నర్సాపూర్ రూరల్: రైతులు పశు సంపదను పెంచుకొని అభివృద్ధి చెందాలని జిల్లా పశు వై ద్యాధికారి వెంకటయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని ఖాజీపేటలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. పాడి ఉత్పత్తిని పెంచి నాణ్యమైన పాలను నేటి తరానికి అందివ్వాలన్నారు. అనంతరం పశువులకు కావాల్సిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సా పూర్ పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్‌రావు, పశు వైద్యాధికారులు సౌమిత్, స్వప్న, ప్రియాంక, ఫరినా, సర్పంచ్ యాదగిరి గౌడ్, వెటర్నరీ సిబ్బంది ఆంజనేయులు, వెంకటేష్, ఏసుప్రభు రైతులు పాల్గొన్నారు.


