పకడ్బందీగా మ్యాపింగ్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మ్యాపింగ్‌ ప్రక్రియ

Mar 14 2026 10:21 AM | Updated on Mar 14 2026 10:21 AM

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ నగేష్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు త్వరితగతిన మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బూత్‌స్థాయి అధికారులతో మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డూప్లికేట్‌ ఓట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని వివరించారు. కార్యక్రమంలో మెదక్‌, నర్సాపూర్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement