తొలిరోజు 99.42% హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 99.42% హాజరు

Feb 26 2026 8:52 AM | Updated on Feb 26 2026 8:52 AM

తొలిరోజు 99.42% హాజరు

తొలిరోజు 99.42% హాజరు

● ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు ● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ

● ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు ● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ

మెదక్‌కలెక్టరేట్‌: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు బుధ వారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. జనరల్‌లో 6,035, ఒకేషనల్‌లో 625 కలిపి మొత్తం 6,660 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 6,622 మంది హాజరయ్యారు. మరో 38 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.42 శాతం హాజ రు నమోదైంది. జిల్లాలోని కొల్చారంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సందర్శించారు. మెదక్‌లోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్‌ వేర్వేరుగా పరిశీలించారు. కాగా కేంద్రాల్లో విద్యార్థులకు మెడికల్‌ కిట్‌లు, తాగునీటి వసతులు కల్పించారు. పలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారిణి మాధవి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement