డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా
మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చిందని ప్రిన్సిపా ల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించగా, యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిందన్నారు. 2026– 27 విద్యా సంవత్సరం నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు స్వయంప్రతిపత్తి హోదా వచ్చిందన్నారు. పాఠ్యాంశాల్లో నూతన మా ర్పులతో పాటు నైపుణ్యం గల కోర్సులను ప్రవేశపెట్టడం, పరీక్షా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం వంటి కళాశాల సొంతం చేసుకుంటు ందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు.
నేడు, రేపు రైతులతో
సమావేశం
నర్సాపూర్: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా రేపు, ఎల్లుండి ఆయా రైతులతో అవార్డు విచారణ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. 24న నర్సాపూర్, 25న శివ్వంపేట మండలంలోని రైతులతో అవార్డు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అర్థమయ్యేలా బోధించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): పిల్లలకు అర్థమయ్యేలా ప్రేమతో విద్యా బోధన చేయాలని డీఈఓ విజయ అన్నారు. సోమవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలను సొంత పిల్లల్లా చూడాలన్నారు. అర్థం కాని వారికి మరోసారి బోధించాలని సూచించారు. మహిళా టీచర్లు విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు లలితాదేవి, ఫహీం, ఓంప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నష్టపరిహారం పెంచండి
రామాయంపేట(మెదక్): బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమను ఆదుకోవాలని భూ నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ రజనికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డు నిర్మాణంతో 33 ఎకరాల విలువైన భూమిని కోల్పోతున్నామని, మార్కెట్ ధరకు అనుగుణంగా తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం తమకు సమ్మతంగా లేదని, తాము రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
‘సభ్యులకు సహకరించాలి’
నర్సాపూర్: గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు సీఆర్‌పీలు కృషి చేయాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సరస్వతి సూచించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లోని సీఆర్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభ్యులు కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసే విధంగా తోడ్పాటు అందిస్తూ, వారికి కావాల్సిన శిక్షణతో పాటు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. సభ్యులు అదనపు ఆదాయం పొందే విధంగా సహకరించాలన్నారు. సమావేశంలో నాన్ ఫాం డీపీఎం యాదయ్య, ఏపీఎంలు సంగమేశ్వర్, గౌరిశంకర్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా
డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా


