రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి

Mar 4 2026 8:58 AM | Updated on Mar 4 2026 8:58 AM

మెదక్‌ కలెక్టరేట్‌: భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని జై భీమ్‌ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్‌ జీ పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర మంగళవారం మెదక్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా గోల్కొండ వీధిలోని అంబేద్కర్‌ కాలనిలో అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రావ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశంలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షల్లో రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్న పత్రం ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జై భీమ్‌ మహాసేన నాయకులు అంజన్న, అశోక్‌, రాణి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

జై భీమ్‌ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్‌ జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement