డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి
చేగుంట(తూప్రాన్): అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని డీఆర్డీఓ అదనపు పీడీ సరస్వతి అన్నారు. గురువారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ఆటల పో టీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక స్వావలంబనతో పాటు పిల్లలను బాగా చదివించడం, సామాజిక అంశాలను అవగాహన చేసుకొని స్థానికంగా సమస్యలు పరిష్కరించుకునేలా ఉండాలన్నారు. పిల్లలు ఫోన్ తక్కువగా వాడేలా జాగ్రత్త వహించాలన్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీలు రామస్వామి, శంకర్, స్వేతతో పాటు మహిళలు పాల్గొన్నారు.


