విశ్వకర్మలతోనే దేశ ఆర్థికాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న కళావృత్తులు, కళలు, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరలోనే టూల్ కిట్స్ అందిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి ఈపథకం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్‌రావు, ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ గుల్షన్‌సింగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు


