ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

Mar 7 2026 10:10 AM | Updated on Mar 7 2026 10:10 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రజారోగ్య రాష్ట్ర సంచాలకులు డాక్టర్‌ రవీంద్రనాయక్‌ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు పీహెచ్‌సీలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట నోడల్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు శ్రీనివాస్‌, మహేందర్‌ రెడ్డి, నిర్మల, దీప్తి, మీనా, ఐశ్వర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement