క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం

క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం

అదనపు ఎస్పీ మహేందర్‌

మెదక్‌ కలెక్టరేట్‌: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అదనపు ఎస్పీ మహేందర్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో పోలీస్‌ పరేడ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా పోలీస్‌ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువత శాతం అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. చివరగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రంగా నాయక్‌, సీఐలు జార్జ్‌, మహేష్‌, కృష్ణమూర్తి, ఎస్‌ఐలు, ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement