విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంజేపీ జాయింట్‌ సెక్రటరీ మద్దిలేటి, డీఈఓ విజయ, డీసీఓ హరిబాబు, ఎంఈఓ మధుమోహన్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదవి, ఉన్నతస్థాయికి చేరుకొని పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ సృజన, శ్రావణి, ఉపాధ్యాయులు సునీత, నాగరాజు, సంతోశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement