ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

Feb 23 2026 9:00 AM | Updated on Feb 23 2026 9:00 AM

ప్రశా

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష నేడు నిజాంపేటలో కలెక్టర్‌ ప్రజావాణి దరఖాస్తుల ఆహ్వానం రైతులకు సబ్సిడీ పరికరాలు దేశాభివృద్ధే మోదీ లక్ష్యం

మెదక్‌జోన్‌: జిల్లాలో గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 5 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం జిల్లావ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీసీఓ అనురాధ తెలిపారు. ఇందులో 5,024 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 4,838 మంది పరీక్షకు హాజరయ్యారు. 164 మంది గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ లెక్కన 96.3 శాతం పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. కేంద్రాలను పలువురు అబ్జర్వర్లు తనిఖీలు చేశారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని అన్ని ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో నేటి నుంచి ప్రజావాణి కొనసాగుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు నిజాంపేట మండల కేంద్రంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. కాగా కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. మార్చి 2 నుంచి యథావిధిగా ప్రజావాణి ఉంటుందన్నారు. నేడు నిజాంపేటలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి కేజీబీవీలో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మమత పేర్కొన్నారు. అసిస్టెంట్‌ కుక్‌, స్కావెంజర్‌ పోస్టు ఖాళీగా ఉందన్నారు. అసిస్టెంట్‌ కుక్‌కు పదో తరగతి ఉత్తీర్ణత, స్కావెంజర్‌ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణణ ఉండాలన్నారు. ఈనెల 26 వరకు చేగుంట మండలం రెడ్డిపల్లిలో కొనసాగుతున్న పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

టేక్మాల్‌(మెదక్‌): రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్‌ సూచించారు. ఆదివారం టేక్మాల్‌ రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా టేక్మాల్‌, శంకరంపేట్‌ అల్లాదుర్గ్‌, రేగోడ్‌ మండలాల రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యంత్రాలతో కూలీల కొరతను నివారించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రాంప్రసాద్‌, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌, ఆయా మండలాల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, రైతులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

నర్సాపూర్‌రూరల్‌: మండలంలోని మూసా పేట బూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఇంట్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌, నాయకులు వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి కోసం మోడీ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నీలి నగేశ్‌, ప్రధాన కార్యదర్శి గుర్రాల బాలరాజు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు భాస్కర్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష  
1
1/2

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష  
2
2/2

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement