జిల్లావ్యాప్తంగా 14,007 మహిళా స్వయం సహాయక (ఎస్‌హెచ్‌జీ) గ్రూపు సంఘాలు ఉండగా, వాటిలో 1.44 లక్షల మంది సభ్యులు ఉన్నా రు. వీరంతా సెర్ప్, డీఆర్‌డీఓ శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో రక్త నమూనా లు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపించనుంది. ఈ పరీక్షల్లో వ్యాధులు ఉన్న ట్లు తేలితే వారికి వెంటనే చికిత్స సైతం అందిస్తారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వైద్యం !
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య డిజిటల్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్డులతో మహిళలకు ఆరోగ్య భద్రత లభించనుంది. ఏదేని జబ్బు చేస్తే కార్డు తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రిలో చూపించినా ఉచితంగా వైద్యం అందుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎస్‌హెచ్‌జీ మహిళలకు32 రకాల వైద్య పరీక్షలు
అనంతరం డిజిటల్
హెల్త్‌కార్డుల పంపిణీ
జిల్లావ్యాప్తంగా 1.44 లక్షలమందికి లబ్ధి
రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్
ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రభుత్వం డిజిటల్ హెల్త్‌కార్డులను అందించనుంది. కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లో రానుంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రతి మండలంలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున ఎస్‌హెచ్‌జీ సభ్యుల రక్త నమూనాలు సేకరిస్తాం.
– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ
మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
– మెదక్‌జోన్


