ముగిసిన సాఫ్‌్టబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సాఫ్‌్టబాల్‌ పోటీలు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ముగిసిన సాఫ్‌్టబాల్‌ పోటీలు

ముగిసిన సాఫ్‌్టబాల్‌ పోటీలు

మెదక్‌జోన్‌: జిల్లా కేంద్రంలోని వెస్లీ క్రీడా మైదానంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడలు సోమవారం రాత్రి ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ పోటీల్లో 25 జిల్లాలకు చెందిన 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లా కు చెందిన బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ బహుమతులకు ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిన వారు నిరుత్సాహ పడొద్దన్నారు. కారణాలు తెలుసుకొని గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, జిల్లా యువజన క్రీడల అధికారి రమేశ్‌తో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement