హత్నూర(సంగారెడ్డి): పత్తి పంటపై రైతులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ పేర్కొన్నారు. హత్నూర రైతువేదికలో సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏడీఏ రమాదేవి, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మలు మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతి వల్ల చాలావరకు మొక్కల ఎత్తు తగ్గించి పూత, కాత బాగా వచ్చి ప్రతీ మొక్కకు కాయల సంఖ్య పెంచవచ్చన్నారు. మంచి దిగుబడితో ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డా.ఎన్.హరి, జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా.ఎన్.స్నేహలత, డా.రమేశ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణ అధికారి రమేశ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.


