సేవా భావం కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సేవా భావం కలిగి ఉండాలి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

సేవా భావం కలిగి ఉండాలి

సేవా భావం కలిగి ఉండాలి

నర్సాపూర్‌ రూరల్‌: వృద్ధుల పట్ల సేవా భావం కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి హేమలత ప్రజలకు సూచించారు. శనివారం పట్టణంలోని విజన్‌ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ను సందర్శించారు. ఈసందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్‌ కార్డులు లేకపోవడంతో ఆసరా పెన్షన్‌ అందుకోలేకపోతున్నామని న్యాయమూర్తికి వృద్ధులు మొరపెట్టుకున్నారు. మందులు కొనేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అపర్ణ, సుధాకర్‌రెడ్డి, సుజాతరెడ్డి, అరుణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement