ఉపాధి కూలీల సమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల సమస్య పరిష్కారం

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని సూరారంలో ఉపాధి హామీ కూలీల ఫొటో క్యాప్చర్‌ సమస్యను పరిష్కరించినట్లు ఏపీఓ రాజ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఉపాధికి ఫొటో చిక్కులు’ కథనంతో సిబ్బంది స్పందించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశానికి టీఏలు సంపత్‌, లక్ష్మణ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ భానుప్రసాద్‌ చేరుకొని ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించారు. దీంతో పనులకు వచ్చిన అందరి ఫొటోలు క్యాప్చర్‌ అయ్యాయని, వందశాతం కూలీలు పనులకు హాజరైనట్లు పేర్కొన్నారు. అక్కడక్కడ యాప్‌లో సాంకేతిక సమస్య తతెత్తినప్పటికీ తమ సిబ్బంది వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాంపల్లి, ఫీల్డ్‌ ఆసిస్టెంట్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement