బస్సు ప్రయాణం.. భద్రత కనం
● కనిపించని ప్రథమ చికిత్స కిట్లు
● ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి క్రైమ్: ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యం చే రండి అంటూ ఆర్‌టీసీ అధికారులు చెబుతుంటారు. అది ఒకప్పటి మాట..ఇప్పడు బస్సెక్కితే గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతామో లేదోనన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఇటీవల జిల్లాలో తరుచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన కిట్ల జాడ బస్సుల్లో కానరాదు. మోటార్ వాహనాల చట్టం ప్రకా రం ఆర్‌టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కచ్చితంగా ఉండాల్సిందే. జిల్లాలో తరచూ ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతున్నా అధికారయంత్రాగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
గుంతలమయంగా రహదారులు
మారుమూల గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఒకవైపు రహదారి పనులు మరోపక్క గుంతలున్న రోడ్లపై వెళ్లే సర్వీసులు ఎక్కడో ఒకచోట ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రస్తుతం బస్సుల్లో సిట్టింగ్ సామర్థ్యానికి మించి సుమారు 50 నుంచి 65 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులు అదుపు తప్పినా, ప్రమాదం జరిగి ఎవరైనా గాయపడినా ప్రథమ చికిత్స చేయా ల్సి వస్తోంది. అగ్నిప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టడానికి కనీసం సుత్తి కూడా కనిపించడం లేదు.
చర్యలు తీసుకుంటాం
ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర కిట్ల సమస్య దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే అన్ని బస్సులో అత్యవసర పరికరాలతోపాటు ఫైర్ సేఫ్టీ కిట్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి.
– ఉపేందర్, సంగారెడ్డి, డిపోమేనేజర్
బస్సు ప్రయాణం.. భద్రత కనం


