‌నగర్ మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వెడల్పు కోసం రూ.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దీనిపై శనివారం సాయిబాబా ఆలయం వద్ద రైల్వే, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌ను రేడియల్ రోడ్డుకు అనుసంధానించేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మంజూరైందని చెప్పారు. ఇందులో భాగంగానే త్వరలో ఆ పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, నాయకులు సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గాలి
నర్సాపూర్ రూరల్: మండలంలోని చిన్న చింతకుంటలో ప్రకృతి వ్యవసాయ సాగు కోసం ఎంపికై న 40 మంది రైతులకు బుధవారం తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి (సేంద్రియ) ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోవడంతో పాటు పంటలు దిగుబడి పూర్తిగా తగ్గుతుందన్నారు. దీంతో పాటు రసాయన ఎరువులతో పండించిన ధాన్యం, పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలతో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకొని పంటలు సాగు చేయాలని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికై న రైతులకు వేప నూనె, హ్యూమిక్ ఆమ్లం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, రైతులు మహేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన అంగన్వాడీ.. మన బాధ్యత
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ 9వ పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన అంగన్వాడీ– మన బాధ్యత అనే నినాదంతో సెప్టెంబరు 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఈఓ రాజు, సంబంధిత అధికారులు ఉన్నారు. అనంతరం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టరేట్లో డీఈఓ, ఎంఈఓలు, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించారు. కరా టేలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం, 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన నిత్యశ్రీని అభినందించారు. అంతకుముందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. -
వ్యాయామమే ఆరోగ్యానికి ఔషధం
స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సుభాష్ రేగోడ్(మెదక్): ప్రజల్లో ఫిజియోథెరపీ.. వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి.సుభాష్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చన్నారు. గుండె వ్యాధులు, పక్షవాతం, క్రీడా గాయాలు, సర్జరీకి ముందు–తర్వాత రిహాబిలిటేషన్‌లో ఫిజియోథెరపీ కీలకమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ సేవలపై అవగాహన మరింత పెరగాలని ఆయన సూచించారు.ప్రతిపక్షాల గొంతు నొక్కడమేబీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పాలనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల నాయకులను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం విపక్షాల గొంతునొక్కడమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికల హామిల అమలులో సీఎం విఫలం చెందాడని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సోమవారం ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ఆయన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయాలన్న డిమాండుతో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ప్రతిపక్షాల హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ..సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్కు చెందిన మహిళ ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారించిన తీరు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మహిళలకు, మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు రమేశ్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, నగేశ్, రాములునాయక్ తదితరులున్నారు. తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్‌లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తాతా మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి ● అదనపు డీసీపీకి ఫిర్యాదు పటాన్చెరు టౌన్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదనపు డీసీపీ ఉదయ్‌కుమార్, సీఐ రవీందర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవిని అవమానించడంతోపాటు ఎస్సీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లు వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయని, వాటిని పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు. -
ఆన్లైన్లో నమోదు తప్పనిసరి
గణేశ్ మండపాల ఏర్పాటుపై ఎస్పీ శ్రీనివాసరావు మెదక్‌జోన్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో గణేశ్ మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. మండపాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయడం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాట్లు సులభతరం అవుతాయని తెలిపారు. దరఖాస్తును సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు వలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శోభాయాత్రల్లో డీజేలు, టపాసులు వినియోగించరాదని, ఇతరుల మనోభావాలను కించపరిచే నినాదాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. -
ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
● అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ● రివైజ్డ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరిస్తారని తెలిపారు. ఆగస్టు 17 నుంచి నవంబర్ 5 వరకు నోటీసుల దశ, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం, నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సవరించిన షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్ర పరిధిలో సవరించిన షెడ్యూల్‌ను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఐఆర్–2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. -
9 బడులు.. రూ.79 కోట్లు
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 73 స్కూళ్లను ఎంపిక చేసి రూ.699.985 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో వాటి రూపురేఖలు మారనున్నాయి. – సంగారెడ్డి జోన్ ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గే అవకాశముంటుంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, మెరుగైన మౌలిక వసతులతోపాటు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆధునిక సాంకేతికతతో కూడిన తరగతిగదులు, పౌష్టికాహారం, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడా మైదానాలు, పోటీ పరీక్షల కోసం గ్రంథాలయం, తదితర వసతులు కల్పించనున్నారు. మారనున్న పాఠశాలల రూపురేఖలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయితే విద్యా బోధనతోపాటు క్రీడా, కంప్యూటర్ రంగాల్లో సైతం రాణించేందుకు అవకాశాలుంటాయి. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, దౌల్తాబాద్, సంగారెడ్డిలోని మునిపల్లి, జిన్నారం, సదాశివపేట, జహీరాబాద్, నిజాంపేట, మెదక్ జిల్లాలోని మెదక్, వెల్దుర్తి మండలాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు. -
రాక్‌బాల్ పోటీల్లో చాంపియన్ హరియాణ
మిక్స్డ్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచిన తెలంగాణ జట్టుకు జ్ఞాపిక అందజేతజాతీయ స్థాయి రాక్‌బాల్ పోటీల్లో మిక్స్డ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన హరియాణ జట్టుకు జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాహకులు నర్సాపూర్: పోటాపోటీగా జరిగిన రాక్‌బాల్ జాతీయ స్థాయి పోటీలలో మెన్స్ విభాగంలో హరియాణ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా ఉత్తరప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం, తెలంగాణ జట్టు తృతీ య స్థానంలో నిలిచాయి. కాగా మహిళల విభాగం పోటీల్లో హరియాణ జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా చత్తీస్ఘడ్ జట్టు ద్వితీయ స్థానం, ఉత్తరప్రదేశ్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ఇదిలాఉండగా మిక్స్డ్ విభాగంలో హరియాణ రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా తెలంగాణ జట్టు ద్వితీయస్థానంలో నిలువగా చత్తీస్ఘడ్ జట్టు క్రీడాకారులు తృతీయ స్థానంలో నిలిచారు. ముగిసిన పోటీలు కాగా, అజయ్‌యాదవ్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో జరిగిన పదవ సీనియర్ జాతీయ, ఏడవ సీనియర్ మిక్స్డ్ జాతీయ రాక్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు మూడు రోజులపాటు జరిగాయి. కాగా, మంగళవారం రాక్‌బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ముఖ్యఅథితిగా పాల్గొనగా ఉమ్మడి మెదక్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ రాజమణి, ఆల్ఇండియా రాక్‌బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి భూపాల్ సాగ్వాన్, సౌత్ ఇండియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీయాదవ్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్ తదితరులు పాల్గొని విజేతలకు పతకాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. -
వాన చుక్క జాడేదీ?
ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే ఈ నెల నుంచి వర్షాలు కురవడం లేదు. జూన్‌లో లోటు వర్షపాతం నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన వానలతో లోటునుంచి సాధారణ స్థితికి చేరుకోవటంతో ముప్పుతప్పిందంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తీరా సెప్టెంబర్‌లో అస్సలు వర్షాలు కురవక పోగా వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను సమకూర్చారు. రైతులు జూన్‌లో నారుమళ్లు (తుకాలు) పోశాక తీరా జూలైలో ఎల్‌నినో ప్రభావం ఉందని తెలియటంతో అధికారులు, వరిసాగుకు బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ జిల్లాలో 3.18 లక్షల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఈ లెక్కన అధికారుల అంచనా కన్నా 49 వేల ఎకరాల్లో సాగుతగ్గింది. గడిచిన మూడు మాసాల్లో వర్షం ఇలా...! జూన్‌లో 112.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 83.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 28.6 ఎం.ఎం లోటువర్షం నమోదైంది. జూలైలో 206.6 మి.మీ.కురవాల్సిఉండగా, 289.2 మి.మీ పడింది. ఈ లెక్కన 82.6 మి.మీ అధికంగా నమోదైంది. ఆగస్టులో 131.5కి బదులుగా 149.9 పడింది. దీంతో 18.4 మి.మీ అధికంగా కురిసింది. కాగా, జూన్‌లో లోటును సైతం జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలతో సాధారణం కన్నా ఎక్కువగా నమోదు కావటంతో ఎల్‌నినో ముప్పు తప్పిందని అంతా భావించారు. సెప్టెంబర్‌లో చినుకు జాడలేదు! ఈ సెప్టెంబర్‌లో అడపాదడపా చిరుజల్లులతోనే సరిపెట్టింది. చెప్పుకోదగ్గ ఒక్కవర్షం పడలేదు. గడిచిన వారం రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారం 40.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా(–89.0) నమోదైంది. దీంతో జిల్లాపై ఎల్‌నినో ప్రభావం చూపుతోందని అందుకే వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభావం చూపుతోన్న ఎల్‌నినో వేసవిని తలపించేలా ఎండలు! వారంరోజులుగా ఎండలు దంచి కొడుతుండటంతో పంటపొలాలకు అధికంగా నీటి తడులు అవసరం అవుతున్నాయి. నీటి తడులు పెట్టినా ఎండల కారణంగా ఇట్టే ఆవిరైపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు కరెంట్ కోతలు సైతం మొదలవటంతో పంటలు ఎండుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి... బిక్కిరి ఎండవేడిమితో మధ్యాహ్నం వేళలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదేవిధంగా ఎండలు కొడితే నీటివనరుల్లోకి వచ్చిన కొద్దిపాటి సాగునీరు సైతం ఆవిరైపోయే ప్రమాదముందని, అదేజరిగితే సాగుచేసిన పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించాలి
జిల్లా ఆస్పత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్ రామాయంపేట(మెదక్): స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ప్రభుత్వాస్పత్రుల జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఆస్పత్రిని సందర్శించి కొత్తగా వచ్చిన డాక్టర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడారు. కొత్తగా ఇద్దరు మత్తు డాక్టర్లతోపాటు జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, చిన్న పిల్లల డాక్టర్లు ఇద్దరు విధుల్లో చేరారని ఆయన పేర్కొన్నారు. త్వరలో గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని, తద్వారా ప్రసవాల సంఖ్య పెంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వాస్పత్రులను సద్వినియోగపర్చుకోవాలని డాక్టర్ శివదయాల్ సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రితోపాటు ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోస్టర్ పాయింట్ సవరించాలి
మెదక్ కలెక్టరేట్: మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలని మాలల జేఏసీ జిల్లా చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ కల్లూరు సంజీవ, ఎంసీఏ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా హడావిడిగా ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాలలు విద్యా ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి రోస్టర్ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. కార్యక్రమంలో మాలల జేఏసీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి
పాపన్నపేట(మెదక్): గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం పాపన్నపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన యువజన సంఘాల సభ్యులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ రాజేందర్ ఈనెల 1న హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. తూప్రాన్: 10వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక ఈనెల 9న మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణగుప్త సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2012 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. ఆధార్, బర్త్ సర్టిఫికెట్తో పాటు క్రీడా సామగ్రితో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 8106555942 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కొల్చారం(నర్సాపూర్): రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి ప్రతాప్‌సింగ్ సూచించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్‌లో మెగా ప్లాంటేషన్ కింద ఆయిల్‌పామ్ సాగును ప్రారంభించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 31 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఏఓ శ్వేతాకుమారి, మేనేజర్ కృష్ణరావు, ఉప సర్పంచ్ రవీందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆర్ఎంపీ క్లినిక్‌లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న పలు క్లినిక్‌ల్లో తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ప్రిస్కిప్షన్‌పై డాక్టర్ అని పెట్టుకోవడంతో డీఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఎంపీ క్లినిక్‌ల్లో ఇంజక్షన్లు, గ్లూకోజ్ ఎక్కించొద్దని ఆదేశించారు. -
ఉత్సాహంగా రాక్‌బాల్ పోటీలు
నర్సాపూర్: జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణ అభినందనీయమని మురళీయాదవ్‌ను అభినందించారు. అన ంతరం ఆయా రాష్ట్రాల క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. రాక్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు. కాగా, వర్షంతో పోటీల నిర్వహణకు కొంత ఇబ్బందిగా మారింది. -
చోద్యం చూస్తున్న అధికారులు
మట్టి.. కొల్లగొట్టినర్సాపూర్ రూరల్: పగలు, రాత్రి తేడా లేకుండా కాళేశ్వరం కాలువ మట్టి, రాళ్లను కొంతమంది వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. మండలంలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ ప్యాకేజ్– 18 టన్నెల్ పనుల్లో భాగంగా తవ్విన మట్టి, రాళ్లు ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టన్నెల్ తవ్వకాల సమయంలో కాల్వకు ఇరువైపులా గుట్టలను తలపించేలా భారీగా మట్టి రాళ్లను ఎత్తి పోశారు. మూడేళ్ల క్రితం ఈ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి పనులు చేపట్టిన కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేయాల్సిన ఇరిగేషన్ సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమ మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి, రాళ్లను యథేచ్ఛగా తరలిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తి బహిరంగంగా తరలిపోతున్న సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్మును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇదేం గందరగోళం సర్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. నో మ్యాపింగ్ అనామలిస్ జాబితాలో 1.18 లక్షల మందికి నోటీస్‌లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 93,674 వేల మందికి ఇచ్చారు. వారిలో 72,123 మంది ఓటర్లు విచారణకు హాజరు కాగా, కేవలం 23,649 మంది ఓటు హక్కును పునరుద్ధరించారు. మిగితా 48,474 మంది సరైన పత్రాలు చూపించకపోవడంతో ఓటు హక్కు కోల్పోతున్నట్లు తెలిసింది. వారు మరోసారి విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. – మెదక్‌జోన్ జిÌêÏÌZ Ððl$§ýlMŠS, ¯]lÆ>Þ-ç³NÆŠ‡ °Äñæ*-f-MýSÐ]l-Æ>YË$ E¯é²Æ‡$$. "çܯЇ' {ç³{MìS-Ķæ$MýS$ Ð]l¬…§ýl$ 4,53,140 Ð]l$…¨ KrÆý‡$Ï E…yýlV>, {ç³{MìSĶæ$ A¯]l…™èlÆý‡… 4,10,204 ™èlWY…-¨. ÐéÇÌZ 1,18,661 Ð]l$…¨ K rÆý‡Ï õ³Æý‡$Ï çÜÇV> ÌôæMýS-´ù-Ð]lr…™ø A¯éÐ]l$-Í‹Ü gê¼-™éÌZ ^ólÆ>aÆý‡$. ´ë†MóSâýæÏ {MìS™èl… Kr$ Ðólíܯ]l çÜÐ]l$-Ķæ$…ÌZ {ç³çÜ$¢™èl Kr$ Ð]l*Åí³…VŠæ çÜÇV> Ìôæ° Ðéǰ Ð]l*Åí³…VŠæ {ç³{MìS-Ķæ$ÌZ ^ólÇa¯]l A«¨-M>Æý‡$Ë$ 1.18 ÌS„ýSÌS Ð]l$…¨MìS ¯øsîæ-çÜ$Ë$ C^óla…§ýl$MýS$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. A«¨-M>Æý‡$Ë$ ½G-ÌŒæ-KÌS §éÓÆ> Cç³µsìæ Ð]lÆý‡MýS$ 93,673 Ð]l$…¨MìS ¯øsîæ-çÜ$Ë$ ç³…í³×îæ ^ólÔ>Æý‡$. ÐéÇÌZ 72,123 Ð]l$…¨ Ñ^é-Æý‡-׿MýS$ àfÆý‡-Ķæ*ÅÆý‡$. ÐéÇÌZ 23,649 Ð]l$…¨ çÜOÆð‡¯]l ç³{™éË$ ^èl*í³…^éÆý‡$. Ñ$W™é 48,474 Ð]l$…¨ çÜOÆð‡¯]l ç³{™é Ë$ ^èl*ç³-MýS-´ù-Ð]l-r…™ø ´ër$ çÜOÆð‡¯]l çÜÐ]l$Ķæ$…ÌZ Ñ^éÆý‡× MýS$ àfÆý‡$ M>MýS´ùÐ]lyýl…™ø ÌêÅ‹³Þ AƇ$$-¯]lr$Ï ™ðlÍ-íÜ…-¨. ÒÆý‡…™é Ð]l$ÆøÝëÇ A«¨-M>-Æý‡$ÌS G§ýl$r Ñ^éÆý‡-׿MýS$ àf-Æý‡$-M>ÐéÍÞ E…¨. M>V> ÒÆý‡…§ýlÇMîS Ð]l$ÆøÝëÇ ¯øsîæ-çÜ$Ë$ gêÈ ^ólĶæ*ÍÞ Ð]lÝù¢…§ýl° A«¨-M>-Æý‡$Ë$ õ³ÆöP…r$-¯é²Æý‡$. Cç³µ-sìæMóS ¯øsîæ-çÜ$ÌS gêÈ {ç³{MìSĶæ$ ¯ðlÐ]l$Ã-¨V> Mö¯]l-Ýë-VýS$-™ø…-¨. ^èl§ýl$-Ð]l#MýS$¯]l² ÐéÆý‡$ Ð]l*{™èlÐól$ çÜOÆð‡¯]l VýS$Ç¢…ç³# M>Æý‡$zË$ ^èl*í³…_ Kr$ çÜÇ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. Ñ$W™é ÐéÆý‡$ çÜOÆð‡¯]l VýS$Ç¢…ç³# M>Æý‡$zË$, ´ë†-MóSâýæÏ {MìS™èl… Ðólíܯ]l Kr$MýS$ çÜ…º…«¨…_¯]l Ð]l*Åí³…VŠæ ^èl*í³…-^èlÌôæ-MýS-´ùÐ]lr…™ø ÐéÇÑ ÌêÅ‹³Þ AÐ]l#-™èl$-¯é²Æ‡$$. ¨Ìê E…yýlV> çÜÆŠḥæ VýSyýl$Ð]l# D¯ðlË 16™ø Ð]l¬WĶæ$¯]l$…yýlV> Ð]l^óla ¯ðlË 7 Ð]lÆý‡MýS$ ´÷yìlW…^éÆý‡$. జిల్లాలో 1.18 లక్షల ఓటర్లకు నోటీసులు సిద్ధం ఇప్పటివరకు ఇచ్చింది 93,674 మందికే.. సరైన ఆధారాలు చూపింది 23,649 ఓటర్లు సరైన పత్రాలు చూపని వారు మరోసారి విచారణకు! అక్షరం తేడా ఉన్నా నోటీసు ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంటి పేరులో అక్షరం తప్పుపడినా బీఎల్ఓలు నోటీసులు ఇచ్చారు. ఉదాహరణకు పాతికేళ్ల క్రితం ఓటు వేసిన సమయంలో ‘లింగం’ అని ఓటర్ పేరు ఉండగా, ప్రస్తుతం ‘లింగము’ ఉన్నా నోటీస్ ఇచ్చా రు. ముఖ్యంగా గిరిజనులకు అత్యధికంగా నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. కాగా అక్టోబర్ 15 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. ఆ లోపు ప్రక్రియ పూర్తవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పునరాలోచించుకోవాలి
వ్యాపార రంగంలో ఏ వస్తువైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం నేరం. కాని యూరియా బస్తాలు మాత్రం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు సహకార సంఘాల్లో విక్రయిస్తున్నారు. ఇది నేరం కాదా..? ప్రభుత్వ శాఖలే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి. ఈవిషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. – నరసింహులు, రైతు, శివ్వాయపల్లి ఎరువుల ధరలు తగ్గించాలి యూరియా ధరలను అమాంతం పెంచి విక్రయిస్తుండటంతో తమపై అదనపు భారం పడుతుంది. ఇన్నాళ్లు రూ. 266కే లభ్యమైన బస్తా, నేడు రూ. 300 వరకు పెంచారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులపై అదనపు భారం మోపడం సరికాదు. ప్రభుత్వమే రవాణ చార్జీలు భరించాలి. – రమేశ్, రైతు, దంతేపల్లి తండా -
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో భూభారతి 22, ఇందిరమ్మ ఇండ్లు 09, పెన్షన్లు 05, ఇతర 25 మొత్తం 61 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. అనంతరం హైదరాబాద్ సీఎం ప్రజావాణి అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై వివరించారు. అనంతరం పట్టణంలోని ఈవీఎం గోదాములను తనిఖీ నిర్వహించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ, మైనింగ్, భూముల కొలతల శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఖనిజాల లీజుల ద్వారా రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖనిజ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఈ వేలం విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. -
ఎరువు.. మరింత బరువు
ఒక్కో యూరియా బస్తాపై రూ. 34 బాదుడు● రవాణ చార్జీలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ● జిల్లా రైతులపై రూ.2 కోట్ల మేర అదనపు భారం ఎరువులపై రవాణ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఒక్కో బస్తాపై రూ. 34 అధికంగా చెల్లించాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 2.94 లక్షల మేర వరి సాగవుతుండగా, ఈలెక్కన అన్నదాతలపై రూ. 2 కోట్ల మేర అదనపు భారం పడనుంది. – రామాయంపేట(మెదక్) జిల్లాలో గతంలో కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. అవసరమైన యూరియా సరఫరా విషయంలో గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా యాప్‌లు రూపొందించాయి. చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్ల సమస్యతో చాలా మంది రైతులు నేరుగా వ్యవసాయ కార్యాలయాలు, సహకార సంఘాల వద్దకు వెలుతున్నారు. ఈక్రమంలో యూరియా సక్రమంగా లభించక రోడ్డెక్కుతున్నారు. గోరు చుట్టు మీద రోకలి పోటులా ప్రభుత్వ రవాణ చార్జీలను ఉపసంహరించుకుంది. దీంతో ఒక్కో బస్తాపై రూ.34 అదనపు భారం పడుతుండటంలో ఆగ్రహంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువే.. రైల్వే రేక్ పాయింట్ల ద్వారా ఎరువుల బస్తాలు నేరుగా సహకార సంఘం గోదాంలకు చేరుతున్నాయి. ఇందుకు సంబంధించి రవాణ చార్జీలను మార్క్‌ఫెడ్ ద్వారా ఇన్నాళ్లు ప్రభుత్వమే భరించింది. ఇటీవల ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూ. 266.50కు విక్రయించాల్సిన యూరియా బస్తాను రవాణ, లోడింగ్ చార్జీలతో కలిపి రూ.300 వరకు అమ్ముతున్నారు. నిబంధనల మేరకు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించడం నేరం. ఇదిలా ఉండగా నిధుల కొరతతో పలు సహకార సంఘాలు ఎరువుల కోసం ముందుగా డీడీలు చెల్లించకుండా ఇండెంట్లు పెట్టడం నిలిపివేస్తున్నారని తెలిసింది. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మెదక్‌జోన్: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం మెదక్‌లోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు విడతల కరువు భత్యం (డీఏ) పెండింగ్‌లో ఉందని, అది ఒకే దఫాలో చెల్లించాలన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వద్ద నిలిచిపోయి, ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నగదు రహిత ఆరోగ్య కార్డులు అనేక ఆస్పత్రుల్లో చెల్లుబాటు కాకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పటం లేదని వాపోయారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, గజేందర్, అనిల్, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్‌జోన్: కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ ప్రతిపక్షాల గొంతునొక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పట్టణంలోని బస్ డిపో ఎదుట రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్న్ మల్లికార్జునన్గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులుతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
2 కోట్ల ఉద్యోగాలెక్కడ?: డీవైఎఫ్ఐ
కొండాపూర్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత విధానాలతో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా 4వ మహాసభకు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. దేశ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తుండగా, మరోవైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వ రుసగా ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. -
కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి
చిన్నశంకరంపేట(మెదక్): 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లు తమ దరఖాస్తులు అందించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఆదివారం మండలంలోని రుద్రారం, కొర్విపల్లి పోలింగ్ బూత్‌లను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఓటర్లు ఫారం–6 ద్వారా దరఖాస్తులు అందించాలన్నారు. అలాగే ఏదైనా సవరణ అవసరమైతే ఫారం–8 ద్వారా అందించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, నోటీస్‌లు అందుకున్నవారు తమ వివరణ అందించాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు ఉన్నారు. చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కోసం వచ్చిన వారి సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. వారాంతపు సంతకు సమీప గ్రామాల నుంచి ప్రజలు, పరిశ్రమల కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో జేబుల్లోని సెల్ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. ప్రతివారం చోరీలు పరిపాటిగా మారిపోవడంతో సంతకు రావడానికి జనాలు జంకుతున్నారు. గతం వారం సంతలో ఒకేరోజు పది మంది ఫోన్లు చోరీకి గురైనట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తూ మైనర్లు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు నిఘాను పెంచి మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్ కలెక్టరేట్: మాలల రోస్టర్ పాయింట్ సవరించాలని జేఏసీ నేతలు జెల్లా సుధాకర్, కల్లూరు సంజీవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్‌లో వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల అమలులోకి వచ్చిన నూతన రోస్టర్ పాయింట్‌తో విద్యా, ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నేటి ధర్నాలో మాలలు, నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నరేష్, శివ, ఆనందం, ప్రసాద్, మహిపాల్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాయికోడ్(అందోల్): ఎరువులు, రసాయనాలు మోతాదుకు మించకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి సారిక అన్నారు. మండలంలోని శంశోద్దీన్పూర్లో అయిల్‌పామ్ పంటలో అంతర పంటగా సాగు చేసిన మినుము పంటను వ్యవసాయశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మినుము పంటలో మొక్కల ఎదుగుదల, పూత, ఆశించిన దిగుబడి పొందేందుకు నేల స్వభావానికి తగ్గట్లుగా సమతుల్య ఎరువులను వినియోగించాలన్నారు. ఆధునిక పోషక యాజమాన్య పద్ధతులను అవలంభించాలని సూచించారు. నానో డీఏపీ, యూరియాను రైతులకు అందించి, వాటితో కలిగే ప్రయోజనాపై అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, కలుపు నివారణ మార్గాలను వివరించారు. అంతర పంటల సాగుతో రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మమత, రమేశ్ రైతులు పాల్గొన్నారు. -
చెత్తశుద్ధి కరువు
● అధికారుల పర్యవేక్షణ లోపం ● కలుషితమవుతున్న చెరువులు, కుంటలు హత్నూర(సంగారెడ్డి): ప్రతిరోజు గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో సేకరించిన చెత్తను గ్రామ శివారులోని చెరువుల్లో వేస్తున్నారు. మండలంలోని ఎల్లమ్మ గూడ పంచాయతీలో గత ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యంతో అది ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం నీరుగారి పోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో రోజూ సేకరించిన చెత్తను చెరువు, కుంటలో వేయడంతో అవి కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను చెరువు, కుంటలో కాకుండా ఇతర ప్రాంతంలో వేయించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండని కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకునే గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 38 పంచాయతీలు ఉండగా, సుమారు 35 మంది కార్యదర్శులు పట్టణాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. సర్టిఫికెట్లపై సంతకాలు చేయించేందుకు పంచాయతీకి వెళితే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇ ప్పటికై నా పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జాతీయ రాక్‌బాల్ పోటీలు షురూ
నర్సాపూర్: నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కళాశాల జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలకు వేదికగా మారింది. ఆదివారం 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ము ఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న అజయ్ ట్రస్టు చైర్మన్, సౌత్ ఇండియా రా క్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీయాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గెలుపోటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని హితవుపలికారు. కార్యక్రమంలో సౌత్ ఏషియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపేందర్ సాగ్వాన్, ఆల్ ఇండియా రాక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ఉమ్మడి మెదక్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ రాజమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈసారి రాక్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలోని 16 రాష్ట్రాల నుంచి మొత్తం 24 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 42 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు నర్సాపూర్‌కు చేరుకోవడంతో పట్టణంలో క్రీడా సందడి నెలకొంది. -
మొదట్లోనే మొగి పురుగు
వానాకాలం వరి పంట వేసిన రైతులకు మొదట్లోనే కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ముప్పు పొంచి ఉండగా, సాగు చేసిన వరి పంటను మొగి పురుగు ఆశించటంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో తెగులు ఉధృతి అధికంగా ఉండటంతో నివారణకు వివిధ రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా ఫలితం ఉండటం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్‌జోన్ అన్నదాతల్లో ఆందోళన వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు జిల్లాలో 2.54 లక్షల ఎకరాల్లో వరి సాగు -
కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పండి
రేగోడ్(మెదక్): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ‘వెయ్యి రోజుల దగా’పై పోరుబాట నిర్వహించారు. ఈసందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడారన్నారు. సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జైపాల్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, గ్రామ అధ్యక్షుడు సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. -
చకచకా బిల్లులు ఓకే
విడుదలవుతున్న ఇందిరమ్మ బిల్లులుజిల్లావ్యాప్తంగా గతేడాది జూలైలో మొదటి విడత ఇందిరమ్మ పథకంలో 8,910 ఇండ్లు మంజూరయ్యాయి. ఇటీవల పూర్తిగుడిసెలు గల 727 కుటుంబాలను గుర్తించి వారికి సైతం ఇళ్లు మంజూరు చేయటంతో ఆ సంఖ్య 9,637కు చేరుకుంది. కాగా అందులో 2,290 నేటికీ ప్రారంభించలేదు. మరో 890మంది బేస్మెంట్ ప్రారంభించేందుకు గుర్తులు పెట్టుకున్నారు. 1,183 బేస్మెంట్ లెవల్ పూర్తయినవి, రూఫ్‌లెవెల్ కంప్లీట్ అయినవి 645, స్లాబ్‌వరకు అయినవి 2,434 కాగా పూర్తిగా సిద్ధమైనవి 2,195. ఆరు నెలల తర్వాత ఫైనల్బిల్లు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి కాగా ఆరునెలలుగా ఫైనల్బిల్లులు ఆగిపోవటంతో అప్పులు చేసి నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులకోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆందోళన చెందారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చించి నిర్మించుకున్నారు. కాగా, ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందనే ధీమాతో బయట అప్పులు చేశారు. కేంద్రం ఏకంగా 6 నెలల పాటు బిల్లులు ఆపటంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కాగా గత 15 రోజుల నుంచి ఆఖరు బిల్లులు సైతం విడుదలవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు కంప్లీట్ అయిన ఇల్లు 2,195కాగా ఫైనల్ బిల్లులు 535మంది కి వచ్చింది. ఇంకా 1,660 మందికి త్వరలో వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆఖరు బిల్లులు మంజూరవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ పథకం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు కాగా అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కో ఇంటికి రూ.3.88 లక్షలు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటా కింది రూ.1.12 లక్షలను ఇస్తోంది. కాగా, ఇళ్లు పూర్తయిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వగా కేంద్రం విడుదల చేసే ఆఖరుబిల్లులు ఆలస్యం కావటంతో అప్పులు చేసి నిర్మించిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. కాగా, ఇటీవల ఆఖరుబిల్లులు సైతం మంజూరు కావటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –మెదక్‌జోన్ సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి 535 మంది లబ్ధిదారులకు చేరిన డబ్బులు ఒక్క పూరిగుడిసె ఉండకూడదు జిల్లాలో ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, పూరిగుడిసెలు మాత్రం ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంజూరైన ఇళ్లల్లో కొన్నింటిని నేటికీ ప్రారంభించకపోయినప్పటికీ వారి పేర్లను రద్దు చేయకుండా అలాగే ఉంచుతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో అత్యధికులు పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఉన్నవారు కావడంతో వారికి మంజూరైన ఇళ్లను రద్దు చేయటం లేదు. ఇక వారు నిర్మించుకోవటమే ఆలస్యమని అధికారులు చెబుతున్నారు. కాగా రెండోవిడత సైతం త్వరలో మంజూరవుతాయని వారు పేర్కొన్నారు. -
22 ఏ బాధితులకు ఎంపీ సంఘీభావం
పటాన్చెరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, రెవెన్యూ మంత్రి ఆస్తులను ఒక్కరోజులో 22ఏ జాబితా నుంచి తొలగించినట్లే సామాన్యుల ఆస్తులను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు పట్టణంలోని సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీలో శనివారం 22 ఏ బాధితులతో ఆయన సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..55 ఎకరాల్లో 953 ఇళ్లతో నిర్మించిన సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హెచ్ఎండీఏ నుంచి లే అవుట్ అనుమతులు, జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇళ్ల నిర్మాణం జరిగిందని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అనుమతులను నమ్మి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్లను కొనుగోలు చేసి 12 ఏళ్లుగా నివసిస్తున్నారని చెప్పారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం తిరిగి ఆ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని తమ సమస్యపై ఉద్యమించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు కాసాల సుధాకర్, కాలనీ అధ్యక్షుడు విజయ్‌రాజ్, ప్రధాన కార్యదర్శి సత్యారావు, పటానన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు, 22ఏ బాధితులు తదితరులు పాల్గొన్నారు. సీఎంకొక న్యాయం.. సామాన్యులకొక న్యాయమా? బాధితులను కలిసిన ఎంపీ రఘునందన్‌రావు -
12న జాతీయ లోక్ అదాలత్
న్యాయమూర్తి సుచరిత అల్లాదుర్గం(మెదక్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జ్ సుచరిత వెల్లడించారు. అల్లాదుర్గం కోర్టులో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజీ కుదుర్చుకోవడానికి కక్షిదారులకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కక్షిదారులకు సంపూర్ణ సహకారాలు అందించి, లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, ఎస్ఐలు శంకర్, ప్రవీణ్‌రెడ్డి, పోచయ్య, కోర్టు సూపరింటెండెంట్ పద్మావతి, లీగల్ సర్వీస్ సిబ్బంది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని 13వ వార్డులో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఎస్సీ కాలనీలోని 13 వార్డులో మిషన్ భగీరథ తాగునీరు సరిగా రావడంలేదని మహిళలు తెలిపారు. విషయం ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా ఫలితంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడకపోతే గ్రామపంచాయతీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజం నర్సాపూర్: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆయా పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులతో స్థానిక పిల్లలపార్కు నుంచి ర్యాలీగా స్థానిక చౌరస్తా చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడుతూ...వెయ్యి రోజుల పాలనలో రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలం చెందారన్నారు. విద్యామంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 97జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే సీఎంకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిరుద్యోగులకు తన వంతు సహకారం అందించాలన్న లక్ష్యంతో సునీతమ్మ ఉద్యోగ మిత్ర యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సునీతారెడ్డి ప్రకటించారు. ఇదిలాఉండగా ధర్నాలో పాల్గొన్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ...తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రానందున తాము ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆయా మార్గాల్లో బస్సులను పునరుద్ధరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీనిచ్చారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, శేఖర్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది!
ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నాను. నాకు పూర్తిస్థాయిలో రూ.5 లక్షల బిల్లు వచ్చింది. ఇప్పడు నాకెంతో సంతోషంగా ఉంది. –చాకలి సంగమ్మ, 1వ వార్డు, మెదక్ ఆఖరు బిల్లులు మంజూరు ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి ఆఖరు బిల్లులు సైతం మంజూరవుతున్నాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలి. పూరిగుడిసెలున్న లబ్ధిదారులకు ప్రాధాన్యతనిస్తున్నాం. –మాణిక్యం, పీడీ హౌజింగ్ -
సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల అదుపు
చిలప్‌చెడ్(నర్సాపూర్): ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, బీట్ వ్యవస్థను బలోపేతం చేసి, నేరాల అదుపునకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డివీ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన చిలప్‌చెడ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలిచ్చారు. అనంతరం చిట్కుల్లోని కేజీవీబీ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చిలప్‌చెడ్ శివారులో వెయ్యి గజాల స్థలం కేటాయిస్తే, పోలీస్ స్టేషన్ నిర్మించే విధంగా చర్య తీసుకుంటానన్నారు. చాముండేశ్వరి ఆలయంలో చోరీచేసిన దొంగలను, క్లూస్ టీం ఆధారంగా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని, డ్రగ్స్ తీసుకుంటూ ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. అనుమానస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకుండా 112 నంబర్‌కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐలు నంగా కృష్ణ, సందీప్‌రెడ్డి, స్థానిక ఎస్ఐ నర్సింహులు, ఎంఈఓ విఠల్, కేజీబీవీ ఎస్ఓ అంజలి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
గురువు సమాజానికి దిక్సూచి
మెదక్ కలెక్టరేట్: సమాజానికి ఉపాధ్యాయుడు దిక్సూచి అని, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ...పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. గురువులు సమాజానికి దిక్సూచి వంటి వారని తెలిపారు. కాలానుగుణంగా విద్యా బోధనలో మార్పులు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పది, ఇంటర్ ఉత్తమ ఫలితాలతో మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, డీఈఓ రాజు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఘనంగా గురుపూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్ -
తాగునీటి కటకట
పైప్‌లైన్ చివరి గ్రామాలకు గ్రిడ్ నీటి సరఫరా బంద్ మంజీరా ప్రవాహం తగ్గడంతో డబ్ల్యూటీపీ అందని నీళ్లు రాఘవాపూర్, పాంపాడ్ డబ్ల్యూటీపీల్లో సామర్థ్యంలో సగమే పంపింగ్ ఇప్పుడే ఇలా ఉంటే..వేసవిలో సమస్య తీవ్రతపై ఆందోళన మిషన్‌భగీరథ రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు (డబ్ల్యూటీపీ) సామర్థ్యం రోజుకు 19 మిలియన్ లీటర్లు. కానీ మంజీరా నదిలో నీళ్లు లేని కారణంగా ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి పది మిలియన్ లీటర్లు మాత్రమే పంప్ చేస్తున్నారు. ఇక్కడ 24 గంటలు పంపింగ్ జరిగితే దీని పరిధిలో ఉన్న 74 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. కానీ సగం కూడా పంపింగ్ జరగకపోవడంతో ఝరాసంగం వంటి మండలాలకు అసలు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి లభ్యత తగ్గడంతో పలు తాగునీటి పథకాల నుంచి పంపింగ్ తగ్గించాల్సి వస్తోందని వాటర్‌గ్రిడ్ ఈఈ విజయలక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఉన్న నీటితో వీలైనంత ఎక్కువ గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని మిషన్‌భగీరథ ఈఈ పాష పేర్కొన్నారు. సమస్య తీవ్రమైతే బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాకాలంలోనే తాగునీటి కటకట షురూవైంది. తాగునీటికి ప్రధాన ఆధారమైన మంజీరా నది వెలవెలబోతుండటంతో తాగునీటి సమస్య ఇప్పటి నుంచే ప్రారంభమైంది. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన నీటి వనరు అయిన సింగూరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 4.49 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 515 అడుగుల మేరకు మాత్రమే నీటి మట్టం ఉంది. దీంతో తాగునీటి సమస్య షురూవైంది. రానున్న జనవరి నుంచి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్‌భగీరథ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 912 గ్రామాలు, నివాసిత ప్రాంతాలున్నాయి. వీటికి వివిధ పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో.. మంజీరా క్యాచ్మెంట్ ఏరియాలో సరైన వర్షాలు కురవకపోవడంతో నదిలో నీటి ప్రవాహం చాలా మట్టుకు తగ్గిపోయింది. ఉధృతంగా ప్రవహించాల్సిన ఈ నది చాలాచోట్ల వెలవెలబోతోంది. దీంతో సింగూరుకు ఆశించిన మేరకు నీరు చేరలేదు. దీంతో ఈ జలాశయం ఆధారంగా ఉన్న తాగునీటి పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు డబ్ల్యూటీపీలో పలు సాంకేతిక సమస్యలు కూడా తరచూ తలెత్తుతున్నాయి. దీంతో నీటి పంపింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. ఆయా తాగునీటి పథకాల పరిధిలో ఇప్పటి నుంచే తాగునీటి సమస్య తలెత్తుతోంది. రానున్న మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తాగునీటి సమస్యల మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
హామీల అమలు ఎక్కడ?
కాంగ్రెస్ పాలనపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి ధ్వజం మెదక్‌జోన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన పూర్తిగా మోసపూరితంగా సాగుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని పోస్టాఫీసు వద్ద శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మీ, తులం బంగారం, ఉచిత స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు క్షీణించాయని, విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోయి పాఠశాలలు మూతపడే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అంతకుముందు పద్మారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ, కోలాటం ఆడారు. గిరిజన మహిళలు తెచ్చిన సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ అలరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిడ్ల ఆంజనేయులు, చౌదరి సుప్రబాత్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న శివకుమార్
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఎస్టీగురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న జీవశాస్త్రం ఉపాధ్యాయుడు శివకుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. దీంతో శనివారం కొండగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎస్టీ గురుకులాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. శివకుమార్ గత రెండేళ్లుగా ఎస్టీ గురుకులంలో జీవశాస్త్రం బోధిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించడంతోనే ఉత్తమ అవార్డు వచ్చిందని ప్రిన్సిపాల్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా వరుసలు దీరారు. ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకున్న రైతులు పీఏసీఎస్ వద్దకు ఉదయమే చేరుకుని యూరియా కొనుగోలు చేసేందుకు లైన్ కట్టారు. తాము ఆన్లైన్ యాప్‌లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ గంటల కొద్దీ లైన్లో నిలిచోవడం మాత్రం తప్పడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యూరియాను నేరుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
మాస్టారు.. మనసు గెలిచారు
ఎన్నో అవార్డులు● విభిన్న ప్రయత్నం.. బోధన వినూత్నం ● ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాల గణితం టీచర్ రవిరాజ్ ప్రత్యేకత నర్సాపూర్ రూరల్: విద్యార్థులు సులభంగానే కాకుండా ఆసక్తితో పాఠాలు నేర్చుకునేలా వినూత్నరీతిలో బోధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నర్సాపూర్ మండలం ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాల గణితం ఉపాధ్యాయుడు రవిరాజ్. 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా కంగ్టి మండలం చౌకన్పల్లి ప్రాథమిక పాఠశాలలో చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో 43 మంది విద్యార్థులు. కనీసం బడికి కూడా సరిగా వచ్చేవారు కాదు. ఆటపాటలతో వారికి దగ్గరై, వినూత్న బోధనతో చదువుపై ఆసక్తి పెంచారు. ఫలితంగా 2015లో ఆ పాఠశాల నుంచి బదిలీ అయ్యేనాటికి ఆ సంఖ్య 104కి చేరింది. అహ్మద్‌నగర్‌లో అద్భుతం బదిలీపై నర్సాపూర్ మండలం ప్రాథమికోన్నత పాఠశాల అహ్మద్‌నగర్‌కు వచ్చేనాటికి ఇక్కడ ఇద్దరు టీచర్లు, 7 తరగతులకు 45 మంది విద్యార్థులు ఉన్నారు. రవిరాజ్ తోటి ఉపాధ్యాయుల సహకారంతో గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగైన విద్యాబోధన చేస్తామని, మీ పిల్లలకు చదువు రాకపోతే మమ్మల్ని అడగండి అని భరోసా ఇచ్చారు. దీంతో పాటు ప్యూర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలకు వనరులు సమకూర్చి విద్యలో వెనుకబడిన పిల్లలకు సాయంత్రం ప్రత్యేక క్లాసులు. కరోనా సమయంలోనూ యూట్యూబ్ ద్వారా పాఠాలు చెప్పారు. 2024 నాటికి ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది. యూట్యూబ్ ఛానల్‌కు ఆదరణ 2024లో ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చేనాటికి 53 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న ప్రయత్నాలు ప్రారంభించారు. హోంవర్క్ చేయని, బడికి రాని పిల్లల కోసం డిజిటల్ క్లాసులు, పజిల్స్, ఐక్యూ టెస్టులు, ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్‌తో విద్యార్థుల హాజరుశాతం పెంచారు. మరో మ్యాజిక్‌తో ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు బోధించే పాఠాలు, విద్యార్థుల ప్రతిభను రికార్డు చేసి తన యూట్యూబ్ ఛానల్ ‘రవిరాజ్ మాస్టర్’లో పోస్ట్ చేయడంతో విద్యార్థుల్లో ఆసక్తి, పోటీతత్వం పెరిగింది. కేవలం విద్యార్థుల కోసం మొదలుపెట్టిన ఈ ఛానల్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కేవలం రెండేళ్లలో ఆద్మాపూర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సంఖ్య 53 నుండి 90కి పెరిగింది. ఆయన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు లేకుండానే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి అవార్డు ఇచ్చింది. దీంతో పాటు బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్, బెస్ట్ ప్రాక్టీసెస్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, రోటరీ క్లబ్ బెస్ట్ టీచర్ అవార్డులు అందుకున్నాడు. ఇటీవల సింగపూర్‌లో అక్కడి విద్యను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా విద్యా కమిషనర్ యోగితా రాణా టూర్‌కు ఎంపిక చేశారు. -
గాడిన పడని జీవితాలు
● శ్రమకు తగ్గ గుర్తింపు కరువు ● అమలు కాని కనీస వేతన చట్టం ● ఆచరణకు నోచని ప్రభుత్వ హామీలు జిల్లాలో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించటం, మురికి కాలువలు శుభ్రం చేయటం, మొక్కల సంరక్షణ, దోమల నివారణ చర్యలు, తాగునీటి నిర్వహణ.. ఇలా గ్రామాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయినా సరైన వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,697 మంది మల్టీపర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 2018లో వీరిని అప్పటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంది. 500 జనాభా ఉన్న చోట ఒకరి చొప్పున, ప్రతి గ్రామంలో ఇద్దరు తగ్గకుండా నియమించారు. ఒక్కో వర్కర్‌కు నెలకు రూ. 9,500 చొప్పున వేతనాలు ఇస్తుండగా, వాటిని సైతం సక్రమంగా ఇవ్వటం లేదు. పంచాయతీ అకౌంట్లలో వేతనాలు పడుతున్నాయి. వాటిని డ్రా చేసి కార్యదర్శులు, ఆయా గ్రామాలు సర్పంచ్‌లు కార్మికులకు సకాలంలో ఇవ్వడం లేదని తెలిసింది. అమలు కాని వేతన చట్టం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో అనేక రకాల పనులు చేస్తే కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. నెలకు రూ. 9,500 మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. దీంతో తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నామని మదన పడుతున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం నెలకు రూ.26,000 చొప్పున వేతనం ఇవ్వాలని, ప్రతినెల జీతం నేరుగా తమ అకౌంట్లలో జమ చేయాలనే ప్రధాన డిమాండ్లతో గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీస వస్తువులు కరువే మల్టీపర్పస్ వర్కర్లతో పారిశుద్ధ్యంతో పాటు అనేక రకాల పనులు చేయిస్తున్నారు. కానీ కనీస సౌకర్యా లు కల్పించటం లేదు. చేతులకు గ్లౌస్లు, ఆయిల్, సబ్బులు, యూనిఫాం తదితర వస్తువులు అందజేయటం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే యూనిఫాంలు ఇచ్చి మిగితా ఎలాంటి వస్తువులు ఇవ్వటం లేదు. దీంతో కార్మికులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో విధులు నిర్వర్తించే మల్టీపర్పస్ వర్కర్లలో 90 శాతం మంది నిరుపేదలే ఉండటం గమనార్హం. -
ఆర్టీసీ డిపో దశ మారేనా..?
● నేడు ఈడీ రాక ● సమస్యల పరిష్కారంపై ప్రయాణికుల ఆశలు నర్సాపూర్: నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో పలు సమస్యలు నెలకొన్నాయి. సరిపడా బస్సులు లేక నియోజకవర్గంలోని ప్రధాన మార్గాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈక్రమంలో శనివారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కుస్రోషా ఖాన్ డిపోను తనిఖీ చేసేందుకు వస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారంపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. 2022లో డిపోను ప్రారంభించగా, అధికారులు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డిపోలో 39 బస్సులలో 32 సంస్థ బస్సులు ఉండగా 7 అద్దె బస్సులున్నాయి. సంస్థ బస్సుల సంఖ్యకు అనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లు లేనందున ఉన్న వారిపై పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు సరిపడా వసతులు లేవని తెలిసింది. రెస్ట్ రూంతో పాటు ఇతర వసతులు మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని సిబ్బంది చెబుతున్నారు. డిపోకు కొత్త బస్సులు కేటాయించి దూర ప్రాంతాలకు సైతం ఇక్కడి నుంచి బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే డిపో ఆవరణలో సీసీ రోడ్డు లేనందున వర్షాలు కురువగానే అంతా బురదమయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అందని ఉచిత ప్రయాణం మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పటికీ సరిపడా బస్సులు రాకపోవడంతో గ్రామీణ మహిళలకు పథకంతో ప్రయోజనం లేకుండా పోతుంది. నర్సాపూర్ నుంచి బాలానగర్ మార్గంలో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి వెలుతున్నందున వారి సంఖ్యకు సరిపడా బస్సు లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నత్నాయిపల్లి మీదుగా పటాన్చెరు వరకు సర్వీసును సక్రమంగా నడుపనందున అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం కరువైంది. -
ఉత్తమ టీచర్లుగా 52 మంది
మెదక్‌జోన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, ప్రధానోపాధ్యాయులు, పీజీ హెచ్ఎంలు ఉన్నారు. వీరందరికీ శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మెదక్ కలెక్టర్: ఈనెల 6న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఉద్యోగుల సంకల్ప సభ’ను విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ నాయకులు జిడ్డి ఎల్లం, జంగం నగేశ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం పట్టణంలో సంకల్ప సభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయా లన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటినే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సెక్రటరీల సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సంతోష్ కుమార్, ప్రభాకర్, భిక్షపతి, ఆంజనేయులు, శ్రీశైలం, స్వామి, చంద్రశేఖర్, రాజు, మల్లేశ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి శుక్రవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు శంకరశర్మ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అర్చన చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు జీవన్‌రావు, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ కృష్ణాగౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ పరిశీలించారు. అనంతరం వార్డుల్లో విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు సహకారంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిని నిబంధనల ప్రకారం జిల్లా డీఎస్సీ ద్వారా ఎంపీక చేసినప్పటికీ వారికీ నేటికీ ఔట్సోర్సింగ్ విధానంలోనే వేతనాలివ్వడం బాధాకరమన్నారు. -
గురి తప్పని గిరిపుత్రులు
అమ్రియా తండా నుంచి నలుగురికి మెడిసిన్ సీటుపాపన్నపేట(మెదక్): గిరిపుత్రుల గురి తప్పలేదు. స్వేదం చిందిస్తూ, కాయా కష్టం చేసి, కాలేజీకి పంపిన కన్నవారి కలలను వారి పిల్లలు సాకారం చేశారు. పాపన్నపేట మండలంలో బస్సు ముఖం చూడని మారుమూల అమ్రియాతండా నుంచి ఒకేసారి నలుగురు మెడిసిన్ సీట్ సాధించి సత్తా చాటారు. ఇందులో కవలలిద్దరూ ఉన్నారు. ఇదే తండాకు చెందిన సాయికుమర్ ఇప్పటికే మెడిసిన్‌లో పీజీ, మరో విద్యార్థి ఉపేందర్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 300 జనాభా గల ఆ తండాలో ఆరుగురు మెడిసిన్ చదవడం, ఇతర తండావాసులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. వలస కూలీ కొడుకుకు సీటు తండాకు చెందిన లునావత్ వసూరాం, లక్ష్మి దంపతులు హైదరాబాద్‌లో వలస కూలీలుగా బతుకుతున్నారు. వీరి కుమారుడు నవీన్ గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. నీట్ పరీక్ష రాసి 2,18,058 ర్యాంకుతో కండ్ల కోయలోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. దీంతో అతని తల్లిదండ్రులు తమ కొడుకు డాక్టర్ అయితే ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోష పడుతున్నారు. లునావత్ శ్రీను, దేవి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కవలలున్నారు. పిల్లలు మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో రాము ఆల్ ఇండియాలో 1,86,370 ర్యాంకు సాధించి సిరిసిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు సాధించాడు. తమ్ముడు లక్ష్మణ్ 1,20,871 ర్యాంకుతో ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు పొందాడు. భవిష్యత్తులో రాము న్యూరో ఫిజిషియన్, లక్ష్మణ్ జనరల్ మెడిసిన్‌లో పీజీ చేసి నిరుపేదలకు ఉచిత వైద్య అందిస్తామని చెబుతున్నారు. -
అబద్ధపు హామీలతో గద్దెనెక్కారు
వెల్దుర్తి(తూప్రాన్): అమలు కాని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ విమర్శించారు. శుక్రవారం మాసాయిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ సమావేశంలోనే 42 పథకాలపై చర్చించి అమలుకు నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంతం కరువు బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 22–ఏ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టే నిరసనలకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు నాగరాజు, హరికృష్ణ, మన్సూర్, చంద్రాగౌడ్, కృష్ణాగౌడ్, స్టేషన్ శ్రీను, నర్సింహారెడ్డి, శంకర్‌యాదవ్, శ్రీనివాస్‌నాయక్ తో పాటు బీఆర్ఎస్ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు ఎమ్మెల్సీ దేశపతి, ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ -
అర్ధరాత్రి ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ
మెదక్‌జోన్: రాత్రి వేళల్లో పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న పెట్రోలింగ్, బ్లూకోడ్స్, బీట్ డ్యూటీలను అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు, ఇతర ప్రాపర్టీ నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. -
బాధ్యతగా పనిచేయాలి
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆయన హాజరై మాట్ల్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతీ నెల ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే సమావేశానికి తల్లిదండ్రులు హాజరుకావాలని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నీటి సరఫరా, వివిధ సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తెచ్చారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్పాటీల్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్, ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంఈఓ సురేశ్ పాల్గొన్నారు. -
ఉనికికోసమే సునీతారెడ్డి పాదయాత్ర
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్: స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉనికికోసమే రోడ్లు బాగు చేయాలంటూ పాదయాత్ర చేశారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకుని మహత్తర మైలరాయిని దాటిందని చెప్పారు. ఈ సందర్భంగా వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ...రేవంత్‌రెడ్డి పాలన పేదోడి గుండె చప్పుడన్నారు. ప్రజాపాలనను అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తుంటే బీఆర్ఎస్ తట్టు కోలేకపోతోందని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ వారం రోజుల కార్యక్రమం అంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రూ.వేలకోట్లు కాజేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే నర్సాపూర్ అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నర్సాపూర్ చాలా వెనుకబడిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు సాగు నీరందించాలని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాలకు అదనంగా ఎకరం భూమికి సాగు నీరిచ్చారా ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకే కోవకు చెందిన పార్టీలని వారు ఆరోపించారు. నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌కు తాను, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పోటీ పడినప్పటికీ టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, పార్టీ నాయకులు రిజ్వాన్, లలిత, అశోక్, నరేందర్‌రెడ్డి, మేఘమాల, గంగాధర్, సుధీర్‌గౌడ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధాలు
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మెదక్‌జోన్: అత్యాశ, భయం, తొందరపాటు చర్యలే సైబర్ నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయని అప్రమత్తతతోనే నేరాలకు చెక్పెట్టవచ్చిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్టేనని బ్యాంకింగ్ నుంచి షాపింగ్ వరకు..నగదు బదిలీల నుంచి ప్రభుత్వ సేవల వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయని ఈ సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగంలోన,లాటరీ, బహుమతుల పేరుతో ఆశ చూపించడం వంటి కొత్తకొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ, యూపీఐపిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైన తర్వాత భయంతో మౌనంగా ఉండొద్దని వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్లకు అసలైన అడ్డుకట్ట అని ఎస్పీ సూచించారు. జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ నర్సాపూర్ రూరల్: రోగులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గణేశ్వర్ వైద్య సిబ్బందికి స్పష్టం చేశారు. నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌తోపాటు ఓపీ రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ గది, ఐఎల్ఆర్ వ్యాక్సిన్లను తనిఖీ చేశారు. అనంతరం పీహెచ్సీ సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నెలవారీ ఆశ మీటింగ్‌లో సిబ్బంది పాల్గొని మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం, ఆన్లైన్, ఆఫ్ లైన్ రికార్డులు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ రఘువరన్, డెమో అన్వర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనుమతుల్లేని ప్రైవేట్ ఆస్పత్రి సీజ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ గణేశ్వర్ తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్‌లోని న్యూ అమ్మ హాస్పిటల్ నిర్వహించడానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తుతోపాటు ఎలాంటి డాక్యుమెంట్లు, అవసరమైన సర్టిఫికెట్లు తమ కార్యాలయంలో ఇవ్వలేదని చెప్పారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఆస్పత్రిని నెల రోజులుగా నడిపిస్తున్నందున తనిఖీ చేసి సీజ్ చేయడంతోపాటు ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ కిరణ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ,, డెమో ఇన్చార్జి డాక్టర్ అన్వర్ తదితరులున్నారు. మెదక్ కలెక్టరేట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే ఉద్యోగుల జేఏసీ పంతమని జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌్ దొంత నరేందర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దొంత నరేందర్ మాట్లాడుతూ...సెప్టెంబరు 1వ తేదీని ఇప్పటికే పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించామన్నారు. 2004 సెప్టెంబరు 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన ఉద్యోగులంతా నూతన పెన్షన్ విధానంతో అభద్రతా భావానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ కింద పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం, అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలు పెన్షన్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులు సీపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ప్రాంతం మార్మోగింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో యూనిస్‌కు అందజేశారు. కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
● జిల్లాలో పలుచోట్ల రైతుల ఆందోళనలు ● నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులురామాయంపేట(మెదక్): స్థానిక సహకార సంఘానికి మంగళవారం వచ్చిన రెండు వేల బస్తాల యూరియా కేవలం నిమిషం వ్యవధిలోనే అమ్ముడుపోయింది. దీంతో యూరియా లభించని ఇతర రైతులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెలితే...రామాయంపేట సహాకార సంఘానికి ఐదు లారీల్లో రెండు వేల బస్తాల యూరియా స్టాక్ వచ్చింది. సమాచారం అందుకొని వందల సంఖ్యలో రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. ఈ మేరకు వారు సెల్‌ఫోన్‌లోని యాప్‌లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా, అప్పటికే స్టాక్ నిల్ చూపించింది. అవాకై ్కన రైతులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కారు. వ్యాపారులు ముందే యాప్‌లో యూరియా బుక్ చేసుకుని నల్లబజారుకు తరలిస్తున్నారని వారికి అధికారులు సహకరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యవసాయ కార్యాలయం ఎదురుగా మెదక్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నిమిషాల వ్యవఽధిలోనే రెండు వేల బస్తాలు ఎలా అయిపోతాయని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు, మండల వ్యవసాయ అధికారి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కేవలం నిమిషం వ్యవధిలోనే యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని, దీంతో యాప్‌లో నిల్ స్టాక్ చూపిస్తుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో అదనంగా స్టాక్ తెప్పించి రైతులకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. యాప్ రద్దు చేయాల్సిందే చేగుంట(తూప్రాన్): యూరియా యాప్‌తో గ్రామాల్లోని రైతులకు యూరియా దొరకడం లేదని చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..గ్రామాల్లో ఎక్కువమంది రైతులు చిన్న ఫోన్లు వాడుతున్నారని వారికి యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. స్మార్ట్ఫోన్లున్న రైతులకు సైతం యూరియా బుకింగ్ చేసుకునేలోపే క్షణాల్లోనే బుకింగ్ పూర్తవుతుందని పేర్కొన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్ ఇబ్బందిని గుర్తించిన ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేస్తామని సర్దిచెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. గోదాంకు తాళం చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో యూరియా గోదాంకు మంగళవారం తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. నెట్ వర్క్ సమస్యతో తమకు బుక్ కావడంలేదని నేరుగా తమకు యూరియా అందించాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో తాము యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన సాధ్యం కావడంలేదన్నారు. అదే ఇతర గ్రామాల రైతులకు ఆన్లైన్లో యూరియా బుక్ అవుతుందన్నారు. యూరియా దొరకపోవడంతో తమ పంటలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు జంగరాయి గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించి యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గడ్డం నెల్లూర్ తదితర రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. తమకు నేరుగా యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
బడుల్లో బాహ్య మూల్యాంకనం
బోధనకు ఇబ్బందులేర్పడతాయి ఐదు రోజుల పాటు టీచర్లు మూల్యాంకన కేంద్రాల్లో ఉండటంతో బోధనకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే ప్యానల్ టీంలలో సుమారు 20 మంది టీచర్లు బడి విడిచి వెళ్లారు. విద్యార్థులు ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేఽశ్యంతో సొంత పాఠశాలల్లో కాపీయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఆమోద యోగ్యం కాదు. –పంతుల రాజు, పీఆర్టీయూ,మండల శాఖ అధ్యక్షుడు మూల్యాంకనంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఎక్స్టర్నల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల ఎస్ఏ–1,ఎస్ఏ–2తో పాటు పదో తరగతి ఎస్ఏ–1కు ఇది వర్తించనుంది. మూల్యాంకనం చేసే టీచర్లకు పారితోషికం ఇచ్చే విధంగా నిధులు విడుదల చేయనున్నారు. కాగా ఉపాధ్యాయ వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. –పాపన్నపేట(మెదక్) ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా నాలుగు ఫార్మేటివ్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిని సంబంధిత పాఠశాలకు చెందిన సబ్జెక్ట్ టీచర్లే మూల్యాంకనం చేస్తుంటారు. అయితే అనుత్తీర్ణతకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆలోచనతో టీచర్లు విద్యార్థులందరినీ పాస్ చేస్తుంటారని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సరిగా మూల్యాంకనం చేయకుండానే మార్కులు వేస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఇంకొన్ని పాఠశాలల్లో విద్యార్థులతోనే మూల్యాంకనం చేయిస్తారనే విమర్శలున్నాయి. మండల వనరుల కేంద్రాల్లో మూల్యాంకనం ఇక నుంచి ఎస్ఏ–1,ఎస్ఏ–2 పరీక్షలకు సంబంధించి బాహ్య పాఠశాలల టీచర్ల ద్వారా మూల్యాంకనం చేయిస్తారు. ఇంటర్నెట్, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలున్న మండల వనరుల కేంద్రం లాంటి సౌకర్యాలున్న చోట మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తారు. పరీక్ష కాగానే వెంటనే జవాబు పత్రాలను సీల్డ్ కవర్లలో ప్యాక్ చేసి కేంద్రానికి పంపాలి. ఏ టీచర్‌కు సొంత పాఠశాల జవాబు పత్రాలు ఇవ్వకూడదు. ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్న పాఠశాల, ఉన్నత పాఠశాల కొకరు చొప్పున ఎవాల్యుయేషన్ ఇన్చార్జిలను నియమించాలి. 1 నుంచి 5 తరగతుల వరకు పేపర్‌కు రూ.2 చొప్పున, 6 నుంచి 10 వరకు రూ.3 చొప్పున ఎన్యూమరేషన్ చెల్లిస్తారు. 3 నుంచి 5 రోజుల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి అదేరోజు ఆన్లైన్లో మార్కులు నమోదు చేయాలి. మండల వనరుల కేంద్రం మూల్యాంకనానికి పారితోషికం 1 నుంచి 9 తరగతి వరకు అమలు ఇది సరికాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు -
రీ సర్వేలో కచ్చితమైన డేటా అందించండి
● జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ● సాలోజిపల్లిలో భూముల రీ సర్వే పరిశీలన టేక్మాల్(మెదక్): సెక్షన్్ 22ఏ పరిధిలోని భూములకు సంబంధించి మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి కచ్చితమైన డేటాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలం సాలోజిపల్లిలో మంగళవారం భూముల రీ సర్వేను ఏడీ ల్యాండ్ సర్వేయర్ కిషన్‌తో కలిసి పరిశీలించారు. భూములు రీ సర్వే, భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సు దరఖాస్తులు పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ..వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సెక్టార్, గ్రామాల వారీగా ప్రొఫార్మాలో సిద్ధం చేయాలన్నారు. మండల, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే అవసరమైన సవరణలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న పాత డేటాను సేకరించి ప్రస్తుత వివరాలతో పోల్చి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన అంశాలకు సంబంధించి నిబంధనల ప్రకారం ప్రొఫార్మాలు సిద్ధం చేసి, తహసీల్దార్, ఆర్డీవో, రెవెన్యూ అదనపు కలెక్టర్ సంతకాలతో సమర్పించాలని తెలిపారు. నవంబర్ 30 నాటికి భూములకు సంబంధించిన యాక్షన్ ప్లాన్్పై పూర్తి వివరాలతో కూడిన నివేదికలను ప్రతీ మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. పంటల నమోదుపై నిర్లక్ష్యం వద్దు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదుపై ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మండలంలోని ఎల్లుపేట్ గ్రామంలో జరుగుతున్న పంటల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంటల నమోదును పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 6.9% పంట నమోదు పూర్తయినట్లు వివరించారు. పంటల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సమగ్ర వివరాలను సంబంధిత శాఖకు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి, ఏఈఓ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. -
తవ్వేకొద్దీ అక్రమాలే..
డీసీసీబీలో వెలుగుచూస్తున్న వాస్తవాలు● రూ.5.20 కోట్లతో బ్రాంచ్‌ల పునర్నిర్మాణం ● నిబంధనలకు విరుద్దంగా ఆఫ్‌లైన్‌లో టెండర్ ప్రక్రియ ● సుమారు రూ.కోటి వరకు ముడుపులు? జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచ్‌ల రినోవేషన్ (పునర్ నిర్మాణం) పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. సుమారు రూ. ఐదు కోట్లకు మించి అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. దాదాపు పదేళ్లుగా పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’ అధికారి పాలకవర్గంలోకి కీలక నేత కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న డీసీసీబీ బ్యాంకుల బ్రాంచ్‌లను రినోవేషన్ చేయాలని నిర్ణయించారు. ఆయా బ్రాంచుల్లో కొత్త ఫర్నీచర్, ఇంటీరియర్, క్యాషియర్ కౌంటర్, బీఎం క్యాబిన్, లాకర్లు, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఇలా.. ఆయా బ్రాంచులను రినోవేషన్ చేశారు. ఏ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లోనైనా రూ.5 లక్షలకు మించి అంచనా వ్యయం కలిగిన పనులను ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువకు టెండర్ కోట్ చేస్తే వారికి పని అప్పగిస్తారు. కానీ ఆన్లైన్లో టెండర్లు పిలిస్తే పోటీ ఎక్కువై తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు దక్కవు. దీంతో ఆఫ్‌లైన్ పేరుతో మొక్కుబడిగా టెండర్ ప్రక్రియ నిర్వహించి మమ అనిపించారు. తమకు అనుకూలైన కాంట్రాక్టర్లకు ఈ రినోవేషన్ పనులు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. ఇలా 26 బ్రాంచులకు సగటున సుమారు రూ.20 లక్షల చొప్పున రూ.5.20 కోట్లు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. ఈ పనుల్లో ఏకంగా సుమారు రూ.కోటికి మించి చేతులు మారినట్లు అనధికారిక అంచనా. ఆ కాంట్రాక్టర్లకే ఎక్కువ పనులు ఈ రినోవేషన్ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు ఐదారు కట్టబెట్టారు. ఎనిమిది కాంట్రాక్టర్లు, కంపెనీల పేరుతో ఈ పనులు చేపట్టి.. అందిన కాడికి దండుకున్నారు. బ్యాంకు ప్యానల్ ఇంజనీర్లు వేసిన ఎస్టిమేషన్ల కంటే ఎక్సెస్ (ఎక్కువ)కు టెండర్లు దక్కించుకుని అంచనా వ్యయం కంటే అదనపు దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. భారీగా పర్సెంటేజీలు డీసీసీబీకి కొత్తగా ఐదు బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు 2023లో ఆర్బీఐ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ బ్రాంచులకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కూడా ఒక్కో భవనానికి రూ. లక్షల అంచనా వ్యయంతో పనులు చేశారు. అయితే ఈ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలిచినప్పటికీ.. బిల్లుల చెల్లింపుల్లో భారీ మొత్తంలో పర్సెంటేజీలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివరాలిచ్చేందుకు నిరాకరణ రినోవేషన్ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు డీసీసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. విచారణ దశలో ఉన్నప్పుడు ఈ వివరాలు ఇవ్వడం కుదరదని దాటవేస్తుండటం పలు ఆరోపణలు దారితీస్తోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకే పూర్తి వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల మంది రైతులు చెల్లించే వడ్డీలపై నడుస్తున్న ఈ బ్యాంకులో అక్రమార్కులు అందిన కాడిక దండుకుని జేబులు నింపుకుంటున్న వ్యవహరాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రినోవేషన్ పనుల వివరాల కోసం ‘సాక్షి’ ప్రతినిధి డీసీసీబీ ఇన్చార్జి సీఈఓ సురేష్‌ను సంప్రదించగా.. విచారణ కొనసాగుతుండగా వివరాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. -
పక్కాగా.. సాగు లెక్క
● ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం ● జిల్లాలో ఇప్పటివరకు 2.99 లక్షల ఎకరాలు సాగు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో జిల్లాలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగానే రైతులకు ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్ట పరిహారం వంటివి అందుతాయి. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్, రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశాలున్నాయి. అలాగే సర్వేలో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. రామాయంపేట(మెదక్): పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లా పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ఈమేరకు వలంటీర్లు యాప్ డౌన్లోడ్ చేసుకొని పంట వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏఈఓలతోనే సర్వే చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేయగా, వారు ఇతరత్ర పనులతో బిజీగా ఉండటంతో వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఎంపికై న వలంటీర్లు ఇప్పటికే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే పనులు ప్రారంభించి ఆన్లైన్లో సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 2.99 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇప్పటికే 234 మంది నియామకం జిల్లాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 380 మంది వలంటీర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే 234 మందిని ఎంపిక చేయగా, వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ఈమేరకు వారు సర్వేలో తేలిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మిగితా 146 మందిని త్వరలో నియామకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎంపిక చేయాల్సిన వలంటీర్లు సదరు రెవెన్యూ గ్రామానికి చెందిన వారై ఉండాలి. వారు ఆండ్రాయిడ్ 11 ఫోన్ కలిగి ఉండి, కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఎంపికై న వారికి ఆన్లైన్లో శిక్షణ ఎంపికై న వలంటీర్లు గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 45 రోజుల్లోపు వీరు తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ఏరోజుకారోజు యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన ఒక్కోదానికి కేంద్రం ఏడు రూపాయలు చెల్లిస్తుంది. ఆన్లైన్ విధానం ద్వారా వీరికి డబ్బులు చెల్లించనున్నారు. ఎంపికై నవారికి ఇప్పటికే యాప్ వినియోగం, పంట సాగు నమోదు విషయమై ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. -
నేటి నుంచి పోలీస్‌యాక్ట్
మెదక్‌జోన్: ఈనెల 1 నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేయరాదని, అలాచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన నిరసనలు చేయరాదన్నారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నర్సాపూర్: ఈనెల 2వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో 22–ఏ భూ సమస్యలపై నర్సాపూర్‌లో నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిరసన దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరవుతారని చెప్పారు. పేద రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. మెదక్‌జోన్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నేటి మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రావు కోరారు. సోమవారం పట్టణంలోని కార్యాలయంలో యూనియన్ నేతలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చి న హామీలు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ నేతలు సౌమ్యానాయక్, తదితరులు ఉన్నారు. 5 వరకు రేషన్ పంపిణీ డీఎస్ఓ నిత్యానంద్ మెదక్ కలెక్టరేట్: నిరుపేదలు రేషన్ బియ్యం తీసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలో మూడు నెలల కోటా గత నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈనెల 5 వరకు రేషన్ బియ్యం తీసుకునే అవకాశం కల్పించిందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ పేర్కొన్నారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమీపంలోని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు. పాపన్నపేట(మెదక్): సమస్యల పరిష్కారం కోసం.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రజావాణికి ఆశించిన మేర స్పందన లభించడం లేదు. సరైన ప్రచారం లేక జనాలు రావడం లేదు. దీంతో అధికారులంతా సెల్ఫో న్లు చూస్తు టైంపాస్ చేస్తున్నారు. సోమవారం పాపన్నపేటలో ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు ఇలా ఫోన్‌తో కాలక్షేపం చేశారు. నారాయణఖేడ్: రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్ఎస్)నే పోషిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నారాయణఖేడ్‌కు సోమవారం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ స్థాపించి 120 రోజులు అయిందని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ రేవంత్ సర్కార్‌కు వంద చెరువుల నీళ్లు తాగించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అన్నివర్గాల సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. యువతతో పాటు నిరుద్యోగులు, దివ్యాంగులు, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. -
బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. జిల్లాలో గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, పంట కాల్వల మరమ్మతుల చేపట్టాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ధర్నాలు, పాదయాత్రలతో అధికార పార్టీని ఇరుకున పెట్టి అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాదయాత్ర చేయగా, తాజాగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దీంతో మెతుకుసీమలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. – మెదక్‌జోన్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజాసమస్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వంపై, ఇటు అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది సింగూర్ ప్రాజెక్టుపై ఆధారపడిన ఘనపూర్ ఆనకట్ట రైతులకు క్రాఫ్హాలిడే ప్రకటించి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆయకట్టు రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చెరువులు, కుంటలు, బ్రిడ్జిలు, కట్టు కాల్వలకు మరమ్మతులు చేయకపోవడంతో వేలాది ఎకరాల ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారాయని, రైతులతో కలిసి రాయినిపల్లి ప్రాజెక్టును సందర్శించారు, కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రభుత్వం నిలిపి వేసేకుట్ర చేస్తోందని, ఇటీవల కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేశారు. అలాగే నిజాంపేట మండలంలోని చల్మెడ–నందగోకుల్ మధ్య గల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ప్రజల్లోకి.. మొన్న పద్మారెడ్డి, నిన్న సునీతారెడ్డి పాదయాత్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీత ధర్నాలు, పాదయాత్రలతో జిల్లాలో వేడెక్కిన రాజకీయం మెదక్–వెల్దుర్తి రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించాలనే డిమాండ్‌తో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డితో పాటు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి వెల్దుర్తి నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేపట్టారు. వెల్దుర్తి, ఉప్పులింగాపూర్, రామాయపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు. యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు. -
బాలికల సంరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు కలెక్టర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులకు రాఖీలు కట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, భద్రత, విద్య భవిష్యత్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాఖీ వేడుకల ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు బాలికల భద్రత గౌరవాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, బాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తక్షణ పరిష్కారం చూపండి
ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్మెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు తక్షణ పరిష్కారం చూపాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 48 వినతులు స్వీకరించారు. అందులో భూ భారతి–16, ఇందిరమ్మ ఇండ్లు–6, పెన్షన్లు 1, ఇతర దరఖాస్తులు 25 కలిపి మొత్తం 48 వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించారు. పరిష్కరించిన వాటిని వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం
నర్సాపూర్: ఆరు గ్యారంటీలు, 420 హామీలతో రాష్ట్ర ప్రజలను దగా చేసిన కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుదామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, తెలంగాణ ప్రజల పాలిట తీవ్ర శాపంగా మారిందన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామన నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కుదేలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ముఖ్య నేతలకు వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు తీసుకువెళ్లి ఎండగట్టాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మాణాక్రావు, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్‌రావు -
చేసిన సేవలే గుర్తింపునిస్తాయి
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మెదక్ కలెక్టరేట్: ఉద్యోగ సమయంలో చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తింపునిస్తాయని, ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ వెంకటయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం పట్టణంలోని ఓ గార్డెన్లో నిర్వహించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్, ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్‌సింగ్‌తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు హాజరై వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి ఉద్యోగ సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అవి జీవితకాలం గుర్తుండేలా చేస్తాయన్నారు. అనంతరం యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో వెంకటయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల అవస్థలు పట్టవా?
మెదక్ కలెక్టరేట్: మెదక్ నుంచి పిల్లికోటాల మీదుగా వెల్దుర్తి వరకు ఉన్న రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వెల్దుర్తి నుంచి పిల్లికోటాల్ వరకు పాదయాత్ర నిర్వహించి ఆయా గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడుతు న్నారని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరైన నిధులను రద్దు చేసిందని ఆరోపించారు. వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
జంక్షన్లకు మహర్దశ
రామాయంపేట(మెదక్): మెదక్, సిద్దిపేట చౌరాస్తాల వద్ద జంక్షన్ల విస్తరణకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. ఈ రెండు జంక్షన్ల వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ రోడ్డు ఇరుకుగా మారి పెద్ద వాహనాల టర్నింగ్ కష్టతరమవుతుంది. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. సిద్దిపేట రోడ్డు వద్ద రోడ్డు మరీ ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రెండు జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు మంజూరు చేసింది. ఈనిధులతో కూడళ్లు విస్తరించనున్నారు. మెదక్ రూట్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈనిధులతో జంక్షన్ల విస్తరణతో పాటు ఫౌంటేన్, మొక్కల పెంపకం, రేయిలింగ్, లైటింగ్, దిమ్మ, ల్యాడర్, ఇతరత్ర పనులు జరగనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రెండు జంక్షన్ల వద్ద ఇరువైపులా వంద ఫీట్ల మేర రహదారిని విస్తరించనున్నారు. దీంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విస్తరణకు నిధుల మంజూరు -
చేయూతకు దరఖాస్తుల వెల్లువ
చేయూత పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు జిల్లాల వారీగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సుమారు నాలుగేళ్ల అనంతరం కొత్తగా పెన్షన్లు మంజూరుకు కసరత్తు చేయడంతో లబ్ధిదారులు ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 33,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సంగారెడ్డి 13,492, మెదక్ 10,411 సిద్దిపేటలో 9,741 మేర అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో సంగారెడ్డి జిల్లా 9వ స్థానంలో ఉంది. –సంగారెడ్డి జోన్ కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ప్రాధాన్యమిచ్చారు. అత్యధికంగా వితంతు మహిళలతోపాటు దివ్యాంగుల పెన్షన్లకు అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీల ద్వారా ప్రతీనెల 1,51,955 మంది లబ్ధిదారులకు రూ.33.43 కోట్ల మేర పెన్షన్లు అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016ల చొప్పున ప్రతీనెల అందజేస్తుంది. అనర్హుల తొలగింపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనర్హులు కూడా అక్రమంగా పెన్షన్ పొందుతుండటంతో వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించారు. కొన్నేళ్లుగా 3,155 మంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వేలో తేలింది. 2022 ఆగస్టు 31 నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది పథకానికి దూరంగా ఉన్నారు. చాలామంది కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణితో పాటు మండలస్థాయిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు కొత్తగా మంజూరు చేస్తున్న పెన్షన్ల కోసం అర్హులై ఉన్నప్పటికీ సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటితో గడువు ముగియనుంది. https:// cheyutha.telengana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతోపాటు సంబంధిత పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత కార్యదర్శితోపాటు మండల పరిషత్ కార్యాలయాల్లో అందించాలి. వీరితోపాటు జిల్లాలో ఉన్న వృద్ధులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంజూరులో వీరికి ప్రాధాన్యత లేకపోవటంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 33,644 అప్లికేషన్లు దరఖాస్తుకు నేడు తుది గడువు వితంతు, దివ్యాంగుల వారే అధికం సర్టిఫికెట్లు లేక పలువురు ఇబ్బందులు -
సైన్స్ హబ్‌గా సర్కారు బడులు
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ హబ్‌గా మార్చే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేయించేందుకు అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. సైన్స్ పాఠ్యాంశాలను కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా ప్రయోగాల ద్వారా అర్థం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలల్లో ఈ అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 28 పాఠశాలలు ఉండగా మెదక్ జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 3 పాఠశాలలున్నాయి. ఇందుకుగాను రూ.9.30 కోట్లను ఆర్.సి నం.778/ఎస్ఎస్/సీడబ్ల్యూ/ 2026–27 ద్వారా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాగాంధీ (కేజీబీవీ)లకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతీ స్కూల్లో సైన్స్ ల్యాబ్ నిర్మాణం, పరికరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు ఖర్చు చేయనున్నారు. ల్యాబ్ గది నిర్మాణం, వర్క్ స్టేషన్స్, ఫర్నీచర్ కోసం రూ.25లక్షలు కాగా, సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు రూ.లక్ష చొప్పున కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఇవీ పాఠశాలలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 పాఠశాలల్లో సైన్స్ ల్యా బొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో కేజీబీవీ నారాయణఖేడ్, కంగ్టి, ఆందోల్, సదాశివపేట్, తాటిపల్లి, హత్నూర, సిర్గాపూర్, రాయికోడ్, పుల్కుర్తి, జెడ్పీహెచ్ఎస్ మునిపల్లి, ముదిమాణిక్యం, కంకోల్(యుఎం), గొంగ్లూర్, ఫసల్వాది, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం, కొల్లూరు, పిచేరాగడి, ర్యాకల్, ధన్సిరి, కల్హేర్, మాసాన్‌పల్లి, కడ్పల్, చిరాగ్పల్లి, హద్నూర్, చాల్కి, ఎంయూపీఎస్ పుక్తానగర్, కాసీంపూర్, మెదక్ జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ కౌడిపల్లి, వరిగుంతం, రుస్తుంపేట్, కేజీబీవీ చిట్కుల్, వెల్దుర్తి, సిద్దిపేట జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ రాంసాగర్, కేజీబీవీ అక్కన్నపేట్, ఎంపీహెచ్ఎస్ బంగ్ల వెంకటాపూర్ పాఠశాలలున్నాయి. ల్యాబ్‌ల నిర్మాణం ల్యాబ్‌ల నిర్మాణ బాధ్యత తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఈఈడబ్ల్యూఐడీసీ) చేపట్టనుంది. టర్న్‌కీ పద్ధతిలో గదుల నిర్మాణం నుంచి ఎలక్ట్రిఫికేషన్, పరికరాల ఏర్పాటు వరకు అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పనుల నాణ్యతను ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్తగా తనిఖీ చేయనున్నారు. అంతా సక్రమంగా పూర్తి చేసి పాఠశాల హెచ్ఎంలకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. త్వరగా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. 9, 10 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలల్లో ఏర్పాటు రూ.9.30 కోట్లు విడుదల సంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 28, మెదక్‌కు 5, సిద్దిపేటకు 3 ప్రయోగాధారిత బోధన అందితే శాసీ్త్రయ ఆలోచన, పరిశీలనా శక్తి, ప్రశ్నించే తత్వం, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత వంటి అనేక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ విద్య నాణ్యత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భవిష్యత్ ఉన్నత విద్యతోపాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టిమ్) కేరీర్‌లకు బలమైన పునాది ఏర్పడనుంది. -
చెరుకుపై ఎల్‌నినో ప్రభావం
● దిగుబడులు పడిపోయే పరిస్థితి ● ఎకరానికి సగటున 25 టన్నులు వచ్చే అవకాశం ● వర్షాభావ పరిస్థితులే కారణం జహీరాబాద్: చెరుకు పంట దిగుబడులపై ఎల్‌నినో ప్రభావం పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల ఆగిపోయింది. ఫలితంగా పంట దిగుబడులు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు నెలల్లో పంట క్రషింగ్ కోసం సిద్ధం కానుంది. అయినా ఆశించిన మేర ఎదగలేదు. తగినంత మేర వర్షాలు కురిస్తేనే పంట ఏపుగా ఎదిగి పిలకలు అధికంగా వచ్చి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఎకరాకు పంట దిగుబడి గతేడాది 36 టన్నుల మేర వచ్చింది. ఈ ఏడాది 25 టన్నులకు పడిపోయే పరిస్థితి నెలకొన్నట్లు వారు చెబుతున్నారు. అధికార వర్గాలు మాత్రం 30 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంత మేర దిగుబడులు వస్తే పెట్టిన పెట్టుబడులకే సరిపోతుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంట సాగు చేసినా ప్రయోజనం ఏముండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కనీసం 40 టన్నుల మేర దిగుబడులు వస్తేనే చెరకు పంట లాభసాటిగా ఉంటుందంటున్నారు. జిల్లాలో 27 వేల ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్లు అంచనా. పెట్టుబడులు యథాతధం చెరుకు సాగుకు పెట్టుబడులు మాత్రం యధాతధంగా పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. దుక్కి దున్నకం నుంచి క్రషింగ్ కోసం సిద్ధం అయ్యే వరకు పెట్టుబడులు పెట్టినట్లు వివరిస్తున్నారు. దుక్కిలో ఎరువులు వేసుకోవడం, చెరకు పంట నాటు కోవడం, తర్వాత కలుపు తీయడం, మరో మారు ఎరువులు వేయడం, బోదెలు పగులగొట్టడం, తర్వాత కట్టు కట్టడం, అనంతరం కలుపు నివారణకు గడ్డి మందులు పిచికారీ చేయడం లాంటి వాటి కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. -
రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం
మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మెదక్ కలెక్టరేట్: రెండు రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ రాధిక హామీ ఇచ్చారు. పట్టణంలోని సాయిదత్తా థియేటర్ వద్ద గత రెండు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండటంతో సాయినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదివారం స్థానిక కౌన్సిలర్‌తో పాటు మాజీ కౌన్సిలర్ సమీ యొద్దీన్, స్థానిక ప్రజలు సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించారు. వెంటనే ఆర్అండ్బీ అధికారులతో ఫోన్ ద్వారా మా ట్లాడి వెంటనే రోడ్డు సమస్య పరిష్కరించాలన్నారు. అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు భూపతిరాజ్ తదితరులు ఉన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని పీఆర్టీ యూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, ప్రధానమైన మూడు డిమాండ్లతో సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని పీఆర్టీయూ నాయకులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ పథకం దోహదపడుతుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం బోరంచలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఈసందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేవలం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట పేదలను మభ్యపెట్టేందుకే పరిమితమయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇళ్లు దక్కాయన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. బిల్లులు సైతం సకాలంలోనే ఖాతాల్లో జమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, బెల్లాపూర్ సర్పంచ్ దిగంబర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: భారీ వర్షాలు కురవకపోయిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలం గౌసాబాద్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొండపై నుంచి నీరు జాలువారుతుండటంతో ప్రకృతి అందాలు, నీటి పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. సజ్జరావు పేట తండా ప్రాంతంలో గల జాడిమల్కాపూర్ వాటర్ ఫాల్ (ఎత్తిపోతల) వద్ద కూడా జలకళ సంతరించుకుంది. మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన మంచి సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్‌రావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి శారదతో కలిసి ప్రిన్సిపాల్ రఘునందన్‌రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వృత్తి రీత్యా పదవీ విరమణ సర్వసాధారణమన్నారు. -
వచ్చే నెలలో అల్పాహారం!
పాపన్నపేట(మెదక్): విద్యార్థులకు అల్పాహార పథకాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు టిఫిన్లు సరఫరా చేసేందుకు ,మెదక్‌లోని మార్కెట్ యార్డులో కేంద్రీకృత వంటశాల నిర్మాణం కొనసాగుతోంది. ఇక్కడి నుంచే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్లు సరఫరా చేయనున్నారు. అయితే అనుకున్న ప్రకారం పనులు పూర్తి అవుతే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అల్పాహార పథకం ప్రారంభమయ్యే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. కాగా, అధికారికంగా ప్రభుత్వం ఏదైనా తేదీ నిర్దారిస్తే అందుకనుగుణంగా ప్రారంభం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 70 వేల విద్యార్థులకు రోజుకో రకం టిఫిన్ జిల్లాలో 881 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా ఉన్నత పాఠశాల స్థాయిలో చాలామంది విద్యార్థులు సమీప గ్రామాల నుంచి కాలి నడకన ఎలాంటి టిఫిన్లు చేయకుండానే వస్తుంటారు. అందుకే పోషకాహరంతో కూడిన టిఫిన్లు అందివ్వాలని, ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించింది. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ.8లతో, 6 నుంచి 10 తరగతుల వారికి రూ.12తో అల్పాహారం అందించాలని ప్రణాళిక రూపొందించారు. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యాని, కిచిడి, మరో మూడు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీతోపాటు రాగి జావ, విజయ డెయిరీ పాలు ఇవ్వాలని నిర్ణయించారు. టిఫిన్ల తయారీ బాధ్యతలు ట్రస్టులకు జిల్లాలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ సంస్థ ద్వారా టిఫిన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ట్రస్టు ద్వారా కొన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం మెదక్‌లోని మార్కెట్ యార్డులో కేంద్రీకృత వంటశాల ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కరెంట్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలో పూర్తయితే కొన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 5న ప్రారంభం చేసే అవకాశముందని, తర్వాత దశల వారీగా అన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా కిచెన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. పథకం ప్రారంభోత్సవ తేదీ నిర్ణయం కాలేదన్నారు. కొనసాగుతున్న కేంద్రీకృత వంటశాలల నిర్మాణం దశల వారీగా అక్టోబర్ నాటికి అన్ని మండలాలకు జిల్లాలో సుమారు 70 వేల మందికి టిఫిన్లు -
బీమాకు మంగళం!
రైతన్నకు అకాల మరణం సంభవిస్తే అతనిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి ప్రభుత్వం మంగళంపాడింది. దీంతో రైతు సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు. – మెదక్‌జోన్ జిల్లాలో 21 మండలాలు ఉండగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు భూములున్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం 3,00,558 మంది రైతులున్నారు. రైతు కుటుంబాల కోసం 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏదేని కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమాను ఇచ్చేది. దీంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు దక్కేది. ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర్నుంచీ ప్రతి ఏటా ఆగస్టు 14న రైతులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని సదరు బీమా కంపెనీలకు ప్రభుత్వమే చెల్లించేది. క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసేవారు. కాగా ఈసారి మాత్రం రెన్యూవల్ గడువు ముగిసి 15 రోజులవుతున్నా బీమా ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. దీంతో ఇక పథకానికి మంగళం పాడినట్టేనా..? అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కుటుంబీకులందరిపై పట్టా అప్పటి ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టాక చనిపోయిన బాధిత రైతుకుంటుంబానికి బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం డబ్బులు అందాయి. రైతు కుటుంబాలను ఆదుకునే ఈ పథకం అందరికి వర్తించాలనే ఉద్దేశ్యంతో ఒక్క కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే ఆ నలుగురిపై ఉన్న భూమిని తలా ఇంత పట్టా చేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పథకాల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది రైతుబీమా పథకమనే చెప్పాలి. 41 మంది మృత్యువాత ఈ నెల 13తో రైతు బీమా గడువు ముగిశాక 15 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 41 మంది రైతులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాలకు ఇన్య్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. 13 వరకే పనిచేసిన ఇన్స్యూరెన్స్ 14 నుంచి నమోదుకాని ‘డెత్’వివరాలు 15 రోజుల్లో జిల్లాలో 41 మంది మృత్యువాత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు -
అధనంతో అక్రమాలు!
ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రైతులనుంచి రూ.1.57 కోట్లు అదనపు వసూళ్లు బ్యాంకు నిర్వహణ పేరుతో నిధులు స్వాహా! గత పాలకవర్గం నేత, బదిలీపై వెళ్లిన ‘ముఖ్య’అధికారి కలిసి దందా! జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వ్యవహారం మెదక్‌జోన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు చౌరస్తా నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్, మహిళలకు బస్టాండ్ నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రన్నింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని కోరారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ అహ్మద్, చైర్మన్ శివ, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు పాల్గొన్నారు. గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని డీసీఓ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...30,000 మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా జిల్లాలోని అనువైన పీఏసీఎస్‌లను గుర్తించి గోదాముల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో చర్చించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు సులభంగా అందేలాలా యూడీఐడీ కార్డులు తప్పనిసరని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత స్పష్టం చేశారు. ప్రభుత్వ దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా యూడీఐడీ శిబిరం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో శనివారం దివ్యాంగుల యూడీఐడీ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ...మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన శిబిరంలో మొత్తం 175 స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 147 మంది దివ్యాంగులు హాజరైనట్లు చెప్పారు. లోకోమోటర్ డిజేబిలిటీ 66మంది, జనరల్ మెడిసిన్ 26 మంది, కంటి వైద్య విభాగం 18 మంది, ఈఎన్టీ విభాగం: 20 మంది, సైకియాట్రీ: 12 మంది, పీడియాట్రిక్స్ 05 మంది హాజరైనట్లు తెలిపారు. మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మైనార్టీ కమిషన్ జిల్లా చైర్మన్ సూఫీజానీ పేర్కొన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్‌తో కలిసి శనివారం సాయంత్రం మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల, హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ కిచెన్‌ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూఫీజానీ మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు హాస్టల్, కళాశాల తనిఖీ నిర్వహించానన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు. సంగారెడ్డి టౌన్ : గ్రామీణ ప్రాంత పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, సీసీ కెమెరా సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా డైరెక్టర్ రాజేశ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండి 19 నుంచి 45 ఏళ్లు కలిగిన పురుషులకు ఉచిత శిక్షణ శిక్షణతోపాటు ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి,మెదక్ జిల్లాల వారికి అవకాశముందని సెప్టెంబర్ 8 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని పూర్తి సర్టిఫికెట్లతో 9704446956, 9949964097 నంబర్‌కు సంప్రదించాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ఉన్న డీసీసీబీల్లో లేనివిధంగా ఇక్కడ ఈ అదనపు చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7% వడ్డీని వసూలు చేయాలి. కానీ ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు అదనంగా 1% ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేశారు. అంటే రూ.లక్ష రుణం తీసుకున్న రైతు రూ.7వేల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యిమంది రైతుల వద్ద ఈ అనధికారిక వసూళ్ల దందా సాగింది. అన్నదాతలను నిండా ముంచేశారు. రైతులు తిరగబడటంతో వెనక్కి! అమాయక రైతులు, నిరక్షరాస్యుల వద్ద వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. కానీ కాస్త చైతన్యం ఉన్న రైతులు ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించారు. ఎక్కడా లేనిది అదనంగా చార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. దీంతో దాదాపు నాలుగు నెలలపాటు సాగిన ఈ వసూళ్ల దందాను గుట్టు చప్పుడు కాకుండా నిలిపివేశారు. రైతుల వాటాధనంగా నడుస్తున్న ఈ బ్యాంకు అదే రైతులకు ఇచ్చే పంట రుణాలపై అదనపు వసూళ్లు చేసి వారిని నిండా ముంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముగిసిన పాలకవర్గం తీర్మానాలు ఈ అదనపు చార్జీల వసూళ్లకు మేనేజింగ్ కమిటీ (ఎంసీ) తీర్మానాలున్నాయని డీసీసీబీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ బ్యాంకు మేనేజ్మెంట్ కమిటీ (పాలకవర్గం) పదవీకాలం 2025 ఫిబ్రవరిలోనే ముగిసింది. కానీ అదనపు వసూళ్లకు 2025 జూన్ 12న తీర్మానం చేశారు. అంటే పదవీకాలం ముగిన పాలకవర్గం తీర్మానం ఎలా చెల్లుతుందో అధికారులకే తెలియాలి. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం వారి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారని డీసీసీబీ అధికారులు చెబుతున్నారు. పొడిగించిన ఈ తాత్కాలిక పాలకవర్గానికి రైతులపై భారం మోపే తీర్మానాలు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. 2025 జూన్ 12 నుంచి 2025 అక్టోబర్ 8 తేదీ వరకు ఈ రూ.1.57 కోట్లు వసూళ్లకు తెగబడ్డారు. రైతులు తిరగబడకపోతే ఈ వసూళ్ల దందా మరింత సాగే అవకాశాలుండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా బ్యాంకు తీర్మానాలు చేసిన రైతులందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. కానీ వసూళ్ల తీర్మానాలను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్క్యూలర్లు ఇచ్చేశారు. ఎంత లాభాలుంటే అంత స్వాహా బ్యాంకుకు ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంతే మొత్తంలో స్వాహా చేయవచ్చనే ఈ అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ డబ్బులు చాలా మట్టుకు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలు ఇదే బ్యాంకులో పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’అధికారి, గత పాలకవర్గంలోని కీలక నాయకుడు కలిసి చేసిన ఈ స్వాహా పర్వంలో గత పాలకవర్గంలోని మరికొందరికి వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి. ఈ అక్రమదందాపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుగుతోంది. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతిని విచారణ అధికారిగా నియమించినట్లు సమాచారం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతలను నిండా ముంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ డీసీసీబీల్లో లేనివిధంగా పంట రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ చార్జీల పేరుతో ఏకంగా రూ.1.57 కోట్లు వసూలు చేసేశారు. ఈ డబ్బును నిర్వహణ ఖర్చుల పేరుతో స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకవర్గంలో ఓ కీలక నాయకుడు, ఏళ్ల తరబడి బ్యాంకులో పాతుకుపోయి.. ఇటీవల బదిలీ అయిన ఓ ‘ముఖ్య’అధికారి కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలపై అదనపు భారం మొపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించలేదు పంటరుణాలపై వసూలు చేసిన ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ చార్జీలు ఎవరి వ్యక్తిగత ఖాతాకు మళ్లించలేదు. మిసిలీనియస్ ఇన్కమ్ ఖాతాలో జమ చేశాం. పంట రుణాలపై అదనపు చార్జీలు వసూలు చేసుకోవచ్చని ఆర్బీఐ నిబంధనలున్నాయి. –సురేశ్, ఇన్చార్జి సీఈఓ, డీసీసీబీ కలెక్టర్ ప్రతిమాసింగ్ మైనార్టీ కమిషన్ జిల్లా చైర్మన్ సూఫిజానీ రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గుట్టుగా నిలిపివేత -
రైతుల్ని రోడ్డుమీద పడేస్తుండ్రు
రైతు బీమా పథకాన్ని సకాలంలో రెన్యూవల్ చేయకపోవటంతో అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఈ ప్రభుత్వం రోడ్డుమీద పడేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది మరణించారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? పాకాల శ్రీహరిరావు, తెలంగాణ రైతు సంరక్షణ సమితి అధ్యక్షుడు ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవు ఈ నెల 13న రైతుబీమా గడువు ముగిసింది. 14 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 41 మంది రైతులు మరణించారు. వారి మరణ వివరాలను ఆన్లైన్లో నమోదు కావడంలేదు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దేవ్‌కుమార్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి -
ప్రభుత్వ కళాశాలలకు నిధులు
● ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.35.25 లక్షలు విడుదల ● విద్యార్థుల సంఖ్య ప్రకారం కేటాయింపు ● తప్పనున్న నిర్వహణ ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.35.25లక్షలు కేటాయించారు. ఈ నిధులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు చేశారు. ఇందులో జనరల్ ఫండ్‌గా రూ.25,38,000, ఎస్సీ ఫండ్‌గా 5,99,250, ఎస్టీ నుంచి 3,87,750 నిధులు ఉన్నాయి. మౌలిక వసతుల కోసం.. 30 మందిలోపు ఉన్న కళాశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101– 250 వరకు రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మంది ఉన్న కాలేజీలకు రూ.లక్ష వరకు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కళాశాలకు కావాల్సిన స్టేషనరీ, ల్యాబ్ నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. చాక్‌పీసులు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు, బుక్లెట్లు ఇతర వాటికి వినియోగించనున్నారు. నిధులు మంజూరుతో కాలేజీలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నిధుల విడుదల ఇలా.. జిల్లా కళాశాలలు నిధులు సిద్దిపేట 20 రూ 12,00,000 మెదక్ 16 రూ 10,50,000 సంగారెడ్డి 20 రూ 12,75,000 -
సవాల్..ప్రతి సవాల్
● బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న వివాదం ● రంగంపేటలో రెచ్చిపోయిన ఇరువర్గాలు ● ఎస్ఐ జోక్యంతో శాంతించిన నేతలుకొల్చారం(నర్సాపూర్): అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ల మధ్య సవాల్..ప్రతి సవాల్‌తో మండలంలోని రంగంపేట గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్‌కుమార్‌పై మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రంగంపేట గ్రామానికి చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు వారం క్రితం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. దీన్ని సవాలుగా తీసుకున్న రమేశ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు శనివారం వ్యక్తిగత విమర్శలపై గ్రామ రచ్చబండకు వస్తే సమాధానం ఇస్తామని సవాల్ విసిరారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం సై అనడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు పార్టీల వారు పంచాయతీ రచ్చబండ వద్దకు చేరుకున్నారు. రమేశ్‌కుమార్ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలపై మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో, ఇటు బీఆర్ఎస్ పార్టీ వారు సైతం అదే రీతిలో స్పందించారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సీనియర్ నాయకులుగా ఇరువర్గాలు పంతానికి పోకుండా ప్రెస్‌మీట్‌తోనే సరిపెట్టాలని సర్దిచెప్పడంతో రమేశ్ తన పార్టీ కార్యకర్తలతో కలసి అక్కడినుంచి వెళ్లిపోయారు. రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు: రమేశ్‌కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ...తనపై తన, పార్టీపై ప్రజలు చూపెడుతున్న ఆదరణను ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రస్తుతం డీసీఎంఎస్ వైస్‌చైర్మన్‌గా ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో నాటి ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్సార్, రోశయ్యలను గ్రామానికి తీసుకువచ్చి, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఏనాడు కబ్జాలకు పాల్పడింది లేదని, ఇప్పటి తమ కుటుంబ ఆస్తులు అమ్ముకొని ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వచ్చిన కొందరు నాయకులు ప్రజల సొమ్మును, ప్రజాధనాన్ని దోచుకుంటూ ఆస్తులు కూడబెట్టుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, ప్రజలే వారికి బుద్ధి చెప్తారంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ సురేశ్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు, యువజన నాయకులు సుధాకర్, సత్యగౌడ్, గంగా రాములు, ప్రసాద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
2న బీజేపీ నిరసన దీక్ష
నర్సాపూర్‌ః ప్రజల భూములను 22ఏ నుంచి కాపాడేందుకు సెప్టెంబరు 2న నర్సాపూర్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ధర్నా నిర్వహణపై సన్నాహక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 22ఏ చట్టం తెచ్చి అమాయక రైతుల భూములను నిషేధితజాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆ జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలన్న డిమాండ్‌తో స్థానిక బస్టాండ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై జిల్లా స్థాయి నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు సురేశ్, రాంలు, కొండల్రావు, రమేశ్‌గౌడ్, నారాయణరెడ్డి, విజయ్, జనార్దన్ తదితరులున్నారు. పాదయాత్రలో పద్మారెడ్డి రామాయంపేట, నిజాంపేట(మెదక్): బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్‌ను దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన నిజాంపేట మండలం నందగోకుల్, చల్మెడ గ్రామాల మధ్య రహదారిని తారు రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తూ పద్మారెడ్డి నిర్వహించిన ఆరు కిలోమీటర్ల పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు వెంట నడిచారు. గత నాలుగేళ్లుగా రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు కాగా, నిజాంపేట, నస్కల్ గ్రామాల మధ్యే తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పద్మారెడ్డి పాదయాత్రకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ శేరి శుభాష్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శశీధర్‌రెడ్డి, స్ధానిక మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ జెడ్పీచైర్మన్ లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్, సీనియర్ నాయకులు జీవన్‌రావు, పార్టీ నిజాంపేట మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘చేయూత’ కొందరికేనా?
● బీడీ కార్మికులు, వృద్ధులపై స్పష్టత కరువు ● 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు మెదక్ కలెక్టరేట్: వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో జిల్లాలోని అర్హుల్లో ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో బీడీ కార్మికులు, వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. పది రకాల పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సర్కారు, వీరివి మాత్రం తర్వాత చూస్తామంటూ ప్రకటించింది. అయితే వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, పైలేరియా, చేనేత కార్మికుల దరఖాస్తులు స్వీకరిస్తుంది. జిల్లాలో 1.6 లక్షల పింఛన్లు జిల్లాలో ఇప్పటికే 1.6 లక్షల మందికి ప్రభుత్వం వివిధ రకాల పింఛన్లు అందజేస్తుంది. ప్రతీనెల వీరికి సుమారు రూ.23 కోట్ల పైచిలుకు అందజేస్తుంది. ఇదే క్రమంలో అర్హులు ఈనెల 31లోగా అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సుమారు 8 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలో దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకునేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రజలకు అవగాహన సైతం కల్పిస్తున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం ఆన్లైన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నా వయసు 66 ఏళ్లు. నా భర్త చనిపోయి 20 ఏళ్లు అవుతుంది. అప్పు డు అవగాహన లేక డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు. అయితే అంగన్వాడీ ఆయాగా పనిచేయడంతో వితంతు పింఛన్ ఇవ్వలేదు. ప్రస్తుతం వయసు మీద పడింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒక పింఛన్ మంజూరు చేయాలి – భాగమ్మ, అంసాన్పల్లి, కొల్చారంజిల్లాలో పింఛన్లు పొందుతున్న వారు రామాయంపేట(మెదక్): పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని ప్రగతి ధర్మారంలో శుక్రవారం కొత్త ఫించన్ల దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, మండల వ్యవ సాయ అధికారి ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. వృద్ధులు, బీడీ కార్మికుల దరఖాస్తుల స్వీకరించొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే వృద్ధులు, బీడీ కార్మికుల దరఖాస్తు లు స్వీకరిస్తున్నాం. కాని ఆన్లైన్ చేయడం లేదు. ఈనెల 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. అనంతరం వాటి పై విచారణ చేస్తాం. – భీమయ్య, డీపీఎంబీడీ కార్మికులు 15,610 వృద్ధులు 34,662 వితంతువు 42,587 దివ్యాంగులు 7,851 కల్లుగీత కార్మికులు 818 చేనేత కార్మికులు 437 పైలేరియా 454 డయాలసిస్ 184 ఒంటరి మహిళలు 4,070 -
సర్వం.. వసూళ్ల పర్వం!
● జిల్లాలో సుదీర్ఘ కాలం మైనింగ్ ఏడీఏగా పనిచేసిన జయరాజ్ ● పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు తూప్రాన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఇళ్లు, ఆయన బంధువుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఆస్తు లు వెలుగుచూశాయి. సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే జయరాజ్ గతంలో జిల్లా మైనింగ్ ఏడీఏగా సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన తన అధికార బలంతో భారీగా అక్రమ సంపాదనకు తెరలేపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా లోని తూప్రాన్, శివ్వంపేట, మాసాయిపేట, చేగుంట తదితర మండలాల్లో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంకర మిషన్లు (స్టోన్ క్రషర్లు), క్వారీల యజమానులతో చేతులు కలిపి జయరాజ్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా కంకర మిషన్లకు అనుమతులు ఇవ్వడం, పరిమితికి మించి మైనింగ్ జరుగుతున్నా మామూళ్లు తీసుకొని పట్టించుకోకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ. కోట్ల ఆదాయానికి గండికొట్టి, ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తూ తన సొంత ప్రయోజనాలు చూసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూప్రాన్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకాధికారిగా పనిచేసిన సమయంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు పలువురు విమర్శిస్తున్నారు. అక్కడా అదే దందా.. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ శాఖ ఏడీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జయరాజ్ తన ‘మామూళ్ల’ దందాను యథేచ్ఛగా కొనసాగించినట్లు సమాచారం. ఇంత స్వల్ప కాలంలోనే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడం వెనుక మైనింగ్ మాఫియాతో ఆయనకున్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. ఈ అవినీతి సామ్రాజ్యం వెనుక పెద్దల హస్తం ఉందనే కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. -
నేటి నుంచి ఐటీఐలో వాక్ ఇన్ అడ్మిషన్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీతో పాటు ప్రైవేట్ ఐటీఐలో శనివారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హాజరు కావాలన్నారు. నిర్ధేశించిన ట్రేడ్లలో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు కాపీని తీసుకురావాలి. ఖాళీ సీట్ల వివరాలు ప్రతిరోజు ఉదయం అప్డెట్ చేస్తామన్నారు.సంగారెడ్డి క్రైమ్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు అండర్–16 సెలక్షన్ ఈనెల 30న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ తెలిపారు. సంగారెడ్డి జూబ్లీ క్లబ్ ప్రాంగణంలోని ఎమ్మెస్ క్రికెట్ మైదానంలో ఎంపిక నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్, బోనఫైడ్, 2 ఫొ టోలతో హాజరుకావాలని సూచించారు. రామాయంపేట(మెదక్): సీఎంఆర్ బకాయిపడిన మండలంలోని అక్కన్నపేట శివారులో ఉన్న భద్రకాళి రైస్‌మిల్లులో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్‌మిల్లులో స్టాక్‌తో పా టు రికార్డులు పరిశీలించారు. వివరాలు చెప్పడానికి వారు నిరాకరించారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందగౌడ్ను సంప్రదించగా.. భద్రకాళి రైసుమిల్లు యాజమాన్యం మూడు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతో రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించిందని చెప్పారు. రేగోడ్(మెదక్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. అనంతరం గజ్వాడలో పంచాయతీ భవనం, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ భవనాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పథకాల ప్రయోజనాలను సకాలంలో అందించాలని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ సరోజన పాల్గొన్నారు. అకాడమిక్ క్యాలెండర్లో విద్యార్థుల ఫొటో నంగునూరు(సిద్దిపేట): నర్మేట పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రచురిస్తున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలసి విద్యార్థులు దిగిన ఫొటోను ప్రచురించారు. మార్చి 22న నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం, రాష్ట మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్ తోపాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి, అల్పాహారంపై తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టాల్‌ను పరిశీలించిన సీఎం, మంత్రులు, విద్యాశాఖ కమిషనర్, ఎంపీ రఘునందన్‌రావులు విద్యార్థులతో మాట్లాడి సంతోషంతో ఫొటో దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముద్రించిన క్యాలెండర్లో మార్చి 2027 నెల పేజీలో నాటి ఫొటోతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఫొటోకు చోటు దక్కింది. -
31 వరకే ఎల్పీజీకీ ఈకేవైసీ
నారాయణఖేడ్: వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ (ఎల్పీజీ) వినియోగదారులకు ఈ– కేవైసీ గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 16 తర్వాత 23వ తేదీ నాటికి ఈ– కేవైసీ పూర్తి చేయని వినియోగాదారులకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్ యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్ కంపెనీలు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాయి. ఆయా కంపెనీలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 6 లక్షల పైచిలుకున్నాయి. బోగస్ ఏరివేతకే! బోగస్ కనెక్షన్లు, అర్హత లేని లబ్ధిదారులు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న కనెక్షన్లు, ఒకే కుటుంబానికి ఉన్న డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు కేంద్రం ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఎల్పీజీ కనెక్షన్‌కు ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇకపై రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీ నిలిచిపోనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కనెక్షన్ రద్దు చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా ఈ–కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో పలుమార్లు గడువు విధించినప్పటికీ వంద శాతం ఈ–కేవైసీ పూర్తి కాలేదు. ఫలితంగా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తిరిగి ఈనెలాఖరుగా చివరి అవకాశం కల్పించాయి. అర్హులకే సబ్సిడీ.. ఎల్పీజీ కనెక్షన్లు క్రమబద్దీకరించడంతోపాటు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని అందించేందుకు ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. కొన్ని ప్రాంతాల్లో మరణించిన వ్యక్తుల పేర్లతోనే గ్యాస్ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. అర్హతలేని వ్యక్తులు, ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కొనసాగుతున్న సందర్భాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి కనెక్షన్లను ఈ–కేవైసీ ద్వారా ఫిల్టర్ చేసి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియలో వినియోగదారుల గుర్తింపు నిర్ధారించేందుకు ఆధార్ వివరాలతోపాటు బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటున్నారు. వేలిముద్ర, ఐరిస్ వంటి వివరాలను ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్లకు అనుసంధానం చేయడం ద్వారా అసలైన వినియోగదారులను గుర్తించవచ్చని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ముందుగా రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఇప్పటికే బుక్ చేసిన సిలిండర్లు కూడా రద్దయ్యే పరిస్థితి ఉండొచ్చు. భవిష్యత్తులో కనెక్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేని సిలిండర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అనుసంధానించని పక్షంలో కనెక్షన్ తొలగింపు -
రాఖీ.. రష్
రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం నర్సాపూర్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఇదే అదనుగా అదనపు చార్జీలు వసూలు చేసింది. నర్సాపూర్ నుంచి బాలానగర్ వరకు ఆర్డీనరీ బస్సుకు రూ. 80 చార్జీ ఉండగా, ప్రత్యేక సర్వీసులో అదనంగా రూ.30 వసూలు చేశారు. అలాగే నర్సాపూర్ నుంచి మెదక్‌కు ఆర్డీనరీ సర్వీసులో రూ. 70 చార్జీ ఉండగా, అదనంగా రూ. 30 తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించలేదని ప్రయాణికులు వాపోయారు. – నర్సాపూర్ -
ఎఫ్ఆర్
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి మొత్తం 905 ఉన్నాయి. వాటి పరిధిలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కలిపి మొత్తం 4,498 మంది ఉన్నారు. వీరంతా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఉపాధ్యాయుడితో పాటు బోధనేతర సిబ్బంది సైతం విధులు నిర్వర్తించే చోటు నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ వేయాలి. లేనిచో ఆరోజు ఆబ్సెంట్ పడుతుంది. పాఠశాల పరిధి నుంచే వేయాలి. మరో చోట ఉండి ఎఫ్ఆర్ఎస్ వేస్తామంటే కుదరదు. అలాగే బడికి సెలవు పెట్టినా దీనిలోనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బోధన మెరుగుపడేనా? డుమ్మా టీచర్లకు కళ్లెం పడటంతో ఇకనైనా సర్కార్ బడుల్లో బోధన మెరుగు పడేనా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీచర్లు వారి పిల్లలను ప్రైవేట్‌కు పంపకుండా ప్రభుత్వ బడులకు పంపే విధంగా చర్యలు తీసుకుంటే బోధనలో మార్పు వస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఏటా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రైవేట్ బడుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. విధులు నిర్వర్తించే చోటు నుంచి ఫొటో క్యాప్చర్ త్వరలో జీతాలకు లింకు జిల్లాలో 905 ప్రభుత్వ పాఠశాలలు ఐదు అంకెల జీతం తీసుకుంటూ విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం)తో చెక్ పడింది. ప్రతిరోజు విధులు నిర్వర్తించే చోటు నుంచే సకాలంలో ఫొటో క్యాప్చర్ చేయాల్సి రావటంతో పంతుళ్లు విధిగా విధులకు హాజరవుతున్నారు. కాగా, త్వరలో ఎఫ్ఆర్ఎస్ ఆధారంగానే వేతనాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తునట్లు తెలిసింది. – మెదక్‌జోన్ -
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
మెదక్‌జోన్: ‘మహిళలు, బాలికల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థిను ల చదువుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఇటీవలే ‘పోలీస్ అక్కా’ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రవేశపెట్టాం. షీటీంల తో ఆకతాయిల ఆటకట్టిస్తున్నాం. పోక్సోను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు ఉచితంగా న్యాయ సలహా ఇవ్వడంతో పాటు కోర్టు ఆదేశాలతో పరిహారం అందించి బాధితులకు అండగా నిలుస్తున్నాం’ అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాఖీ పండుగా నేపథ్యంలో మహిళల రక్షణ చర్యలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. విద్యార్థునులకు కొండంత అండ జిల్లాలో 21 పోలీస్స్టేషన్లు ఉండగా, ప్రతి పీఎస్‌కు ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించాం. వీరు ఆయా మండలాల పరిధిలోని ప్రతి కాలేజీలు, హైస్కూల్స్‌లో విద్యార్థినులతో సమావేశం అవుతున్నారు. ర్యాగింగ్ చేసినా, ప్రేమ పేరుతో ఇబ్బందులు పెట్టినా ఆ మహిళా కానిస్టేబుల్ ఫోన్ నంబర్ ప్రతి విద్యార్థినికి అందజేస్తున్నారు. ఫోన్ రాగానే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ‘పోలీస్ అక్కాను’ కార్యక్రమం ప్రత్యేకంగా జిల్లాలో ఏర్పాటు పోక్సో బాధితులకు న్యాయం గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో జిల్లాలో 233 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ట్రయల్‌కు వచ్చిన కేసుల్లో 29 మంది నింధితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇందులో 12 మందికి 20 ఏళ్ల పాటు శిక్ష పడగా, ముగ్గురికి 10 ఏళ్ల పాటు, 7 గురికి 5 సంవత్సరాలు, ఒక్కరికి ఏడాదికి. మరొకరికి రెండేళ్ల పాటు శిక్ష పడే విధంగా సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాం. ఆకతాయిల ఆటకట్టు జిల్లాలో రెండు షీటీంలను ఏర్పాటు చేశాం. ఆకతాయిలను గుర్తించి స్టేషన్ తీసుకువచ్చి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నాం. గడిచిన మాడేళ్లలో వందలాది మందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు రెండోసారి సైతం మహిళలకు వేధించిన వారిపై కేసులు నమోదు చేశాం. బాధితులకు ‘భరోసా’ గడిచిన 8 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 15 రేప్ కేసులు కాగా, 57 పోక్సో కేసులు నమోదు చేశాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌తో బాధిత మహిళలను, బాలికలను ఆదుకుంటున్నాం. మెడికల్, న్యాయ సలహా, సైకాలజిస్ట్‌తో కౌన్సెలింగ్, కోర్టు ఆదేశాల మేరకు పరిహారం అందించి అందిస్తున్నాం. మహిళలు, బాలికల రక్షణ కోసం నిరంతరం నిఘా పెడుతున్నాం. ‘సాక్షి’తో ఎస్పీ శ్రీనివాసరావు -
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు అమ్మ వారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులతో ముందు నడువగా భక్తులు, ఆలయ సిబ్బంది పల్లకీ మోశారు. ఆలయం నుంచి బయలుదేరి రాజగోపురం నుంచి గోకుల్ షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని పాతూర్ జెడ్పీ హైస్కూల్లో గురువారం డీఈఓ రాజు విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో యూనిఫాంలు కుట్టించినట్లు తెలిపారు. అవసరమైన నోట్బుక్లు అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించి మంచి విద్యనందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం నాగరాజు, కో–ఆర్డినేటర్ మహలక్ష్మి, రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా మైనింగ్ అధికారి నాగరాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా మేడ్చల్ నుంచి జిల్లాలోకి కంకర తీసుకొస్తున్న టిప్పర్‌ను మనోహరాబాద్ వద్ద పట్టుకొని 16 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. రామాయంపేట మండలంలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న జేసీబీని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఎవరైనా సరే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ కలెక్టరేట్: పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిచాలని జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ నివేదిక ఫిట్మెంట్ ప్రకటన చేయాలన్నారు. ఆరు విడతల కరువు భత్యం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీఆర్టీఎఫ్, పెన్షనర్స్ అసోసియేషన్ తదితర సంఘాల నాయుకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. సమర్థవంతంగా ‘సర్’ సంగారెడ్డి: సర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓ అనురాధ సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆమె పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3,2, 22 వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఎల్ఓలు రజిత, రవి నాయక్, 3వ వార్డు ఆఫీసర్ నవీన్, మాజీ కౌన్సిలర్లు రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధానికి ‘రక్ష’
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026రాఖీలు కొనుగోలు చేస్తున్న మహిళలు అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వచ్చింది. శుక్రవారం పండుగను ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సమాయత్తం అయ్యారు. కాగా, మెదక్ పట్టణ ంలో వివిధ రకాల రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుందన్లు, మెరుపులు జరీతో పాటు స్పాంజితో తయారు చేసిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలను ఆకర్షించేందుకు కార్టున్ రాఖీలు కూడా వచ్చాయి. అలాగే మిఠాయి దుకాణాల్లో వివిధ రకాల స్వీట్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. – మెదక్ కలెక్టరేట్/ చిన్నశ ంకరంపేటమెదక్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ -
‘తీజ్’ సంబురం
నారాయణఖేడ్: ఖేడ్ మండలం ఆకలాయి తండాలో గురువారం తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివాహం కాని యువతులు తమకు మంచి భర్త రావాలని కోరుకోగా, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని తండా వాసులు వేడుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్ సందర్శించి తండాలోని భవానీమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
రామాయంపేట(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్): సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభమైన నిమిషం వ్యవధిలోనే ‘నో స్టాక్’ అని చూపిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కనిపించకపోవడంతో గురువారం మాసాయిపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పక్క మండలాలకు చెందిన రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ధర్నాతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే రామాయంపేట మండలం కోనాపూర్‌కు 350 బస్తాల యూరియా రాగా, వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఇతర గ్రామస్తులకే యూరియా బస్తాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రామాయంపేట– సిద్దిపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సహకార సంఘం గోదాంకు తాళం వేశారు. ఎస్సై బాలరాజ్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ రైతులను సముదాయించారు. కోనాపూర్ వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు -
చట్టబద్ధమైన దత్తతే సురక్షితం
మెదక్ కలెక్టరేట్: చట్టబద్ధమైన దత్తతే సురక్షితమైన మార్గమని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌కు చెందిన దంపతులు బాలసదన్ నుంచి 11 ఏళ్ల బాలికను కలెక్టర్ సమక్షంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంక్షేమానికి సంబంధించిన నిబంధనలను పాటిస్తూ, అధికారిక ప్రక్రియ ద్వారా దత్తత తీసుకోవడం ద్వారా బాలలకు సురక్షితమైన, ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను, సంబంధిత అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. బాలిక బాగోగులను ప్రతి 6 నెలలకు ఒక సారి పరిశీలించాలన్నారు. అంతకుముందు ప్రజలకు కలెక్టర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, డీసీపీఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
భద్రత సవాలే..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే అవుట్ పోస్టు పరిధిలో కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కలిపి మొత్తం 20 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విస్తరించి ఉంది. కాగా, 35 ఏళ్ల క్రితమే ఈ అవుట్ పోస్టు ఏర్పాటైంది. మెదక్ జిల్లాలో అక్కన్నపేట నుంచి ప్రారంభమై జిల్లా శివారు కూచారం వరకు 45 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విస్తరించి ఉండగా, జిల్లా పరిధిలో 12 స్టేషన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలోనే నెలలో కనీసం 15 నుంచి 18 వరకు రైల్వే కేసులు నమోదవుతున్నాయి. యువకులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం, గంజాయి సరఫరా, బియ్యం అక్ర మ రవాణాతో పాటు రైళ్లలో చోరీలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాణికులు ఏమరుపాటుగా ఉ న్నా బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, బ్యాగు లు చోరీకి గురవుతున్నాయి. అటకెక్కిన ప్రతిపాదనలు ప్రతి జిల్లాలో కనీసం ఒక అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు గతంలో నిర్ణయించినా, అది కార్యరూపం దాల్చలేదు. జిల్లా పరిధిలో ఒక అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితమే ఆశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న అవుట్ పోస్టు పరిధి ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట నేరాలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోవడం ఆలస్యం అవుతుండటంతో బాధితులు ఇబ్బందులపాలవుతూ గంటలతరబడి నిరీక్షిస్తున్నారు. తనిఖీలు కరువు స్టేషన్లు, రైళ్లలో సరైన తనిఖీలు లేకపోవడం సంఘవిద్రోహులకు వరంగా మారింది. ఈరైల్వే లైన్ ఆరు రాష్ట్రాల వరకు విస్తరించి ఉండగా, ఇటీవల నిషేధిత వస్తువుల అక్రమ రవాణా పెరిగిందని రైల్వేశాఖ, ఎకై ్సజ్ అధికారులు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. గతంలో ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబుపెట్టినట్లు అకతాయిలు ఫోన్‌కాల్ చేయడంతో రైలును నిలిపి ప్రత్యేక పోలీస్ బలగాలు తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి అవుట్ పోస్టు పరిధిలో అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండగా, దీనిపై దృష్టి పెట్టడానికి తగినంత సిబ్బంది లేరనే వాదన వినిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం కామారెడ్డి రైల్వేస్టేషన్లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. మూడు జిల్లాల పరిధిలోని స్టేషన్లు కామారెడ్డి, తలమడ్ల, తిప్పాపూర్, బిక్కనూరు, రామేశన్పల్లి, అక్కన్నపేట, మీర్జాపల్లి, వడియారం,శ్రీనివాసనగర్, బ్రాహ్మణపల్లి, పాలాట పోతారం, మనోహరాబాద్, కూచారం, మెదక్, లక్ష్మాపూర్, ఔ రంగాబాద్, నాచారం, గజ్వేల్, కొడకండ్ల, సిద్దిపేట రైల్వేస్టేషన్ల ఉన్నాయి. ఈవిషయమై రైల్వేశాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. జిల్లాలో ఒ క అవుట్‌పోస్ట్‌కు ప్రతిపాదనలు ఉన్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారించారని తెలిపారు. మూడు జిల్లాలకు ఒకే ఒక్క పోలీస్ అవుట్ పోస్ట్ 20 రైల్వేస్టేషన్లు.. 200 కిలోమీటర్ల పరిధిలో రక్షణ కరువు నిత్యం ప్రమాదాలు.. చోరీలు యథేచ్ఛగా మత్తు పదార్థాల రవాణా మూడు జిల్లాలు.. 20 రైల్వేస్టేషన్లు.. 200 కిలోమీటర్ల పరిధి.. వెరసి ఒకే ఒక పోలీస్ అవుట్‌పోస్టు.. ఫలితంగా రైల్వేస్టేషన్ల పరిధిలో అక్రమ రవాణ, చోరీలు పెరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం 25 వరకు కేసులు నమోదవుతున్నాయి. – రామాయంపేట(మెదక్) -
నిర్వాసితుల సమస్యలు సీఎం దృష్టికి
● మల్లన్నసాగర్ ఉద్యమం కళ్లెదుట కదలాడుతోంది ● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ● ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ గజ్వేల్: మల్లన్నసాగర్ ఉద్యమం ఇంకా కళ్లెదుట కదులుతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల వ్యవహరించిన తీరు మరిచిపోలేనని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపై ఉపాధ్యాయుడు పులి రాజు, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్‌రెడ్డిలు సంయుక్తంగా రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వాసిత కాలనీలో ఆవిష్కరించారు. చేసిన గోరంత పనిని కొండంత చేసి 14గ్రామాలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన కొట్లాడితే తనను రెండుసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తు చేశారు. నిర్వాసితుల పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను తమ పుస్తకంలో రచయితలు కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ప్రశ్నించేతత్వం అలవాటుచేసుకున్నప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ మల్లన్నసాగర్ నిర్వాసితుల గోసలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలుసునని చెప్పారు. బాధితుల పక్షాన తన పాట ద్వారా పోరాటం చేస్తానన్నారు. అవసరమైతే సీఎం కలిసి సమస్యలను వివరిస్తానని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, వెల్దెండి నర్సింహ్మారెడ్డి, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాప్‌రే.. యూరియా కష్టాలే!
చిన్నశంకరంపేట ఆగ్రోస్ కేంద్రం వద్ద బారులు తీరిన రైతులుతూప్రాన్లో ఆందోళన చేస్తున్న రైతులు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. తూప్రాన్ పట్టణంలోని రైతు ఆగ్రోసేవా కేంద్రంలో బుధవారం యూరియా ఆందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పటికీ అందుబాటులో లేదని మండిపడ్డారు. ఇతర మండలాలకు చెందిన రైతులకు యూరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు స్పందించి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అలాగే చిన్నశంకరంపేట ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు భారీ బారులుతీరారు. యాప్‌లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ, తెల్లవారుజాము నుంచే క్యూలో ఉన్నామని వాపోయారు. పాత పద్ధతిలోనే యూరియా బుక్ చేయాలని కోరుతున్నారు. – తూప్రాన్/చిన్నశంకరంపేట(మెదక్) -
దక్కేదెవరికి?
నామినేటెడ్● పదవుల భర్తీకి పీసీసీ సమాయత్తం ● వచ్చే నెల 5 లోగా ప్రతిపాదనలుఇవ్వాలని ఇన్చార్జిలకు ఆదేశాలు ● మెదక్ పీఏసీ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ అధికార కాంగ్రెస్‌లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకు, ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన నాయకుల మద్య అంతర్గత పోరు రగులుతోంది. పార్టీ అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరిన నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఆదిపత్యం చెలాయిస్తుండటం సీనియర్ నాయకులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రధాన ఎజెండాగా ఇటీవల మెదక్ పట్టణంలో ఉమ్మడి జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగిన విషయం విధితమే. పార్టీ కోసం కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు వస్తాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భరోసా ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న మార్కెట్, ఆలయ కమిటీలు, సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు ఇలా.. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు ఆదేశాలందాయి. సెప్టెంబర్ 5లోపు ఈ ప్రతిపాదనలు డీసీసీ అధ్యక్షుల ద్వారా ప్రతిపాదనలు రావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పదవుల నియామకాల్లో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత దక్కుతుందా..? లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కండువా కప్పుకుని ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా మారిన వలస నేతలకు దక్కుతాయా..? అనేది అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రెండు, మూడు చోట్ల మినహా.. ● ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య అంతర్గతంగా కిరికిరి కొనసాగుతోంది. ● సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్త, పాత నాయకులకు పదవుల పంచాయతీ ఏకంగా గాంధీభవన్‌కు చేరిన విషయం విధితమే. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడికి పార్టీ మండలాధ్యక్ష పదవిని ఎలా ఇస్తారని మూడు నెలల క్రితం పాత నాయకులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా గాంధీభవన్‌ను ముట్టడించారు. ఈ నియామకాన్ని పరిశీలిస్తామని పీసీసీ నాయకత్వం సముదాయించి పంపింది. దీంతో ఇక్కడ కొత్త, పాత నేతలు తామే పార్టీ మండలాధ్యక్షున్ని అంటే., నేనే మండలాధ్యక్షున్ని అని ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పంచాయతీ ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సహకార సంఘాల చైర్మన్, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయనేంది ఆసక్తి నెలకొంది. ● మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. పాత, కొత్త నాయకుల మధ్య కిరికిరి కారణంగా కొన్ని మండల పార్టీ అధ్యక్షుల నియామకాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. శివ్వంపేట మండల పార్టీ అధ్యక్ష పదవితో పాటు, మండల కమిటీ పదవులు కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇవ్వొద్దని.. పాత నాయకులంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కమిటీ నియామకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలాంటి మండలాల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు పాత వారికి దక్కుతాయా? కొత్త నేతలను వరిస్తాయనేది వేచి చూడాల్సిందే. -
సీ్త్రనిధి.. రుణమేదీ?
‘పాపన్నపేట మండల కేంద్రంలో ఓ మహిళ తన కూతురు పెళ్లి కోసం సీ్త్రనిధి రుణం తీసుకోవాలని అనుకుంది. తమ వీఓఏ పరిధిలో 30 గ్రూపులు ఉండగా, 29 గ్రూపుల సభ్యులు మొత్తం రుణాలు కట్టేశారు. ఒక్క గ్రూపు మాత్రమే రూ.37,254 బకాయి ఉంది. ఫలితంగా ఆ గ్రూపు ఎన్పీఏ పరిధిలోకి వెళ్లింది. దీంతో వీఓ పరిధిలో మొత్తం గ్రూపులకు రుణం రాని పరిస్థితి నెలకొంది.’ పాపన్నపేట(మెదక్): గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో 1982లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15,110 డ్వాక్రా, 530 గ్రామ సంఘాలు ఉన్నాయి. చాలా మంది మహిళలు బ్యాంకు లింకేజీలతో రుణాలు పొంది, చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. దీనికి తోడు సీ్త్రనిధి, పొదుపు సొమ్ము సహాయంతో తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే ఈ రుణాల్లో కొన్ని ప్రాంతాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో బ్యాంకు, ఐకేపీ, వీఓఏలు కలిసి రుణాలు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ గోల్మాల్ వ్యవహారంలో ఒక సీసీ సస్పెన్షన్‌కు గురికాగా, చివరకు వీఓఏ ఆత్మహత్య చేసుకుంది. ఇచ్చింది రూ.16.50 కోట్లు! జిల్లాలో రుణాల వసూళ్లలో అక్కడక్కడా చోటు చేసుకుంటున్న అక్రమాల దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేశారు. ఒక వీఏఓ పరిధిలో 75 శాతం రికవరీ ఉంటేనే రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో 6427 గ్రూపులకు సంబంధించి రూ.150.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాగా మొండి బకాయిల కింద 829 గ్రూపులు ఉండగా, రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈఏడాది రూ.74.90 కోట్ల రుణాలు టార్గెట్ ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.50 కోట్లు మాత్రమే ఇచ్చారు. 5 నెలల కాలంలో 21 శాతం రుణాలు మాత్రమే ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శణమనే ఆరోపణలున్నాయి. 75 శాతం రికవరీ ఉంటేనే మంజూరు బకాయి పడిన 829 గ్రూపులు రావాల్సిన సొమ్ము రూ.25 కోట్లు జిల్లాలో 15,110 గ్రూపులు -
చేతులతోనే
వెుదక్ మున్సిపాలిటీ సుమారు 7 దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. ఇందులో 14 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా సుమారు లక్ష వరకు జనాభా ఉంది. నిత్యం పట్టణం నుంచి 15 టన్నుల చెత్త వస్తుంది. 128 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో చెత్త వాహనాలు నడిపే డ్రైవర్లతో పాటు, లేబర్స్, జవాన్లు సైతం ఉండగా అందులో కేవలం 30 మంది మాత్రమే పర్మినెంట్ వర్కర్లు. మిగతా వారంతా ఔట్‌సోర్సింగ్‌లో నియామకమైన వారే. వీరు తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా సరిపడే విధంగా గ్లౌస్లు, రేడియేషన్ ప్యాడ్స్, (ఆఫ్రాన్) రెయిన్కోర్టు లు, బూట్లు, మాస్కులు, ఆయిల్, సబ్బులు ఇవ్వాలి. కానీ గత ఏడాది మార్చిలో ఇచ్చిన అధికారులు నేటికీ ఇవ్వలేదు. దీంతో మురికి కాలువల నుంచి మురుగును ఎలాంటి రక్షణ లే కుండా చేతులతోనే ఎత్తి పోస్తున్నారు. నిత్యం చెత్తను చేతులతోనే ఎత్తుతూ వాహనాల్లో తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ.. వారిని పట్టించుకున్న పాపాన పోవటం లేదు. నేటికీ అందని కనీస వస్తువులు దృష్టిసారించని అధికారులు పారిశుద్ధ్య కార్మికుల వెతలు అన్నీఇన్నీకావు.. ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో వ్యర్థాలను చేతులతోనే ఎత్తిపోస్తున్నారు.. ఏటా అందాల్సిన వస్తువులు అందకపోవడం.. ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ప్రమాదమని తెలిసినా చేసేదిలేక రక్షణ పరికరాలు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. డ్రైనేజీల్లో నెలల తరబడి పేరుకుపోయిన మురుగు.. కంపు కొడుతున్నా.. చేతులకు కనీసం గ్లౌజులు, ముక్కుకు మాస్కు లేకుండానే ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారు. ఈ దుస్థితి అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్‌జోన్ అసలే ఔట్సోర్సింగ్ సిబ్బంది.. నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన వస్తువుల గురించి ప్రశ్నిస్తే ఆ మరుసటి రోజే విధుల్లో నుంచి తొలగిస్తారనే భయంతో మౌనంగా భరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస రక్షణ పరికరాలు కార్మికులకు అందించాలని పలువురు కోరుతున్నారు. -
నేటి నుంచి గ్రామ సభలు
● ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నేటి నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించే సభలను జిల్లాలోని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని తెలిపారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో..? లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలిపారు. అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదుకు ఫారం–6, పేరు తొలగింపు, ఇతర అభ్యంతరాల కోసం ఫారం–7, వివరాల సవరణ కోసం ఫారం–8ను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం చేయూత పెన్షన్లపై కలెక్టర్ మాట్లాడారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి అవకాశమని తెలిపారు. అలాగే తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా జరుగుతున్న టెన్త్, ఇంటర్ ప్రవేశాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళిమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సింగపూర్ టూర్‌కు టీచర్ రవిరాజ్
నర్సాపూర్ రూరల్: మండలంలోని అద్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ సింగపూర్ స్టడీ టూర్‌కు ఎంపికయ్యారు. టీచర్లకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది టీచర్లను ఆర్జేడీ, డీఈఓల ద్వారా ఎంపిక చేయగా, రవిరాజును మాత్రం తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితారాణా ప్రత్యేకంగా ఎంపిక చేయడంపై ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన శ్రమకు తగిన ఫలితం వచ్చిందని ఉపాధ్యాయుడు రవిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో అధ్యయనం చేసి వచ్చిన అనంతరం మరింత బాధ్యతతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తానని తెలిపారు. జహీరాబాద్ టౌన్: నిమ్జ్ ప్రాజెక్టులోకి అదనంగా గుంట భూమి కూడా పోదని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మాజీ డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని హద్నూర్‌కు చెందిన రైతులు హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. కొత్త సర్వే నంబర్లు జాబితాలో కనిపించడంతో ఈ విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే టీజీఐఐసీ ఈడీ వీరారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సాంకేతిక లోపాల వల్ల కొత్త సర్వే నంబర్లు జాబితాలో కనిపించాయని, రెండు, మూడు రోజుల్లో సరిదిద్దుతామని ఆయన తెలిపారు. హరీశ్‌రావును కలిసిన వారిలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, ఉపసర్పంచ్ షబ్బీర్, మాజీ సర్పంచ్ రాజ్‌కుమార్, నాయకులు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. జహీరాబాద్ టౌన్: వ్యవసాయ శాఖలో సుధీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న డిప్లొమా ఏఈఓలకు అన్యాయం కల్గించే జీఓ 39ను రద్దు చేయా లని తెలంగాణ ఏఈఓ అసొసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లా డుతూ 1976 నుంచి అమల్లో ఉన్న ఇన్‌సర్వీస్ బీఎస్సీ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఏఈఓల ప్రమోషన్ అవకాశం శాశ్వతంగా దెబ్బతింటుందన్నా రు. 2005 నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కనపెట్టి 2017లో చేరిన గ్రాడ్యుయేట్లకు ప్రమోషన్ ఇచ్చేలా 39 జీఓను రూపొందించార ని మండిపడ్డారు. ఈ జీఓతో రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కూలక ముందే మేలుకో!
●జిల్లాలో ప్రమాదకరంగా శిథిల భవనాలు ●ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన ●4 మున్సిపాలిటీల్లో 274 మందికి నోటీసులు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారాయి. వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వాటిని గుర్తించిన అధికారులు వెంటనే వాటిని తొలగించాలని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 274 మందికి నోటీసులు జూరీ చేశారు. అయినా ఇప్పటివరకు స్పందన కరువైంది. – మెదక్‌జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలుండగా, వీటి పరిధిలో 274 శిథిల భవనాలను అధికారులు గుర్తించి యజమానులకు నోటీస్‌లు జారీ చేశారు. అందులో చాలా వరకు అద్దె భవనాలుండగా, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఇవి దశాబ్దాల క్రితం నిర్మించినవి కావటంతో పూర్తిగా శిథిలావస్థకు చేసి ప్రమాదకరంగా మారాయి. వాటిని కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో అత్యధికంగా రామాయంపేట బల్దియాలో 121 మందికి నోటీసులు జారీ చేయగా, రెండో స్థానంలో మెదక్ 107, నర్సాపూర్‌లో 30, తూప్రాన్‌లో 16 మంది చొప్పున మొత్తం 274 మందికి అందజేశారు. మెదక్ పట్టణంలో 8 ప్రభుత్వ కార్యాలయాలుండగా, సుమారు 62 మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలతో పాటు మిగితా 37 ప్రైవేట్ ఇళ్లు ఉన్నాయి. మిగితా 3 మున్సిపాలిటీల్లో అత్యధికంగా ప్రైవేట్ భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలా వరకు పెచ్చులూడి పడుతున్నవే అధికంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేసి నెట్టుకొస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన వ్యాపారులు మెదక్ మున్సిపాలిటీకి చెందినవి 60కి పైగా కాంప్లెక్స్ (భవనాలను)లను వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. అవి శిథిలావస్థకు చేరాయని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని, వాటిని తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని మున్సిపల్ అధికా రులు నాలుగేళ్ల కిత్రం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. షాపులను ఖాళీ చేశాక నిర్మాణాలు చేపట్టకుంటే తాము రోడ్ల మీదకు వస్తామని, నూతన కాంప్లెక్స్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాకనే ఖాళీ చేస్తామంటూ వారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇది వరకు పట్టణంలోని మార్కెట్లో ఇదే విధంగా కొంత మంది చేత షాపులు ఖాళీ చేయించి భవనాలను తొలగించారు. అయితే మూడేళ్లు గడిచినా, వాటి స్థానంలో నూతన షాపులు నిర్మించటం లేదని అద్దె నిర్వాహకులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవ నాల్లో జరగరాని ప్రమాదం ఏదైనా ఎవరు బాధ్యులనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.నోటీసులిచ్చినా స్పందన కరువుభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను వెంటనే ఖాళీ చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ స్పందించటం లేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు భవనాలు తడిసి కుప్పకూలి పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని సూచిస్తున్నారు. -
జిల్లా కీర్తిని నలుదిక్కులా చాటుతాం
● లోగో బ్రాండింగ్ ఏర్పాటు చేయిస్తాం ● టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ మెదక్ కలెక్టరేట్: జిల్లా హెరిటేజ్ టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా లోగో బ్రాండింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మొదటి విడత టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్‌లో భాగంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఏడుపాయల ఆవరణలో రూ.7 కోట్లతో 12 కాటేజీలు నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం టూరిజం శాఖ ద్వారా స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణ బాధ్యతలను టూరిజం, జిల్లా పంచాయతీ శాఖకు అప్పగించేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. మెదక్ ఖిల్లా వీక్షణకు యాత్రికులకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5 టికెట్ ధర నిర్ణయించామన్నారు. స్వదేశీ దర్శన్‌లో భాగంగా మెదక్ ఖిల్లా, పోచారం ఈ రెండు కూడా ఇటీవల కేంద్ర బృందం సందర్శించిందన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అలాగే సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు మెదక్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి, టూరిజం అధికారి రమేశ్, డీఆర్డీఓ శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
పెద్దశంకరంపేట(మెదక్): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతాయని డీపీఓ యాదయ్య అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పంచాయతీలో నెలకొన్న సమస్యలపై విచారణ చేపట్టి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబ, సర్పంచ్ జంగం రేణుక, ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, ఏపీఓ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో రెగ్యులర్ బస్సులతో పాటు మరో 204 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్ తెలిపారు. మంగళవారం రాత్రి మెదక్ ఆర్టీసీ డిపోను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిపో కార్యాలయంతో పాటు గ్యారేజ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 31 వరకు 6 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జ్ ఉంటుందని, మహిళలకు మాత్రం ఉచితమేనని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపోకు కొత్త మేనేజర్‌ను త్వరలో నియమిస్తామని చెప్పారు. నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నార్లాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం, యువత సంయుక్తంగా బెల్టు షాపుల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకాలపై నిషేధానికి నడుం బిగించారు. ఈమేరకు మంగళవారం గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. గ్రామంలో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం కారణంగా యువత చెడు మార్గంలో పయనిస్తూ, వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బెల్టు షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. కా ర్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రం, ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు జగన్, వార్డు సభ్యులు మధు, రవి, నరేష్, శ్రీనుతో పాటు యువకులు ప్రవీణ్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపిక నిర్వహించారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 6వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
దారికొస్తున్నాయ్!
● నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ● తీరనున్న పదేళ్ల ప్రజల కష్టాలు అల్లాదుర్గం(మెదక్): అడుగడుగునా గుంతలు, దెబ్బతిన్న రోడ్లతో పదేళ్లుగా నరకం చూసిన ప్రజలు, వాహనాదారుల ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో నిధులు మంజూరయ్యాయి. దీంతో వడివడిగా పనులు సాగుతున్నాయి. మండలంలోని గడిపెద్దాపూర్ రోడ్డు, అల్లాదుర్గం నుంచి వెంకట్రావుపేట మీదుగా జగిర్యాల చౌరస్తా వరకు, అల్లాదుర్గం ఐబీ చౌరస్తా నుంచి వట్పల్లి మీదుగా రాయికోడ్, జహీరాబద్ వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనాదారులు నిత్యం నరకం చూశారు. ఎన్నోసార్లు అందోళనలు చేసినా, వారి బాధలు మాత్రం తీర లేదు. ఈక్రమంలోనే రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నుంచి గడిపెద్దాపూర్‌కు వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 95 లక్షలు మంజూరు చేసింది. అల్లాదుర్గం పోచమ్మగుడి నుంచి వెంకట్రావుపేట మీదుగా జగిర్యాల చౌరస్తా వరకు రూ.7.20 కోట్లు, అల్లాదుర్గం ఐబీ చౌరాస్తా నుంచి వట్పల్లి, రాయికోడ్ మీదుగా గంగ్వార్ వరకు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.211 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభం గడి పెద్దాపూర్ నుంచి 161 రహదారి వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 95 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యయి. గ్రామంలో మెటల్, సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. నాలుగు రోజుల్లో సీసీ రోడ్డు పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్ చెప్పారు. వర్షాలు కురుస్తుండటంతో బీటీ వేయడానికి ఇబ్బందిగా మారుతుందన్నారు. -
క్రాప్ సర్వేకు గ్రామానికో వలంటీర్
మాట్లాడుతున్న దేవ్కుమార్రామాయంపేట(మెదక్): డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రైవేట్ వలంటీర్‌ను నియమిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో రైతులకు యూరియా యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము నియమించే వలంటీర్లు గ్రామాల్లో క్రాప్ సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతు అక్కడే ఉండి పంట వివరాలు నమోదు చేయించాలని సూచించారు. క్రాప్ సర్వే ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్నరకం వడ్లను కొనుగోలు చేసే క్రమంలో రైతులు డీలర్ వద్ద ఆన్లైన్లో నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని, రైతులకు అవసరమైనంత మేరకు యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. యూరియా యాప్ వినియోగం, రైతుల సందేహాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేశారు. ఏఓ ప్రవీణ్‌కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ -
డబుల్.. ట్రబుల్
● అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం హత్నూర(సంగారెడ్డి): నిరుపేదలకు గూడు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏళ్ల తరబడి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న ఆలోచన అధికారులకు సైతం రావడం లేదు. దీంతో రూ. లక్షలు వెచ్చించి అసంపూర్తిగా వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మండల కేంద్రంలోని హత్నూరలో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా హత్నూరలో ఇల్లు లేని నిరుపేదలు 32 మందిని గుర్తించి వారి కోసం కొన్యాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే అవి ఏళ్లుగా పూర్తికాకుండా అసంపూర్తిగా నిలిచిపోయా యి. నిర్మించిన వాటికే డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఈక్రమంలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లూ గడిచిపోయింది. కొత్తగా శ్రీకారం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పలువురికి ఇండ్లు సైతం మంజూరు చేయగా, నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికై నా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి అందజేయాలని పేదలు కోరుతున్నారు. ఇదే విషయమై ఏఈ రమ్యను వివరణ కోరగా.. హత్నూరలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. భవనాలను పూర్తి చేసి రెండో విడతలో స్థలం లేని నిరుపేదలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
కదంతొక్కిన జీపీ కార్మికులు
మెదక్ కలెక్టరేట్: సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కార్మికులు ఏళ్ల తరబడి పని చేసినా పనికి భద్రత, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచ్‌లపైన చర్యలు చేపట్టాలని, ఆన్లైన్లో నమోదు కాని వారి పేర్లను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ జిల్లా ఆఫీస్ బేరర్స్ వసంత, రఘుపతి, సత్యం, మల్లేష్, వెంకయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: పర్యావరణ పరిరక్షణలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బన్‌పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెశ్‌యాదవ్, డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, కలీమోద్దీన్, రాజమణిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
మెదక్‌జోన్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారని, అర్హులకు పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం మెదక్‌లో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని తనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఢిల్లీ పెద్దలు చర్చించారని తెలిపారు. ప్రాదేశిక సహకార సంఘాల్లో (పీఏసీఎస్‌లు) నామినేటెడ్ కాబోతున్న పదవులు ముఖ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన జోస్యం చెప్పా రు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఆరు గ్యారంటీల అమలు సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఓటరు సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో ఎంతో మంది ఓట్లను కేంద్రం తొలగిస్తుందని, అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కార్యకర్తలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. వర్గ రాజకీయాలతో పార్టీకి నష్టం: మంత్రి అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యకర్తలతోనే పార్టీ మనుగడ సాగుతుందని, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే బలోపేతం అవుతుందన్నారు. వర్గ రాజకీయాలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిని పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడి నామినేటెడ్ పదవుల గురించి చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రావు, సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కానుగ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం ‘సర్’లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోవద్దు ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ డీసీసీ అధ్యక్షుల డుమ్మా! పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి దూరంగా ఉన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారిద్దరు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరైనప్పటికీ ఆయన వేదిక పైన ఎక్కడో మూలన కూ ర్చుండి పోయారు. సమావేశం ముగియకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలపై ద్వితీయ శ్రేణి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. -
పీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతం
రామాయంపేట(మెదక్): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం మెదక్ వెలుతూ రామాయంపేటలో కొద్దిసేపు ఆగారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు పీసీసీ చీఫ్, మైనంపల్లిని సన్మానించారు. కాగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహిస్తున్నామని డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై ప్రజల నుంచి 55 అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ సమస్యలను పూర్తిగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. రామాయంపేట(మెదక్): చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో మంజీరా విద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సబ్ జూనియర్ విభాగంలో అవ్యక్త, బాలుర విభాగంలో లోకేశ్ ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థి శివప్రసాద్ సిల్వర్ మెడల్ సాధించగా, హంసిని, చేతన, దీప్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వాసవి, ఉపాధ్యాయులు అభింనందించారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట శివారు పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న రసాయనాలతో కలుషితమైన కుంటను పీసీసీ అధికారులు సోమవారం పరిశీలించారు. సర్పంచ్ సంతోష ఫిర్యాదు మేరకు పీసీబీ ఎన్విరాల్మెట్ అసిస్టెంట్ ఏఈ రవీందర్ రాజారామ్ కుంటను పరిశీలించి శాంపిల్స్ తీసుకెళ్లారు. అనంతరం పరిశ్రమలోనూ తనిఖీలు నిర్వహించారు. రసాయన జలాలను సేకరించారు. ఈసందర్భంగా అధికారి మాట్లాడుతూ.. జలాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్, పరిశ్రమ సిబ్బంది ఉన్నారు. ఎంపీ రఘునందన్‌రావు పటాన్చెరు: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఎంపీ రఘునందన్‌రావు హెచ్ఎండీఏ కమిషనర్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ను సోమవారం కలిసి చర్చించారు. అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించే అంశంపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా పటాన్ చెరు ఎగ్జిట్– 3 నుంచి ఎగ్జిట్–4, సుల్తాన్పూర్ మధ్య పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లూరు ఎగ్జిట్–2 వద్ద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. -
పకడ్బందీగా గ్రామ సభలు
మెదక్ కలెక్టరేట్: అర్హత గల ప్రతీ ఓటు హక్కును పరిరక్షించే విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి సర్ కార్యక్రమంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈనెల 27న నిర్వహించనున్న గ్రామ సభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ వన మహోత్సవంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
దమ్ మారో.. దమ్!
జిల్లాలో విచ్చలవిడిగా స్మోకింగ్ జోన్లు వెలుస్తున్నాయి. గ్రామాలు, పట్టణ శివారులో టీ స్టాళ్లు, కేఫ్‌లు ఏర్పాటు చేసి పక్కనే కొంత స్థలంలో చుట్టూ ప్రత్యేక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు సిగరేట్లు విక్రయిస్తున్నారు. ప్రధానంగా యువత టార్గెట్‌గా కొనసాగుతున్న ఈ సెంటర్లతో ఎంతో మంది పిల్లలు మత్తుకు బానిసలవుతూ పెడదోవపడుతున్నారు. – రామాయంపేట(మెదక్) 18 ఏళ్లలోపు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం తీవ్రమైన నేరం. అయితే ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. హోటళ్లు, టీ స్టాళ్లలో యథేచ్ఛగా సిగరేట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తులను బహిరంగంగానే అమ్ముతున్నారు. కళాశాలలు, స్కూళ్లకు వంద మీటర్ల లోపు ఈ ఉత్పత్తులు విక్రయించడం నేరం, అయినా ఎవరూ పాటించటం లేదు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు, మున్సిపల్, పంచాయతీ అధికారులు ఆ దిశగా చర్యలూ తీసుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల ప్రహరీని ఆనుకొని ఉన్న దుకాణాల్లో యథేచ్ఛగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరల మాటున పొగ గుప్పుమంటోంది. ఇక్కడ గంటల తరబడి కాలక్షేపం చేస్తున్న యువత పొగ పీలుస్తున్నారు. తొలుత స్నేహితుల ప్రోత్సాహంతో ప్రారంభమవుతున్న ఈ అలవాటు, కాలక్రమేణా వ్యసనంగా మారుతోంది. చివరకు గంజాయికు అలవాటు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లలో యథేచ్ఛగా నిర్వహ ణ మత్తులో జోగుతున్న యువతరం -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
ఎస్పీ శ్రీనివాస్రావుహవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు సిబ్బ ందని ఆదేశించారు. సోమవారం మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివ రాలు, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యా దును బాధ్యతగా స్వీకరించి చట్టపరంగా విచారణ చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, పేకాట, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు మహేశ్, రాజశేఖర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎస్ఐ సుమన్ ఉన్నారు. -
యూరియా యాప్ తొలగించాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి నిజాంపేట(మెదక్): యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. యూరియా యాప్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ ఫోన్లలోనే బుకి ంగ్ నిబంధనలు పెట్టడం రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా సరిపడా యూరియా అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేలా కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే యూరియా యాప్ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఇక స్మార్ట్ మీటర్లు
నారాయణఖేడ్: విద్యుత్ శాఖలో చాలా ఏళ్లుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారగా, తాజాగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనంతరం మొబైల్ ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రీచార్జ్ చేయని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం షాపూర్‌నగర్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఆరేళ్ల క్రితం అమలు చేశారు. విడతల వారీగా ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ అంశం ఏళ్లుగా పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుండగానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్తుత్ శాఖ సన్నద్ధమవుతుంది. ఇదే అమలైతే స్మార్ట్ మీటర్ల వల్ల గ్రామీణ, పట్టణ ప్రజానీకం కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశం తెరపైకి రాగానే ప్రజానీకం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. జిల్లాలో గృహ వినియోగదారులు, వ్యాపారులు, ఇండస్ట్రీయల్ విభాగాలకు సంబంధించి 7,29,228 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌కు సంబంధించి గృహజ్యోతి పథకం లబ్ధిదారుల కనెక్షన్లు 2,26,693 ఉన్నాయి. భారంగా మీటర్! స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. విద్యుత్ శాఖ ఈ భారం భరిస్తుందా..? లేక వినియోగదారులపై మోపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సింగిల్ ఫేజ్ మీటర్ వ్యయం వినియోగదారుకు రూ.1,300 వరకు ఉండగా, స్మార్ట్ మీటర్ రూ.7వేల వరకు అయ్యే అవకాశం ఉంది. త్రీఫేజ్ మీటర్‌కు రూ.10 వేల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినియోగదారులపై భారం మోపిన పక్షంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది. స్మార్ట్ మీటర్ల ఖర్చును వినియోగదారుడు భరించాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చు ఎంత అని నిర్ధారించే దానిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మీటర్ ఖరీదు నిర్ణయించిన అనంతరం బిగించనున్నారు. మొదట ఎస్పీడీజీఎల్ పరిధిలో కొత్త కనెక్షన్ పొందే వినియోగదారులకు అమలు చేయనున్నారు. కొత్త వినియోగదారులకు మొదట ఏర్పాటు దశల వారీగా అందరికీ.. అమలైతే మొబైల్ ప్రీపెయిడ్ తరహాలో రీచార్జీ స్మార్ట్ మీటర్లను రెండేళ్ల క్రితం విద్యుత్‌శాఖ మొదట ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలని యోచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా ఏర్పాటు పూర్తి చేసిన అనంతరం వినియోగదారుల ఇళ్లకు బిగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం నూతనంగా విద్యుత్ కనెక్షన్ పొందనున్న వినియోగదారులకు మాత్రమే అమర్చాలని భావిస్తున్నారు. తర్వాత దశల వారీగా కార్యాచరణ రూపొందించి ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్ పరిధిలో స్మార్ట్ మీటర్లను అముల చేయాలని చూస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఐరన్ పరిశ్రమ వద్దే వద్దు
తూప్రాన్: ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఐరన్ పరిశ్రమను తొలగించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్, కాలుష్య నియంత్రణ మండలికి గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమను చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమను తొలగించే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు. -
పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించండి
మెదక్ కలెక్టరేట్: శక్తి పాలసీని రద్దు చేసి ఎస్బీటెట్ను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా మహిళా కన్వీనర్ సమ్రిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థినులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కారు, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేట్ సంస్థలో విలీనం చేస్తే ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక విద్య ప్రైవేటు పరమయ్యే అవకాశం ఉందని వాపోయారు. అనంతరం డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ బాధ్యులు గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మండలానికి ఇద్దరు..!
పాపన్నపేట(మెదక్): సర్కార్ బడులపై పర్యవేక్షణ పెంచి, బాధ్యతల భారాన్ని తగ్గించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది. ఈమేరకు పలువురు ఉన్నతాధికారులతో కూ డిన కమిటీని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓగా రెండో పోస్టు మంజూరు, ఆర్థిక పరమైన ప్రభావం, ఇద్దరు నిర్వర్తించాల్సిన విధులు తదితర అంఽశాలను పరిశీలించి, 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే, జిల్లాకు మరో 21 మంది ఎంఈఓలు కొత్తగా రానున్నారు. అంతా ఇన్‌చార్జిలే.. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 903 సర్కారు బడులు ఉండగా, 73,476 విద్యార్థులు చదువుతున్నారు. అయితే అన్ని మండలాల్లోనూ ఎంఈఓలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మండలంలోని సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వీరు రెండు పడవల మీద ప్రయాణం చేస్తుండటంతో, ఏ బాధ్యత కూడా పూర్తిగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో మండలంలో 40 నుంచి 55 పాఠశాలల వరకు ఉన్నాయి. నెలలో కనీసం రోజుకో పాఠశాలను కూడా తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ఇద్దరు ఎంఈఓల నియామకంతో ఒకరికి బోధన, సిలబస్ బాధ్యతలు, మరొకరికి బోధనేతర కార్యక్రమాలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పరస్పర సహకారం కోసం సమీపంలోని సుమారు 10 నుంచి 15 పాఠశాలలను కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2011లో జిల్లాలో 61 కాంప్లెక్స్‌లు ఏర్పాటయ్యాయి. సంబంధిత పాఠశాలల్లో ఉన్న టీచర్లు, బోధనోపకరణాలు, పుస్తకాలు, ఆట వస్తువులు, ల్యాబ్‌లు, మైదానాలను పరస్పర ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నది దీని లక్ష్యం. దీంతో ఎంఈఓల బాధ్యతలు కూడా కొన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదలాయించబడ్డాయి. నెలకో సారి ఉపాధ్యాయులలో వృత్తిపరమైన నూతన విధానాలు, ఆలోచనలు పంచుకునేందుకు, బోధనను మెరుగుపరుచుకునేందుకు కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. విధి విధానాల రూపకల్పనకు కమిటీ జిల్లాలో 21 మండలాలు, 61 స్కూల్ కాంప్లెక్స్‌లు 903 పాఠశాలలు, 73,476 మంది విద్యార్థులు -
ఉత్సాహంగా యోగా పోటీలు
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. సర్పంచ్ స్రవంతి పోటీలను ప్రారంభించగా, అండర్ 14 నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు పాల్గొన్నారు. ఆయా మండలాల నుంచి 200 మంది పోటీల్లో పాల్గొనగా, ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫీ, రాష్ట్ర అబజర్వర్ సతీష్, జడ్జీలుగా సత్యం, శ్రీదేవి, మాలతి, మల్లీశ్వరీ, శ్రీలత, నర్సింలు, మనీష, రేఖ, అంజయ్య, దీపక్, ప్రసన్న త దితరులు పాల్గొన్నారు. -
పేటలో భారీ వర్షం
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చిత్తడిగా మారాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నర్సాపూర్: రైతులు అవసరం మేర యూరియా కొనాలని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొంతమంది రైతులు ప్రస్తుత అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలిక ఇబ్బందులు వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి అమలు చేసిన ఎరువుల బుకింగ్ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటితో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తాము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాజాగా డివిజన్ స్థాయిలో ఎరువులు కొనుగోలు చేసే విధంగా యాప్‌లో మార్పులు చేశారని, ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని దామరాంచలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, డీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు మల్లేశం, విఠల్‌గౌడ్ పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన హవేళిఘణాపూర్ మండలం గంగాపూర్ తండాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గంగాపూర్ తండాకు చెందిన ముడావత్ గోపాల్(28) ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే కరెంటు షాక్ తగిలి మృతి చెంది ఉన్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టాటర్ డబ్బాలోకి కరెంటు సరఫరా కాకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రజిత, కుమారుడు ఉన్నాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళిఘణాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోస్టర్ విధానం రద్దు చేయాల్సిందే దుబ్బాక: రోస్టర్ విధానం వల్ల మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లను పునఃరుద్ధరించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాకలో హాలో మాల.. చలో దుబ్బాక కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 31న నిర్వహించతలపెట్టిన రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి కాల్వ నరేష్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ర్యాకం శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సర్ నోటీసులు
1.18 లక్షల ఓటర్లకుఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి మలిదశ ప్రక్రియ షురూ అయింది. మ్యాపింగ్ కానీ వారితో పాటు అనామలిస్ జాబితాలో చేరిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రారంభించారు. నోటీసులు అందుకున్న వారు ఆధారాలు చూపడంతో పాటు ఈనెల 27 నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే నెల 20న ఈ ప్రక్రియ ముగియనుంది. అక్టోబర్ 19న ఓటర్ తుది జాబితా విడుదల కానుంది. – మెదక్‌జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘సర్’కు ముందు ఈ రెండు నియోజకవర్గాల్లో 4,53,140 మంది ఓటర్లు ఉండగా.. ప్రక్రియ అనంతరం ఆ సంఖ్య 4,10,204కు తగ్గింది. అనగా 42,936 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్ఓలకు ఇవ్వలేదు. ఇందులో డబుల్ ఓటర్లతో పాటు చనిపోయిన వారు, శాశ్వతంగా అడ్రస్ మారిన వారు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన ఓటర్లలో 1,18,661 మంది ఓటర్ల పేర్లు సరిగా లేకపోవడంతో పాటు ఇంటి పేరు, తండ్రి, లేక భర్త పేర్లు తప్పుగా ఉండటం, వయసులో తేడా.. తదితర సమస్యలు ఉన్న ఓటర్లను (అనామలిస్) జాబితాలో చేర్చారు. అలాగే పాతికేళ్ల క్రితం వేసిన ఓటు, ప్రస్తుత ఓటు (మ్యాపింగ్)కు సంబంధించి తగిన ఆధారాలు చూపని వారు, 2002లో ఎక్కడ ఓటు ఉంది.. తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా ఎన్యూమరేషన్ ఫారాన్ని నామమాత్రంగా నింపి బీఎల్ఓలకు అప్పగించిన వారిని (మ్యాపింగ్) విభాగంలో చేర్చారు. ఈ రెండింటికి సంబంధించి రెండు నియోజకవర్గాల్లో 1,18,661 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. వీరు ప్రభుత్వం జారీ చేపినా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సంబంధిత అధికారులకు చూయించి సరి చేసుకోవాలి. అలాగే ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా 2002లో ఓటు హక్కు ఉందా..? అప్పుడు ఓటు వేసినట్లు అయితే తల్లిదండ్రి ఓటరు సీరియల్ నంబర్‌ను వివరించాల్సి ఉంటుంది. నూతనంగా ఓటు వచ్చినా తన తల్లిదండ్రులు, లేదా భర్తకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా చూపించాలి. అన్ని సక్రమంగా ఉంటే డిక్లరేషన్ ఫాంను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియ ఈ నెల 27 నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనామలిస్, మ్యాపింగ్ కాని వారికి అందజేత 27 నుంచి ఆధారాలు సమర్పించాలి సెప్టెంబర్ 20న ముగియనున్న ప్రక్రియ అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా నర్సాపూర్‌లో అధికం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అనామలిస్, మ్యాపింగ్‌లో 1,18,661 ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. ఇందులో నర్సాపూర్‌లో 61,124 మంది ఓటర్లు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో 57,537 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. -
ట్రిపుల్ఆర్ పక్కనే కూ.. చుక్‌చుక్
హైదరాబాద్ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ త్వరలో ప్రారంభించనున్న ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు 3.5నుంచి 11కిలోమీటర్ల దూరంలో రింగు రైల్ మార్గం నిర్మాణం చేపట్టాలని ముందుగా అనుకున్నారు. కానీ తాజాగా డీపీఆర్‌లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్కు కొద్ది దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు కలిసి రానుంది. – గజ్వేల్ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైన వేళ.. మరో భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రైలు వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్మెంట్ ఖరారైంది. ముందుగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చాలా చోట్ల 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. కానీ నేడు అలైన్మెంట్లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్ పక్కనే అంటే.. కొద్ది దూరంలోనే ఔటర్ రింగు రైలు నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీపీఆర్ (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపొర్ట్)కు కేంద్రం ఆమోదం పలికినట్లు వార్తలొస్తున్నాయి. అలైన్మెంట్ మారటం వల్ల గతంలో మాదిరిగా కాకుండా ట్రిపుల్ఆర్కు దగ్గరగా, సమాంతరంగా ఔటర్ రింగు రైలు వెళ్లనుండటం అన్ని రకాలుగా కలిసి రానుంది. ఈ రెండు ప్రధాన భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు పక్కనే పక్కనే ఉండటం ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుంది. రవాణా ఆధారిత వాణిజ్యానికి ఊతం ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రధానంగా రవాణా ఆధారిత వాణిజ్యం అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల ట్రిపుల్‌ఆర్‌తోపాటు ఔటర్ రింగు రైలుతో ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార రంగాలు భారీగా విస్తరించనున్నాయి. కాగా అవుటర్ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్ఓఆర్(రైల్ ఓవర్ రైల్) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్ఓఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని గజ్వేల్‌లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జగదేవ్‌పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా ఈ రింగు రైలు 120 కిలోమీటర్లపైనే విస్తరించే అవకాశాలున్నాయి. గతంలో చేసిన అలైన్మెంట్లో మార్పులు డీపీఆర్‌కు కేంద్రం ఆమోద ముద్ర! ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం రవాణా ఆధారిత వాణిజ్యం విస్తరణకు అవకాశం ట్రిపుల్ఆర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతుండటం, ఔటర్ రింగు రైలు ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో వేగంగా రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బడా పెట్టుబడుదారులు ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
రామాయంపేట(మెదక్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయమై ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్, అకాడమిక్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ వెంకటస్వామి ఆరోపించారు. ఆదివారం సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా లు సరిగా లేవన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఓపీ సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి సిద్దిరాంలు, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్‌కుమార్, మన్నె గోపాల్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజీయే రాజమార్గం
మెదక్‌జోన్: వచ్చేనెల 12న మెదక్ కోర్టులో నిర్వహించబోయే లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కక్షిదారులను రాజీ పడే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పోలీస్, రెవెన్యూ, ఎకై ్సజ్, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో ఆయాశాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో కక్షిదారులతో చర్చించి రాజీపడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా అండ్ సెషన్ జడ్జి ఆర్ఎం సుభవల్లి, జూనియర్ సివిల్ జడ్జి సాయిప్రభాకర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, డీఎస్పీ నరేందర్‌గౌడ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మెదక్, కౌడిపల్లి గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో ఆయా, కుక్ పోస్టుల భర్తీ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈనెల 21 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌడిపల్లి మినీ గురుకులంలో ఆయా (1), మెదక్ మినీ గురుకులంలో ఆయా (1), కుక్ (1) పోస్టుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మెదక్, కౌడిపల్లి మండలాలకు చెందిన ఎస్టీ మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్ధులను పూర్తి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రస్తుతం 3,340 మె ట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 19,045 మెట్రిక్ టన్ను లు రైతులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సొంత మండలాల్లోనే కాకుండా ఇతర మండలాల్లోనూ ఎరువులు కొనుగోలు చేయవచ్చు నని, అలాగని అవసరానికి మించి కొనుగోలు చేయవద్దన్నారు. పరిమితికి మించి రైతులు యూరియా బుక్ చేయడంతోనే యాప్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. జిల్లాలో ఎరువుల యాప్ సమ స్యలపై వ్యవసాయ శాఖ కమిషనర్‌తో మాట్లాడినట్లు చెప్పా రు. వారు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుచరిత అల్లాదుర్గం(మెదక్): బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల బాలికలు చదువు కోవడం వారి హక్కు అని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుచరిత అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్వెరలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టులలో జడ్జిమెంట్లను స్థానిక భాషల్లో మార్చాల్సి ఉందన్నారు. బాలికలు గుడ్, బ్యాడ్ టచ్ గురించి ధైర్యంగా చెప్పాలన్నారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ హింస, మహిళలపై దాడులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేద ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ శశిధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి లింగప్ప, న్యాయవాది సంగన్న తదితరులు పాల్గొన్నారు. సింగిడిలో ‘సాయిసిరి’కి చోటు మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సినీ కవుల పుస్తకంలో జిల్లాకు చెందిన సాయిసిరికి చోటు దక్కింది. సినీకవులు జీవిత విశేషాలు, పాట ల పదప్రయోగ విశ్లేషణను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సింగిడి అనే 390 పేజీల పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించింది. ఈ పుస్తకంలో తెలంగాణ మొట్టమొదటి సినీ కవి చందాల కేశవదాసు నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, గోరటి వెంకన్న, నందిని సిదారెడ్డి లాంటి మహామహుల సరసన జిల్లా ప్రధానోపాధ్యాయుడు, సినీగీత రచయిత సాయిసిరికి చోటు లభించడం పట్ల సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, తెలంగాణ సాహిత్య అకాడమీకి సాయిసిరి కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శనివారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమ విధానంలో విశ్వక్సేనుల సాక్షిగా ఆలయ కార్యనిర్వహణాధికారి బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, యజ్ఞాచార్యులు, రుత్విక, భక్తజన పరివారం మేళతాళాలతో ఈరబాయమ్మ తోట నుంచి పుట్టమన్ను తెచ్చారు. ఆలయ ముఖ మండపంలో వేదికపై విశేషాలంకృతులై స్వామివారు లక్ష్మీసమేతులై కొలువుదీరగా, అర్చకులు రక్షా బంధనం, అంకురార్పణ, నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకను తిలకించి భక్తజనులు తరించారు. -
పరిశీలించి.. సూచనలు చేసి
పేటలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ స్వప్నారెడ్డిరామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా శిథిలమైన ప్రధాన రహదారిని శనివారం రాష్ట్ర మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ స్వప్నారెడ్డి పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కమిషనర్ రవీందర్‌తో కలిసి పట్టణంలో కాలినడకన పర్యటించారు. రోడ్డు విస్తరణ కోసం తొలగించనున్న కట్టడాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రహదారి విస్తరణ కోసం ఎమ్మెల్యే రోహిత్ నిధులు మంజూరు చేయించారని, అనుమతులు వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చైర్పర్సన్ వివరించారు. అనంతరం మెదక్– సిద్దిపేట రూట్లో చౌరాస్తా విస్తరణ పనులను పరిశీలించారు. ఆమె వెంట కౌన్సిలర్లు నాగరాజు, శ్యామల, రంజిత్, రవి, బైరం స్వప్న, మద్దెల మాధవి, శంకర్‌గౌడ్, పుట్టి సందీప్ ఇతర అధికారులు ఉన్నారు. -
వాహనదారులు సహకరించాలి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని మెదక్ రోడ్డు రైల్వే గేటు వద్ద ఆర్వోబీ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని, వాహదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. శనివారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులు, వాహనదారులు, ప్రజలకు ఆర్వోబీ నిర్మాణ పనులపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటి చిన్న వాహనాలు వడియారం శివారులోని అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లాలని సూచించారు. మెదక్ వెళ్లే పెద్ద వాహనాలు నార్సింగి మీదుగా, తూప్రాన్ నర్సాపూర్ మీదుగా వెళ్లడానికి సూచికల బోర్డులను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. చిన్న వాహనాలకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఏడాదిన్నర కాలంగా నిర్మాణ పనులు జరగనున్నందున సమస్యలు ఉంటే పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సైదానాయక్, ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజ్యలక్ష్మి, సాయికుమార్‌గౌడ్ నాయకులు, వాహనదారులు పాల్గొన్నారు. -
బియ్యం ధరలకు రెక్కలు
పెరిగిన చక్కెర రేటు ● గగ్గోలు పెడుతున్న సామాన్యులుజహీరాబాద్ టౌన్: సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ. 65 నుంచి రూ. 75 వరకు పలుకుతోంది. రకాలను బట్టి క్వింటాల్‌కు రూ. 5.500 వరకు పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు అయితే 26 కేజీల బస్తా రూ.1800 లోపు లభించడం లేదు. డిమాండ్ హెచ్చుతగ్గుల కారణంగా మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. సోనామసూరి, హెచ్ఎంటీ.కొలన్ తదితర సన్న బియ్యం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కొనలేని, రేషన్ బియ్యం తినలేని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. అలాగే చక్కెర ధరలు సైతం పెరిగాయి. మార్కెట్లో కిలో చక్కెర రూ. 65 దాటింది. నిత్యావసర సరుకులకు భారీగా ఖర్చువుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అతివ.. ఉపాధి తోవ
రామాయంపేట(మెదక్): నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటింటా ఇందిరమ్మ పథకం పేరుతో ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించాలని నిర్ణయించింది. మహిళలకు టైలరింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. నియోజకవర్గానికి వెయ్యి బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ దరఖాస్తు ఇలా.. జిల్లాలో అర్హులైన బీసీ మహిళలు http//: tgobmms@cgg.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన నిరుద్యోగ మహిళలకే అందించే విధంగా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023– 24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే ప్రభుత్వ నిబంధనలు మేరకు కనీస విద్యార్హత ఐదవ తరగతిగా నిర్ణయించారు. నిబంధనల మేరకే పంపిణీఅర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ వరకు కుట్టు మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఉపేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి -
మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా
తీర్మానించిన కల్వకుంట గ్రామస్తులురామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజాంపేట మండలం కే.వెంకటాపూర్ తండాకు చెందిన భాస్కర్ శనివారం మృతి చెందడంతో తండాకు చెందిన వందలాది మంది కల్వకుంటలో రోడ్డుపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రెండు గ్రామాలకు చెందిన ప్రజలు సమావేశమై చర్చించారు. మద్యం అమ్మకాలతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుంటలో పూర్తిస్థాయిలో మద్యం అమ్మకాలను బంద్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, వెంకటాపూర్‌లో మద్యం అమ్మకాలు గతంలోనే బంద్ కాగా, కల్వకుంటలో 20కి పైగా బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి గ్రామంలో పూర్తిస్థాయిలో మద్యం అమ్మకాలు బంద్ చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అందె కొండల్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే రూ. లక్ష జరిమానాతో పాటు కేసులు నమోదు చేయిస్తామన్నారు. -
● పాత దుస్తులతోనే తరగతులకు హాజరు ● జిల్లాలో 68 వేల పైచిలుకు విద్యార్థులు
మెదక్‌లోని ఓ పాఠశాలలో సివిల్ డ్రెస్‌లో బడికి వచ్చిన విద్యార్థులుప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాంల పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు అందజేయలేదు. బడులు తెరుచుకునే రోజునే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఫలితంగా పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు హాజరుకావాల్సి వస్తోంది. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 882 ఉండగా, వాటిలో 68,323 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా పేద, మధ్య తరగతికి కుటుంబాలకు చెందిన వారే. కాగా, వీరికి 2 జతల యూనిఫాం పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించాల్సి ఉండగా, నేటికీ అందజేయకపోవడం గమనార్హం. స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతల ను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు అప్పగించారు. పాఠశాలల ప్రారంభం రోజున ప్రతి విద్యార్థికి అందించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. పంద్రాగస్టుకు తప్పనిసరిగా అందించాలని మరోమారు ప్రకటించినా సాధ్యం కాలేదు. కాగా జిల్లాలో 68,323 మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రెండు జతల చొ ప్పున 1,36,646 యూనిఫాంలు అందించాల్సి ఉంది. ఇందుకోసం 4,10,616 మీటర్ల క్లాత్ సరఫరా చేయాల్సి ఉండగా, విడతల వారీగా జి ల్లాకు అందించారని, చివరగా ఈనెల 18 వరకు పూర్తిస్థాయిలో వస్త్రం చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే కొలతలు బడులు తెరుచుకునే రోజునే ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫాంలు అందిస్తామని పిల్లపుట్టక ముందే కుళ్లకుట్టిన చందంగా అధికారులు, పాలకులు హడావుడి చేసి మహిళా సంఘాల సభ్యులతో ఫిబ్రవరిలోనే కొలతలు తీయించారు. అయితే బడులు తెరిచే సమయానికి కాదు కదా, కనీసం క్లాత్‌కూడా సరఫరా చేయలేక పోయారు. సర్కార్ బడుల్లో చదువుకునే వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉంటారు. కాగా పేద, ధనిక తారతమ్యం లేకుండా విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలో ఉండటంతో నేటికీ యూనిఫాంలు అందించలేక పోయారు. మరో నెలరోజుల గడువు పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులే చెబుతున్నారు. గురుకుల విద్యార్థులకు మాత్రం.. జిల్లావ్యాప్తంగా కేజీబీవీలు, సోషల్, ట్రైబల్ వేల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు 26 ఉండగా, వాటి పరిధిలో 8,650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మాత్రం జూన్ చివరి వారంలో క్లాత్ సరఫరా కాగా, వారికి యూనిఫాంలు కుట్టి అందించారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 17,300 యూనిఫాంలు అందించాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఒక్కో జత అందించినట్లు తెలిసింది.క్లాత్ ఆలస్యంగా వచ్చింది విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించిన బాధ్యతలు గ్రామీణాభివృద్ధి (సెర్ప్) శాఖకు అప్పగించారు. క్లాత్ రావటం చాలా ఆలస్యం అయింది. కుట్టిన యూనిఫాంలు కుట్టినట్లు విద్యార్థులకు సరఫరా చేయాలని చెప్పాం. – రాజు, డీఈఓ -
సీపీఆర్‌పై అవగాహన అవసరం
మెదక్‌జోన్: అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతో కీలకమని, ప్రతి పోలీస్‌కు దీనిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో వైద్య నిపుణుల సహాయంతో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. సీపీఆర్ చేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెమో ద్వారా వివరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తిస్తారని, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి ముందుగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్ అందించడం వల్ల సదరు వ్యక్తి బతికే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ సీఐ మహేశ్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యూత్ ఫర్ సేవా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొడుకులు కూడు పెడ్తలేరు
నర్సాపూర్: వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులు అన్నం పెట్టడం లేదని మండలంలోని రెడ్డిపల్లికి చెందిన వృద్ధ దంపతులు భద్రయ్య, నాగమణిలు రోదిస్తున్నారు. శనివారం నర్సాపూర్‌లో భద్రయ్య మాట్లాడుతూ.. తన పేరుపై ఉన్న పొలాన్ని తమ పేరుపై పట్టా చేయాలని ఆరునెలల క్రితం తన ఇద్దరు కుమారులు కోరారని తెలిపారు. తాను పొలాన్ని వారి పేరుపై మార్చకపోవడంతో చంపుతామని బెదిరించారని వాపోయారు. వారి బెదిరింపులకు భయపడి తన పొలాన్ని వారి పేరుపై పట్టా చేయించినట్లు చెప్పారు. కాగా పొలం వారి పేరుపై మారినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదన్నారు. తమకు అన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఇటీవల ఎస్పీ శ్రీనివాస్‌రావును సైతం కలిశామని వివరించారు. ఎస్ఐ రంజిత్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా వారి ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశామని చెప్పారు. -
ఊరికో వెబ్సైట్
● ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్ట్‌లో మూడు గ్రామాల్లో రూపకల్పన ● సిద్దిపేట జిల్లాలో కూరెళ్ల, సంగారెడ్డిలో చిన్నలోని, మెదక్‌లో నందగోకూల్ జీపీలు ● ప్రత్యేక అధికారుల నియామకం ఒక్క క్లిక్‌తో గ్రామ సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పల్లెలోని ప్రతి అంశం.. వీధిదీపాల నుంచి వార్షిక బడ్జెట్ కేటాయింపుల దాకా క్షణాల్లో తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలోని ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మూడు గ్రామాల వెబ్సైట్లు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్‌లో ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీల వెబ్ సైట్లను రూపొందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల, మెదక్ జిల్లా నందగోకూల్ గ్రామ పంచాయతీ, సంగారెడ్డి జిల్లా చిన్నలోని గ్రామ పంచాయతీలను పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా వెబ్సైట్ల రూపకల్పన చేశారు. వెబ్సైట్లో పంచాయతీ కోడ్, వైశాల్యం, జనాభా, కుటుంబాలు, గృహాలు, రేషన్ కా ర్డులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, పంచాయతీ, మండల, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధు లు, అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు, రహదారులు, న ల్లాలు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, మహిళా సంఘాలు ఇలా సమస్త సమాచారం ఉండనుంది. మూడేళ్ల ప్రణాళిక గ్రామ పంచాయతీలో 2026–27, 2027–28, 2028–29 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చేసే సమగ్ర అభివృద్ధి సమాచారం పొందుపరచనున్నారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, వీబీ రామ్‌జీ ఆధ్వర్యంలో చేసే పనులు, స్వచ్ఛభారత్ మిషన్, జీపీకి అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్‌కు సంబంధించిన నివేదికను తయారు చేసి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. అధికారుల నియామకం ప్రత్యేకంగా వెబ్ సైట్లను రూపొందించేందుకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. సంగారెడ్డి, సిద్దిపేటలకు రూరల్ డెవలప్మెంట్ విజిలెన్స్ అధికారి ఉమారాణి, మెదక్ జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ విజయరావులను నియమించారు. వీరు పల్లెలకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు. కూరెళ్ల పంచాయతీ వివరాలు సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామ జనాభా 2,586. అందులో పురుషులు 1,236, మహిళలు 1,350 మంది ఉన్నారు. కుటుంబాలు 623, రైతులు 854, వాటర్ సోర్స్ ఐదు చెరువులు, అంతర్గత రోడ్లు 9.9కిలో మీటర్లు, బీటీ రోడ్లు 1.5కిలో మీటర్లు, సీసీ రోడ్లు 2.4కిలో మీటర్లు, గ్రావెల్ రోడ్లు4.5కిలో మీటర్లు, విద్యుత్ స్తంభాలు 252, ఎల్ఈడీ లైట్లు 238, ఓపెన్ సీసీ డ్రైనేజీ 1.5కిలోమీటర్లు, కచ్చా డ్రైన్ 45మీటర్లు, ఆర్సీసీ హౌస్‌లు 319, రేకుల ఇళ్లు 71, పెంకుటిళ్లు 228, స్వయం సహాయక సంఘాలు 65, ట్యాప్ కనెక్షన్లు 601 ఇలా పలు వివరాలతో సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రస్తుతం వెబ్సైట్ అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పబ్లిక్ డోమైన్గా అందుబాటులోకి రానుంది. -
విత్తన రశీదు ఉంటేనే..
సన్న ధాన్యానికి బోనస్ రావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ఈసారి నిబంధన పెట్టింది. 7 రకాల విత్తనాలను సాగుచేసిన రైతులు ఏ డీలర్ వద్ద కొనుగోలు చేశారో, ఆ రశీదు ఆధారంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. వారికే రూ.500 బోనస్ వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు. విత్తనాలు కొనుగోలు చేసి 2 నెలలు గడిచిపోయాయని, ఇప్పుడు రశీదు కోసం డీలర్ వద్దకు వెళ్లాలంటే ఎలాగని రైతులు మండి పడుతున్నారు. రశీదు పోయిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొర్రీలు పెట్టడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారుల తప్పు..
వాహనాలకు తుప్పుమెదక్ కలెక్టరేట్: చెత్త సేకరణ వాహనాలపై అధికారుల చిత్తశుద్ధి కరువైంది. రూ.లక్షల విలువైన వాహనాలు తుప్పు పడుతున్నాయి. మున్సిపాలిటీకి సంబంధించిన రెండు ట్రాక్టర్లు, ఒక లారీ, 10 ఆటోలు పట్టణంలోని మిలటరీ కాలనీలో గల సంప్‌హౌస్ వద్ద మూలన పడేశారు. పదేళ్లుగా వాటిని పట్టించుకోకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టి మట్టిలో కూరుకుపోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నవీన్‌ను వివరణ కోరగా, తనకు సమాచారం లేదని తెలిపారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. -
లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించండి
మెదక్ కలెక్టరేట్: జాతీయ లోక్ అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి, ఎక్కువ మంది కేసుల్లో రాజీపడేలా కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ న్యాయవాదులకు సూచించారు. శుక్రవారం మెదక్ కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధికంగా కేసులు రాజీపడేలా చర్యలు చేపట్టాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవచ్చని, తద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలకు చెందిన స్టాండింగ్, డిఫెండెంట్ కౌన్సిల్స్ పాల్గొన్నారు. -
సరికొత్త ఒరవడి
సర్కారు బడి..సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తున్నారు. తొలుత ఏఐ నేర్చుకోవాలనుకునే ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 168 మంది ఉపాధ్యాయులున్నారు. వచ్చే నెల 5 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ బాధ్యతలను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విద్యాశాఖ అప్పగించింది. వీరికి వచ్చే నెల 5వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రోజు రాత్రి 7 గంటల నుంచి 8:30గంటల వరకు జూమ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేషన్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లో ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. విద్యార్థుల డేటాగోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత శిక్షణ తోపాటు త్వరలో ఏఐ వినియోగంపై ప్రాక్టికల్ వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. కేవలం 168 మందే ఆసక్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులున్నారు. ఇందులో కేవలం 168 మందే ఏఐ శిక్షణకు ముందుకు రావడం చూస్తుంటే.. కొత్త పరిజ్ఞానం నేర్చుకోవాలని మక్కువ ఎంతమందికి ఉందో తెలుస్తోంది. త్వరలో నిర్వహించే మరో విడత శిక్షణకై నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 168 మంది ఉపాధ్యాయులు -
చేయూతకు ‘హెల్ప్‌డెస్క్’
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: చేయూత పింఛన్ల దరఖాస్తుల్లో సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈనెల 26వ తేదీన దివ్యాంగుల కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక యూడీఐడీ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేయూత పింఛన్ల దరఖాస్తులను లబ్ధిదారులు మండలం, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఈనెలాఖరుతో గడువు ముగియనున్నట్లు చెప్పారు. ఏమైనా సమస్యలుంటే కలెక్టరేట్లో గల హెల్ప్‌డెస్క్ 8008556112 నంబర్లో సంప్రదించాలన్నారు. అలాగే ఈనెల 23 నుంచి చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతాయని, వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సహకరించాలని కలెక్టర్ సూచించారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నిషేధిత 22–ఏ జాబితాలో చేర్చిన భూముల వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపతరం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంతో చెప్పాలన్నారు. నిషేధిత జాబితాలో భారీగా భూములు చేరడం వెనక కుట్ర దాగి ఉందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని బచ్చురాజ్‌పల్లి, నస్కల్, నిజాంపేట గ్రామాల పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ గణేశ్ తె లిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 గ్రామాల సబ్‌స్టేషన్ పరిధిలో గల వ్యవసాయ భూములకు 3 ఫేజ్ విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. రామాయంపేటలో.. రామాయంపేట(మెదక్): మెదక్ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలో కరెంటు సరఫరా ఉండదని ట్రాన్స్‌కో ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈవిషయాన్ని వినియోగదారులు గమనించాలని సూచించారు. నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పెద్దచింతకుంట)లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జనరల్ అభ్యర్థులకు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత కలిగి, బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రా ధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 25న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెమో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ త్వరతగతిన కుట్టించాల్సిన బాధ్యత మండల ఏపీఎంలపై ఉందని ఐకేపీ డీపీఎం రమేశ్‌బాబు అన్నారు. శుక్రవారం హత్నూర ఐకేపీ కార్యాలయంలో యూనిఫారాలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 23 గ్రామీణ మండలాల్లోని 945 పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతితో పాటు కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న మొత్తం 61,777 విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12,461 యూనిఫామ్స్ కుట్టడం పూర్తయిందన్నారు. 7,563 యూనిఫారాలను ఇప్పటికే విద్యార్థులకు అందించామన్నారు. ప్రస్తుతం మరో రెండు వేలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
పాడి రైతుకు చేయూత
● లీటర్‌కు రూ. 6 చొప్పున పెంపు ● గేదెల కొనుగోలుకు రుణాలు ● సబ్సిడీపై దాణ సరఫరా మెదక్‌జోన్: విజయ డెయిరీ పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గేదె పాలకు లీటర్‌కు రూ. 6 చొప్పున, ఆవుపాలకు లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 1,050 మంది పాడి రైతులు ప్రభుత్వాధీనంలో కొనసాగే విజయ డెయిరీకి నిత్యం 3,400 లీటర్ల పాలు పోస్తున్నారు. ఇందులో పాల నాణ్యతను బట్టి (ప్యాడీ) లీటర్‌కు రూ. 50 నుంచి మొదలుకుని రూ. 85 వరకు చెల్లిస్తున్నారు. తాజాగా ఈనెల 16 నుంచి పాల ధరలు పెంచారు. దీంతో ప్రస్తుతం లీటర్ రూ. 56 నుంచి మొదలుకుని రూ.91 వరకు చెల్లిస్తున్నారు. అలాగే ఆవు పాలకు మొన్నటి వరకు లీటర్‌కు రూ. 42 ఉండగా, ప్రస్తుతం రూ.44కు పెంచటంతో పాటు లీటర్‌పై రూ. 2 అదనంగా వస్తోంది. అంతే కాకుండా పాడి గేదెలకు అందించే దాణాను సబ్సిడీతో సరఫరా చేస్తుండగా, గేదెల కొనుగోలు కోసం రూ.లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి పాడి రైతులకు రుణాలు ఇప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. -
యాప్‌సోపాలు
వారం రోజుల క్రితం పాపన్నపేట మండలం కొడుపాకకు చెందిన కాశినాథ్ కుటుంబీకులకు మంబోజిపల్లిలోని డీసీఎంఎస్ పేరిట 19 యూరియా సంచులు బుక్ అయ్యాయి.దీంతో రూ.1000 ఖర్చు చేసి ట్రాక్టర్ కిరాయికి తీసుకొని, మరో ఇద్దరు మనుషులకు కూలీ డబ్బులు చెల్లించి ఆ షాపు వద్దకు వెళ్లగా.. అది ఎప్పుటి నుంచో మూసివేసి ఉందని తెలిసి లబోదిబోమన్నారు. ‘కొత్తపల్లి సొసైటీకి రెండు రోజుల క్రితం 560 బ్యాగుల యూరియా వచ్చింది. కానీ యాప్‌లో సుమారు రెండు వేల బస్తాలు బుక్ అయ్యాయి. బుక్ చేసుకున్న రైతులు ఆశతో సొసైటీకి వెళ్తే.. మా దగ్గర యూరియా బస్తాలు ఎప్పుడో అయి పోయాయని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. పాపన్నపేట(మెదక్): వానాకాలం సీజన్‌కు సంబంధించి 27,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 19,500 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. కాగా, గతంలో యూరియా బుకింగ్ కోసం ఫర్టిలైజర్ యాప్ వినియోగంలో ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ప్రేం వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్’ పేరిట అన్ని ఎరువుల విక్రయాల కోసం కొత్త యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. అయితే మొదటి యాప్‌లోని సమాచారం, రెండో యాప్‌లోకి రాకపోవడంతో ఇప్పటికే యూరియా తీసుకున్న వారికి మళ్లీ ఎరువులు బుక్ అవుతున్నాయి. దీంతో వచ్చిన వారికే డబుల్ ధమాక అన్నట్లు రెండేసి సార్లు యూరియా లభ్యం అవుతుంది. ఇక రాని వారికి అసలే రావడం లేదని వాపోతున్నారు. పాపన్నపేటలోని ఓ షాప్‌కు 290 బస్తాల యూరియా రాగా, యాప్‌లో 1000 వరకు బుక్ అయ్యాయి. దీంతో రైతులు షాపుకు వచ్చి పడిగాపులు కాసి వెనక్కి మళ్లుతున్నారు. అలాగే పాపన్నపేటలో సాయి సందీప్ ఫర్టిలైజర్ షాప్ లేనే లేదు. గతంలో లక్ష్మీనగర్‌లో ఉన్న షాపు, ఆరు నెలల క్రితమే మూతబడింది. ఈ షాపు పేరిట కూడా వందలాది యూరియా బస్తాలు బుక్ కావడంతో షాపు జాడ కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అలాగే వీరభద్ర షాపు లేకున్నా యూరియా బుక్ అవుతుంది. అలాగే జిల్లాలోని కొంతమంది అధికారుల లాగిన్లు కూడా తప్పుడు మ్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో అసలు షాపులకు యూరియా ఎంతొస్తుంది, యాప్‌లో స్టాక్ ఎంత చూపెడుతుందో తెలియక అటు అధికారులు, ఇటు ఫర్టిలైజర్ షాపు యజమానులు, మరో వైపు రైతులు గందరగోళానికి లోనవుతున్నారు. ఈ విషయమై పాపన్నపేట ఏఓ శ్రీనివాస్‌రాజును వివరణ కోరగా కొత్త యాప్ కావడంతో కొన్ని తప్పులు దొర్లుతున్నాయన్నారు. త్వరలో సమస్యలు తీరిపోతాయని చెప్పారు. యూరియా కావాల్సినంత ఉందని, ఆందోళన చెందవద్దని సూచించారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి బిజ్లిపూర్కు చెందిన పలువురు రైతులు యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకున్నారు. నర్సాపూర్ లోని భవాని ఫర్టిలైజర్‌లో ఈనెల 19, 20 తేదీలో యూరియా తీసుకునేందుకు వెళ్లగా, రెండురోజులుగా మూసి ఉంది. అక్కడి నుంచి ఫర్టిలైజర్ దుకాణం ఎత్తేసినప్పటికి యాప్‌లో బుకింగ్ అవుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ వ్యవసాయ అధికారి దీపిక దృష్టికి తీసుకెళ్లగా.. సదరు ఫర్టిలైజర్ షాపును బుకింగ్ యాప్ నుంచి తొలగించాలని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. లేని షాపుల పేరిట బుకింగ్ గందరగోళంలో అన్నదాతలు -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
కలెక్టర్ ప్రతిమాసింగ్ హవేళిఘణాపూర్(మెదక్): తేనెటీగల పెంపకంపై రైతులు ఆసక్తి చూపితే ఉపాధితో పాటు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మక్తభూపతిపూర్‌లో రైతు జయపాల్‌రెడ్డి పొలంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతు సాగు చేసిన డ్రాగెన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. తేనెటీగల పెంపకానికి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుకు 40 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్‌సింగ్, డీఏఓ దేవ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు. నెలాఖరులోగా టీఫైబర్ నెట్ మెదక్ కలెక్టరేట్: ఈనెలాఖరులోగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ–ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోడల్ ఆఫీసర్ నియమిస్తామన్నారు. సమగ్ర ప్రణాళిక రూ పొందించి త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫారంపాండ్లతో భూగర్భ జలాల పెంపు తూప్రాన్: భూగర్భ జలాల పెంపునకు ఫారంపాండ్లు దోహదపడతాయని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని ఇస్లాంపూర్‌లో ఉపాధిహామీ పనుల్లో భాగంగా ఫారంపాండ్ల పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో భూగర్భజలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఫారంపాండ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మండలంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీఓ సంతోశ్‌రెడ్డి, టీఏ సత్యం, పంచాయతీ కార్యదర్శి కల్పన ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పేటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్లు, కేజీబీవీ వద్ద రూ.10 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు, మండల పరిధిలోని మక్తలక్ష్మాపూర్‌లో రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ, బూర్గుపల్లిలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం పనులకు భూమిపూజ చేశారు. రైతులకు ఈ గోదాం పంటలు నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, పీఆర్ ఏఈ వెంకట్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, నాయకులు నారాగౌడ్, మురళిపంతులు, సంతోష్, కుంట్ల రాములు, సుభాష్గౌ డ్, సుభాష్, సుధీర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్‌లు జంగం రేణుక, వెంకట్రావు, శ్రీనివాస్, విఠల్, రాజు గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ రూరల్: నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవడం అలవర్చుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ సూచించారు. గురువారం మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంట సాగుకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పెసర, మినుము, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి తక్కువ నీటి వీటి వినియోగంతో పండే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో పెట్టుబడితో పాటు నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ దీపిక, ఏఈఓలు దుర్గాప్రసాద్, తేజస్విని, లావణ్య, రైతులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలలో వ్యవసాయం, విత్తన సాంకేతికతలో ఆరునెలల వృత్తివిద్యతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్‌పై ఏడాది ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఫీల్ మేనేజర్ జగదీశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యకు పదో తరగతి పాస్, మార్కెటింగ్ విద్యకు ఇంటర్మీడియెట్ పాస్ అయిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శిక్షణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పంటలసాగు, బోధన, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ 30 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. వివరాలకు 9381959372, 8466942278 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే దారిలో ఈనెల 23 నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకొని బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని కోరారు. నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వయా మిర్జాపల్లి డబుల్ రోడ్డు మార్గంలో బస్సులు, కార్లు, డీసీఎంలు వినియోగించుకోవాలన్నారు. అలాగే రామయంపేట నుంచి నర్సాపూర్ మార్గం నుంచి ట్రక్కులు, భారీ వాహనాలు వెళ్లాలని సూచించారు. మాసాయిపేట నుంచి మెదక్ ప్రయాణించే వాహనాలు దర్పల్లి మీదుగా చిన్నశంకరంపేట మీదుగా చేరుకోవాలన్నారు. తూప్రాన్ నుంచి వచ్చే వాహనదారులు వెల్దుర్తి–ఉప్పులింగాపూర్, గవ్వపల్లి ద్వారా వెళ్లాలని తెలిపారు. -
యువతకేదీ భరోసా?
● తెరుచుకోని వెబ్సైట్ ● ఐదు నెలలుగా ఎదురుచూపులు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) నీరుగారిపోతుంది. ఏటా మార్చిలో ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావొస్తున్నా నేటికీ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. పథకం గురించి గొప్పగా ప్రచారమే చేయడమే తప్ప ఆచరణలో లబ్ధిదారులకు సరైన ఫలాలు అందిన దాఖలాలు లేవు. దీంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. – మెదక్‌జోన్ జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. దీంతో నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన(పీఎంఈజీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు పొంది చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకులు, పరిశ్రమల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా, మార్చిలోనే రుణాలు పొంది వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా పీఎంఈజీపీ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేటికీ లాగిన్ ఓపెన్ కావడం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన మాత్రం అదుర్స్ ‘పీఎంఈజీపీ’ పథకాన్ని నిరుద్యోగులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సర్వీస్ సెక్టార్‌కు రూ. 20 లక్షల వరకు రుణం లభిస్తుందని, దీనిని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పితే సదరు లబ్ధిదారుడు తీసుకున్న రుణం మొత్తంలో 35 శాతం, అదే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే రూ. 25 శాతం సబ్సిడీ లభిస్తోందని చెబుతున్నారు. అంతే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక్కో వ్యక్తికి రూ. 50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇది కూడా రూరల్ ఏరియాలో ఏర్పాటు చేసుకుంటే రూ. 35 శాతం, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. ఒక్క జనరల్ కేటగిరికి చెందిన (మెన్)కు మాత్రమే సబ్సిడీ తక్కువగా ఉంటుంది. అదే జనరల్ కేటగిరికి చెందిన మహిళ సబ్సిడీ సమానంగా ఉంటుందంటూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకుందామనుకుంటే వెబ్సైట్ ఓపెన్ కాకపోవటంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు. అర్హులు వీరే.. ఈ పథకానికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 8వ తరగతి చదువుకుని ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీఎస్) సభ్యులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు పొంది పరిశ్రమ ఏర్పాటు చేశాక పోస్టల్‌శాఖ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తారు. అప్పుడు సబ్సిడీ లభిస్తోంది. పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు యూనిట్‌ను తప్పనిసరిగా రన్ చేయాలనే నిబంధన ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలు పొందాలంటే బ్యాంకు అధికారుల అనుగ్రహం తప్పనిసరి. లేకుంటే సబ్సిడీ పథకాలు లబ్ధిదారులకు చేరవు. రుణం తీసుకోవాలనుకునే సర్వీస్ బ్యాంకులో కొన్నాళ్ల పాటు అకౌంట్ కలిగి ఉండి, ఇతర రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి ఉండాలనే నిబంధన ఉంది. సకాలంలో చెల్లించకుంటే సిబిల్ స్కోర్ సరిగా లేదని బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు నిరాకరించే ఆస్కారం ఉంది. -
రాజీవ్ సేవలు చిరస్మరణీయం
మెదక్‌జోన్: భారతదేశాన్ని ఆధునికత, సాంకేతిక ప్రగతి వైపు నడిపించిన దార్శనిక నాయకుడు మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ అని ఎమ్మెల్యే రోహిత్‌రావు కొనియాడారు. రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యత, సాంకేతిక అభివృద్ధి విద్య, గ్రామీణ ప్రజాస్వామ్యం, ఆధునిక భారత నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చిన గొప్పనేత రాజీవ్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు -
ప్రతిపక్షాల గొంతునొక్కుతారా?
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం దుబ్బాక: ప్రతిపక్షాల గొంతునొక్కే చర్యలు సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అరాచకమా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే చర్యలు సిగ్గుచేటన్నారు. బుధవారం నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలు దేరిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘శక్తి’ పాలసీని రద్దు చేయండి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను వెంటనే విరమించుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. బుధవారం మెదక్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కీల్ యూనివర్సిటీ జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి సంతోశ్, నాయకులు కార్తీక్, శ్రీవిద్య, సోనీతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఇంటర్‌కు సాంకేతిక సొబగులు
నారాయణఖేడ్: పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఇంటర్ విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కంప్యూటర్ బోధనను చేరువ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో రూ.20 కోట్లతో 80 కళాశాలల్లో అవకాశం కల్పించగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 కళాశాల లకు అవకాశం దక్కింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలోని 12 కళాశాలలకు రూ.3 కోట్లు విడుదల అయ్యాయి. వీటితో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను గదులను ఏర్పాటు చేయనున్నారు. 6 నెలల్లోపు ల్యాబ్‌ల నిర్మాణం ఒక్కో కళాశాలో కంప్యూటర్ గది నిర్మాణం, ఆయా ఏర్పాట్లకు గాను రూ. 25 లక్షల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో గదుల నిర్మాణం, ఫర్నీచర్, విద్యుదీకరణ, ఇతర వసతులను కల్పిస్తారు. పనుల బాధ్యతను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లు పిలిచి త్వరలో పనులు చేపట్టనున్నారు. టెండరు ప్రక్రియ పూర్తయ్యాక ఆరు నెలల్లోపు కంప్యూటర్ ల్యాబ్‌ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి రానున్నాయి. విద్యా సంవత్సరం చివరి వరకు విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 3 కళాశాలలకు ఈ దఫాలో అవకాశం కల్పించారు. సాకేతిక నైపుణ్యం అందించేలా.. ఇంటర్ విద్యలో కంప్యూటర్ బోధన ప్రాథమి క హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరిచయంతో పాటు ఆఫీస్ టూల్స్, ఇంటర్నెట్ వినియోగ, ప్రాథమిక ప్రొగ్రామింగ్ భాషలపై ప్రధానంగా బోధన సాగనుంది. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేలా సిలబస్ ఉండనుంది. మంజూరైన కళాశాలలు ఇవే.. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంగారెడ్డిలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, మెదక్ జిల్లాలోని మెదక్, పాపన్నపేట, కౌడిపల్లి, నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, జగదేవ్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గజ్వేల్‌లోని బాలికల కళాశాలలకు కంప్యూటర్ ల్యాబ్‌లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 12 కేటాయింపు రూ.3 కోట్ల నిధులతో ఏర్పాటు ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు విడుదల -
పార్టీకి కార్యకర్తలే బలం.. బలగం
కొల్చారం(నర్సాపూర్): బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం.. బలగమని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయ్యా యని ఆరోపించారు. గతంలో తెలంగాణను దేశంలోని నంబర్ వన్‌గా నిలిపేందుకు కేసిఆర్ ఎంతో కృషి చేశారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు అండగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేయాలని చూడడం సరికాదన్నారు. సకాలంలో రైతు బీమా చెల్లించకపోవడం, వ్యవసాయానికి 20 గంటల విద్యుత్తు అని చెప్పి 12 గంటలు మాత్రమే ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తా, యూత్ పార్టీ అధ్యక్షుడు సంతోశ్‌రావు, సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
శభాశ్.. వినయ్‌చంద్ర
అమెరికాలో ఉచిత పీజీ మెడికల్ సీటు మెదక్‌జోన్: పట్టణానికి చెందిన యువకుడు ప్రతిభ చాటాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో మెడిసిన్‌లో పీజీ చదివేందుకు ఉచిత సీటు పొందాడు. పట్టణానికి చెందిన డాక్టర్ పోకల సురేష్–నీరజ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు వినయ్ చంద్ర హైదరాబాద్‌లోని అపోలో మెడికల్ కాలేజీలో ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అమెరికాలోని నార్త్‌వెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పీజీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు సంబంధించి మూడు పరీక్షలతో పాటు మూడు సార్లు నిర్వహించిన ఇంటర్వూలో ప్రతిభ కనబర్చి సీటు సాధించాడు. అమెరికాలో మెడిసిన్ పీజీ చేయడానికి లక్షల్లో పోటీపడుతుంటారని విద్యావేత్తలు చెబుతున్నారు. వినయ్ చంద్రకు ఉచితంగా సీటు రావటంతో ఆయన తల్లిదండ్రుల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. రామాయంపేట(మెదక్): ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు. బుధవారం ఎంపీపీ కార్యాలయం ఎదుట కార్మికులు నిర్వహించిన రిలే దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పంచాయతీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు సైతం అందడం లేదని, దీంతో వారు తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా వారి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎంపీ రఘునందన్‌రావు మర్కూక్(గజ్వేల్): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. పాములపర్తి నుంచి శివారు వెంకటాపూర్ వరకు మూడేళ్ల క్రితం బిగించిన వీధిలైట్లు వెలగకపోవడంతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన వీధిలైట్లు వెలిగేదెప్పుడు? అనే కథనానికి ఎంపీ స్పందించారు. బుధవారం మర్కూక్ మండలకేంద్రం, పా ములపర్తిలో వీధిలైట్లను మండల పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకుంటలేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్తయ్య, మహేశ్ గౌడ్, నాయకులు రమేశ్‌గుప్త, రాజేందర్‌సింగ్, కిశోర్‌రెడ్డి, మల్లేశం, మనోహర్ యాదవ్, ప్రసాద్‌రావు, లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు. హుస్నాబాద్‌రూరల్: మండలంలోని తోటపల్లి శివారు గుడిబండ దేవాలయం సమీపంలో ఆదిమానవులు ఆహార సేకరణలో రాతి పనిముట్లను నూరుకున్న సూరుడు గుంతలను చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బుధవారం గుర్తించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తరాతి యుగం నాటి ఆదిమానవులు రాతితో పనిముట్లు తయారు చేసుకొని జీవనం సాగించేవారన్నారు. రాతి పని ముట్లతో వ్యవసాయం, వేట సాగించేవారని, గుడి బండ మీద 30కి పైగా (గూవ్స్) రాతి పనిముట్లు నూరిన గుంతలు ఉన్నాయన్నారు. ఇక్కడే ఒక డోల్మెన్ సమాధిని పోలిన ఆకృతి ఉందని వివరించారు. -
కోతుల నివారణకు పటిష్ట ప్రణాళిక
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కోతుల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో పటిష్ట ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్లో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లు, అటవీశాఖ, జిల్లా పంచాయతీ శాఖల అధికారులతో సమన్వయ సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జిల్లాలో కోతుల బెడద నియంత్రణ ఒక ఉద్యమంలా చేపట్టి దశలవారీగా నిర్మూలించడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా వీటి దాడిలో గాయపడినట్లు ప్రజావాణిలో అనేక విన్నపాలు వచ్చాయన్నారు. అనంతరం ట్రిపుల్ఆర్ భూ సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ‘సర్’పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, బావయ్య, నేషనల్ హైవేస్ మేనేజర్ రాహుల్, రైల్వే ఎస్సీ ధర్మారావు, రాకేష్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
పాపన్నపేట(మెదక్): రాష్ట్రంలో ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన వనదుర్గా భవానీ ఆవరణలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను ధూప దీప నైవేద్య పధకంకింద ఎంపిక చేయాలన్నారు. అర్చకులకు పేస్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీడీఎస్ అధ్యక్షుడు సలాక రాజేశ్వరశర్మ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర శర్మ, రాష్ట్ర కోశాధికారి హరికిషన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్/నిజాంపేట(మెదక్): రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లాలో పలు చోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంగళవారం రాత్రి నర్సాపూర్ మండలంలోని రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టారు. అలాగే నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో విద్య రైస్‌మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైస్‌మిల్లులో ఉన్న నిల్వలను పరిశీలించారు. ● గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల ఆవేదన ● కలెక్టరేట్ ఎదుట ధర్నా మెదక్ కలెక్టరేట్: పదేళ్లుగా పనిచేస్తున్నా.. సరైన వేతనం, ఉద్యోగ భద్రత లేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని మెదక్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధ్యాయులు మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా 339 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. నెలకు కేవలం రూ.12వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపాల్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి, ఉపాధ్యక్షులు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెహానా బేగం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ,కోశాధికారి రేణుక ,టీచర్లు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆమె కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కక్షిదారులకు సత్వర న్యాయపరమైన సేవలు అందేలా చూడాలని, పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రత్యేకతల ఖిల్లా..
● పోస్టు కార్డుపై మెదక్ కోట ముద్రణ ● స్వదేశీదర్శన్ పథకానికి ప్రతిపాదన ● పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ మెదక్ జోన్: మెతుకుసీమలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలు ఉన్నా చెప్పుకోదగ్గ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. రాజుల కాలంనాటి చారిత్రక కట్టడాలు... రుషులు తపస్సు చేసిన ఆధ్యాత్మిక ఆలయాలు ఉన్నాయి. పచ్చటి అడవుల అందాలు, వాటిలో కళ్ల ముందు కదలాడే చుక్కల జింకల పరుగులు, పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, కోయిల రాగాలు వినిపిస్తుంటాయి. నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు అందాలు కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి ప్రాంతం ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక పోవడంతో తాజాగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అతిపెద్ద చర్చి.. మెదక్ జిల్లాలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెదక్ పట్టణాన్ని ఆనుకొని కోటడడ్డపై ఖిల్లాను 12వ శతాబ్దం నాటి కాకతీయుల కాలంలో రెండో ప్రతాప రుద్రుడి హయాంలో నిర్మించారు. ఇక్కడ పంటలు సమృద్ధిగా పండటంతో ఈ ప్రాంతానికి మెతుకు సీమ అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోటను కాకతీయుల అనంతరం ఢిల్లీసుల్తాన్లు, కుతుబ్‌షాలు, చివరగా నిజాం ఆధీనంలోకి చేరింది. ఈ కోటపై భారీ ఫిరంగి, 17వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్‌షాహీ మసీదు, ధాన్యాగారాలు, నీటి సౌకర్యం కోసం నిర్మించిన బావులు, కోటపై నుంచి చూస్తే పట్టణం, ప్రకృతి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చి, ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, నర్సాపూర్‌లోని అర్బన్‌పార్కు, పోచారం అభయారణ్యంలోని జింకల ప్రత్యూత్పత్తి కేంద్రం, దాని పక్కనే పోచారం ప్రాజెక్టు, టేక్మాల్ మండలం వెల్పుగొండలో వెయ్యేళ్ల నాటి తుంబురేశ్వరుడి(శివుడి) ఆలయం, కొల్చారంలోని జైన్మందిరం ఇలా చూడదగిన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు టూరిజంపై దృష్టి సారించలేక పోవటంతో ఇవి చాలా వరకు మరుగునపడ్డాయి. అగ్రగామిగా నిలిపేందుకు ప్రస్తుత కలెక్టర్ ప్రతిమా సింగ్ గతంలో జిల్లాలో అదనపు కలెక్టర్‌గా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్‌గా తిరిగి జిల్లాకు వచ్చారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపాలనే తపనతో పాటు పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత జులైలో సినీ హీరో మంచు విష్ణును ప్రత్యేకంగా జిల్లాకు ఆహ్వానించారు. ఆయన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో పూజలు చేసి మెదక్ ఖిల్లాను సందర్శించి మంత్రముగ్ధుడయ్యారు. స్వదేశీ దర్శన్‌తో నిధులు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా మెదక్ ఖిల్లా అభివృద్ధికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఎంపీ రఘునందన్‌రావు నేతృత్వంలో ఈ నిధులను రాబట్టి ఖిల్లాపైకి రోడ్డు నిర్మాణం, పైనా వెడ్డింగ్ పార్క్ సౌకర్యం కల్పించటం, సెక్యూరిటీ గాడ్స్, పర్యాటకులు బస చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. తపాలాశాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించి పోస్టల్ కార్డుపై మెదక్ ఖిల్లా(ఫోర్ట్)ను ప్రత్యేకంగా ముద్రింపజేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌తో పాటు ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్రావుల చేతుల మీదుగా పోస్టల్ కార్డును ఆవిష్కరింపజేశారు. దీంతో ఖిల్లా చరిత్ర నలుదిశలా వ్యాప్తి చెందనుంది.


