పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కాగా హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీదవంట చేస్తున్నారు.
కోత్లాపూర్‌లో సిలిండర్ కోసం క్యూ లైన్‌లో నిలబడిన జనం


