వ్యవసాయానికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్‌రావు
మెదక్‌జోన్: వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే రోహిత్‌రావు పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులకు మంగళవారం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరంతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఉచిత బస్సు, సబ్సిడీపై గ్యాస్, రుణమాఫీ లాంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. అంతకు ముందు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


