ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్‌ సరఫరా

Feb 28 2026 8:41 AM | Updated on Feb 28 2026 8:41 AM

ఎల్‌స

ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్‌ సరఫరా

● కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు ● సబ్‌స్టేషన్‌ను ముట్టడించితాళం వేసిన గిరిజనులు

● కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు ● సబ్‌స్టేషన్‌ను ముట్టడించితాళం వేసిన గిరిజనులు

రామాయంపేట(మెదక్‌): విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడగా, ఆగ్రహించిన గిరిజనులు శుక్రవారం రాత్రి స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆశాఖ ఉన్న తాధికారులకు సమాచారం ఇవ్వకుండానే కొంతమంది విద్యుత్‌ సిబ్బంది సాయంత్రం ఎల్‌సీ తీసుకొని కాంట్రాక్టు కార్మికుడైన నిజాంపేట మండలం జడ్‌చెరువు తండాకు చెందిన బాబూనాయక్‌ను స్తంభం ఎక్కి ంచారు. స్తంభానికి కరెంట్‌ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడి కింద పడ్డాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని హైదరాబాద్‌ తరలించారు. ఆగ్రహించి న వందలాది మంది గిరిజనులు సబ్‌స్టేషన్‌ ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి అక్కడికి రాగా, వారిని దూషించారు. ఎస్‌ఐ బాల్‌రాజు వా రిని సముదాయించారు. బాధ్యులను సస్పెండ్‌ చేసి వారిపై కేసులు నమోదు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఎల్‌సీ తీసుకున్న విషయం తమకు తెలియదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీఈ తెలిపారు.

ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్‌ సరఫరా 1
1/1

ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్‌ సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement