కేన్సర్‌ రహిత సమాజం నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ రహిత సమాజం నిర్మిద్దాం

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

రేపు ఉగాది కవి సమ్మేళనం

మెదక్‌జోన్‌: కేన్సర్‌ రహిత సమాజం కోసం ప్రభుత్వం 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచి తంగా అందిస్తున్న హెచ్‌ిపీవీ వ్యాక్సిన్‌ జిల్లా ఆస్పత్రిలో గురువారం కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైక ల్‌ కేన్సర్‌ నివారణకు ఈ వ్యాక్సిన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. బాలికల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల సమక్షంలోనే టీకా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఉదయం 10గంటలకు ఉగాది కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షుడు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత కోడం పవన్‌కుమార్‌, విశిష్ట అతిథులుగా ప్రముఖకవి, రచయిత, తెరవే రాష్ట్ర అధ్యక్షులు కొండిమల్లారెడ్డి, ఆత్మీయ అతిథిగా సొప్పదండి విద్యాసాగర్‌లు హాజరవుతారన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారం, జ్ఞాపికలు అందించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement