మైనార్టీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

మైనార్టీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

Mar 14 2026 10:21 AM | Updated on Mar 14 2026 10:21 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నసీమాషేక్‌తో పాటు వార్డెన్‌ హజీ అలీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల గురుకులంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా వారిని విధులనుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా లెక్చరర్‌ మురళీకి బాధ్యతలు అప్పగించారు.

రూ.147 కోట్లతో

ఏడుపాయల అభివృద్ధి

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల పరిపూర్ణ అభివృద్ధి కోసం రూ.147 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఈఓ వీరేశం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన తనికెళ్ల ఇంటిగ్రేటెడ్‌ కన్సల్టెన్సీ సభ్యులు స్థల పరిశీలన చేశారు. కాటేజీలు, అద్దాల మేడ, క్యూలైన్‌, ఒడిబియ్యం కౌంటర్‌, స్టార్‌ గదులు, బోనాల మంటపం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్టిక్యూటీవ్‌ డైరెక్టర్‌ మాధవి, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రవి పాల్గొన్నారు.

వైద్య శిబిరాలతో మేలు

రామాయంపేట(మెదక్‌): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ప్రగతిధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ శ్రీరాం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింబాద్రి, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

నిల్వ నీటితో అనర్థాలు

రామాయంపేట(మెదక్‌): మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు శుక్రవారం పట్టణంలో డ్రైడే– ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ లావణ్య ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం కుండీల్లో నిల్వ ఉంచిన నీటిని తొలగింపజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ నవనీత, కౌన్సి లర్లు నాగరాజు, రంజిత్‌, శ్యామల, ఆర్పీలు పాల్గొన్నారు.

గ్యాస్‌ కొరత లేదు: ఆర్డీఓ

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని ఆర్డీఓ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం పలువురు అధికారులతో కలిసి కంపెనీకి చెందిన గ్యాస్‌ గోదాం, పలు హోటళ్లలో తనిఖీలు చేసి మాట్లాడారు. ప్రజలకు కావాల్సిన మేర గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎమర్జెన్సీ సర్వీసులకు అవసరం మేర సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను వ్యాపార సంస్థల్లో వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్‌ కొరత పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, ఆర్‌ఐ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement