కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్‌కలెక్టరేట్: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు నాగ్రామం అనే స్వభావాన్ని కలిగి ఉండాలని, అప్పుడే అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. అనంతరం ఎమ్మె ల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్‌లు ఎప్పుడూ ముందుంటారన్నారు. రోడ్డు ప్రమాదాలతో మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ఫొటోల ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి తిలకించారు.
ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం
హాజరైన ఎమ్మెల్యే రోహిత్


