మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుంద ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్పీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.


