నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు

ఎస్పీ శ్రీనివాసరావు

ఎస్పీ శ్రీనివాసరావు

తూప్రాన్‌: రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడ పడం, మొబైల్‌ ఫోన్‌ వినియోగం, చూపు సమస్యను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణమన్నారు. ఈ మేరకు ఆటో, బస్సు, లారీలు తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించా రు. అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను గోల్డెన్‌ అవర్‌ సమయంలో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐలు జాన్‌రెడ్డి, రంగకృష్ణ, సందీప్‌రెడ్డి, జీఎమ్మార్‌ అధికారులు, సీఎంఆర్‌ ఆస్పత్రి సిబ్బంది, వాహన డ్రైవర్లు, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement