తప్పుడు కేసులపై హెచ్‌ఆర్‌సీకి వెళ్తాం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులపై హెచ్‌ఆర్‌సీకి వెళ్తాం

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

తప్పుడు కేసులపై హెచ్‌ఆర్‌సీకి వెళ్తాం

తప్పుడు కేసులపై హెచ్‌ఆర్‌సీకి వెళ్తాం

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

మెదక్‌జోన్‌: బీఆర్‌ఎస్‌ నేతలపై పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై త్వరలో హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈసందర్భంగా నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నేతల అక్రమాలను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ నేతలపై 307 సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల ఆరాచకాలపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించటం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు భరించి రాష్ట్రాన్ని తెచ్చామని, ఈ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, అడ్వకేట్‌ జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement