రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి

Feb 27 2026 10:47 AM | Updated on Feb 27 2026 10:47 AM

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి

నర్సాపూర్‌: రోడ్డు ప్రమాదాలు విధి రాత కాదని, నిర్లక్ష్యం ఫలితమని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నా రు. ‘అరైవ్‌ ఆలైవ్‌’లో భాగంగా గురువారం బీవీఆర్‌ఐటీ కాలేజీ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమా దాల్లో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌శాఖ అరైవ్‌ ఆలైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉ ంటుందనే విషయాన్ని విస్మరించరాదని హితవు పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌రెడ్డి, తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, కాలేజీ డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ శ్రీనివాస్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement